షోరూమ్‌కు వచ్చిన ప్రతిఒక్కరూ ఈ తక్కువ ధర కారే కొంటున్నారు.. 32 కి.మీ మైలేజ్, చీప్ అండ్ బెస్ట్

మారుతి సుజుకి (maruti suzuki) ప్రస్తుతం భారత ఆటోమొబైల్ మార్కెట్‌లో నంబర్ 1 బ్రాండ్‌గా తన ఆధిపత్యాన్ని కొనసాగిస్తోంది. చౌక ధర కార్ల నుంచి ప్రీమియం సెగ్మెంట్ మోడళ్ల వరకు, విభిన్న అవసరాలు, బడ్జెట్‌లకు సరిపోయే వాహనాలను అందించడం ద్వారా మారుతి సుజుకి దేశవ్యాప్తంగా కోట్లాది వినియోగదారుల నమ్మకాన్ని గెలుచుకుంది. అందుకే ప్రతి నెలా మారుతి సుజుకి కార్లు రికార్డు స్థాయిలో అమ్ముడవుతుండటం ఆశ్చర్యం కాదు. ఈ విజయ గాథలో ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన కారు మారుతి సుజుకి స్విఫ్ట్ (maruti suzuki swift). భారత మధ్యతరగతి కుటుంబాలకు ఇది ఒక ఫేవరెట్ హ్యాచ్‌బ్యాక్‌గా మారిపోయింది. స్టైలిష్ డిజైన్, యువతను ఆకట్టుకునే లుక్స్, ఆధునిక ఫీచర్లు, ప్రయాణికులకు ఇచ్చే సౌకర్యం ఇవన్నీ కలసి స్విఫ్ట్‌ను ఒక సంపూర్ణ ప్యాకేజీగా నిలబెట్టాయి.

అంతేకాదు, ఈ కారు అందించే మైలేజ్, నమ్మకమైన పనితీరు, అందుబాటులో ఉండే ధర, కొనుగోలుదారులను మరింత ఆకర్షిస్తున్నాయి. డిజైన్ పరంగా చూస్తే, స్విఫ్ట్ ఎప్పటికప్పుడు తన స్టైల్‌ను అప్‌డేట్ చేసుకుంటూ వస్తోంది. స్పోర్టీ లుక్స్‌తో పాటు, లోపలివైపు కూడా డ్రైవర్‌కు, ప్రయాణీకులకు అనుకూలమైన క్యాబిన్ డిజైన్ అందించడం దీని ప్రధాన బలం. నగరాల్లో సులభంగా డ్రైవ్ చేయగలిగే విధంగా ఉండటం, హైవేల్లో సరైన పనితీరును చూపించడం వల్ల అందరికి నచ్చుతోంది.

Maruti Suzuki Swift December 2025 Sales Recorded 18800 Units More Details Inside

ప్రతి నెల లాగానే, డిసెంబర్ 2025లో కూడా మారుతి సుజుకి స్విఫ్ట్ రికార్డు స్థాయిలో అమ్ముడవడం విశేషం. అందుబాటులో ఉన్న నివేదికల ప్రకారం, గత నెలలోనే సుమారు 18,800 కుటుంబాలు స్విఫ్ట్ కారును కొనుగోలు చేసి ఇంటికి తీసుకెళ్లాయి. ఇది స్విఫ్ట్‌కు ఉన్న స్థిరమైన డిమాండ్‌ను మరోసారి నిరూపిస్తోంది. సంవత్సరం చివరి నెల అయినప్పటికీ, అమ్మకాలు తగ్గకుండా ఈ స్థాయిలో కొనసాగడం నిజంగా ప్రశంసనీయం.

తక్కువ ధరకు లభించే స్టైలిష్ హ్యాచ్‌బ్యాక్ కావడంతో, స్విఫ్ట్ కేవలం కస్టమర్లలోనే కాదు, డీలర్ సిబ్బందిలో కూడా మంచి ప్రాచుర్యం పొందిందని సమాచారం. షోరూమ్‌కు వచ్చే చాలా మంది కొనుగోలుదారులు మొదట స్విఫ్ట్‌ను చూడటం, టెస్ట్ డ్రైవ్ చేయడం, చివరికి అదే కారును ఎంచుకోవడం సాధారణంగా మారిపోయిందని డీలర్లు చెబుతున్నారు. మొత్తంగా చూస్తే, స్విఫ్ట్ ఒక కారు మాత్రమే కాదు, భారత మధ్యతరగతి కుటుంబాలకు ప్రతీకగా నిలుస్తోందని చెప్పవచ్చు.

Maruti Suzuki Swift December 2025 Sales Recorded 18800 Units More Details Inside

ప్రస్తుతం భారత మార్కెట్‌లో అందుబాటులో ఉన్న మారుతి సుజుకి స్విఫ్ట్ ధరలు కూడా మధ్యతరగతి వినియోగదారులను దృష్టిలో పెట్టుకుని ఆకర్షణీయంగా నిర్ణయించబడ్డాయి. ఈ కారు బేస్ వేరియంట్ ధర రూ.5.7 లక్షల నుంచి (ఎక్స్-షోరూమ్) ప్రారంభమవుతుండగా, టాప్ వేరియంట్ ధర రూ. 8.7 లక్షలు (ఎక్స్-షోరూమ్) వరకు ఉంటుంది. ఈ ధర పరిధిలో స్టైల్, పనితీరు, మైలేజ్ అన్నింటినీ సమతుల్యంగా అందించే హ్యాచ్‌బ్యాక్‌గా స్విఫ్ట్ ప్రత్యేక గుర్తింపు పొందింది.

ఇంధన ఎంపికల విషయానికి వస్తే, పెట్రోల్, CNG రెండూ ఆప్షన్లలో అందిస్తోంది. పరిశీలిస్తే, స్విఫ్ట్‌లో 1.2 లీటర్, 3 సిలిండర్ పెట్రోల్ ఇంజిన్ అందుబాటులో ఉంది. ఇదే ఇంజిన్‌ను ఆధారంగా చేసుకుని CNG వేరియంట్‌ను కూడా అందిస్తున్నారు. ఈ ఇంజిన్ నగర ట్రాఫిక్‌లో స్మూత్ డ్రైవింగ్‌ను అందించడంతో పాటు, అవసరమైనప్పుడు సరైన పనితీరును కూడా ఇస్తుంది. మైలేజ్ విషయంలో పెట్రోల్ వేరియంట్‌లో లీటరుకు 24.80 కిలోమీటర్ల మైలేజీని అందిస్తుంది.

Maruti Suzuki Swift December 2025 Sales Recorded 18800 Units More Details Inside

అదే CNG వేరియంట్‌లో అయితే ఇది 32.85 కిలోమీటర్ల వరకు మైలేజీ ఇస్తుంది. డ్రైవింగ్ సౌలభ్యం కోసం ఇందులో 5-స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్, 5-స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఎంపికలు ఇవ్వబడ్డాయి. ట్రాఫిక్ ఎక్కువగా ఉండే నగరాల్లో ఆటోమేటిక్ వేరియంట్ డ్రైవర్‌కు మంచి కంఫర్ట్‌ను అందిస్తే, మాన్యువల్ వేరియంట్ మెరుగైన నియంత్రణను ఇస్తుంది.

More from DriveSpark

Article Published On: Monday, January 5, 2026, 15:05 [IST]
English summary
Maruti suzuki swift december 2025 sales recorded 18800 units more details inside
Read more on: #maruti suzuki #india
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+