ఏకంగా 35 కిమీ మైలేజ్.. సరికొత్త స్ట్రాంగ్ హైబ్రిడ్ టెక్నాలజీతో రానున్న అప్‌కమింగ్ మారుతి కార్లు

భారత ఆటోమొబైల్ మార్కెట్లో అత్యంత ప్రజాదరణ పొందిన సబ్-కాంపాక్ట్, మైక్రో ఎస్‌యూవీ సెగ్మెంట్లలో మారుతి సుజుకీ భారీ ప్లాన్ చేసింది. ప్రస్తుతం మార్కెట్ సెంటిమెంట్‌ను శాసిస్తున్న టాటా నెక్సాన్, టాటా పంచ్ కార్ల హవాకు బ్రేకులు వేసేందుకు మారుతి సరికొత్త వ్యూహాన్ని రెడీ చేసింది. రాబోయే మూడు సంవత్సరాలలో ఏకంగా 9 కొత్త మోడళ్లను లాంచ్ చేయాలని ప్లాన్ చేస్తుండగా, అందులో 7 కార్లు కేవలం ఎస్‌యూవీలే కావడం విశేషం. అందులో భాగంగానే వినియోగదారులను ఆకట్టుకునేందుకు విప్లవాత్మకమైన మైలేజ్ ఇంజన్లతో రానున్న 3 సరికొత్త ఎస్‌యూవీల వివరాలు తెలుసుకుందాం.

1. కొత్త మారుతి బ్రెజా ఫేస్‌లిఫ్ట్
మారుతి సుజుకి సంస్థకు అత్యధిక విక్రయాలు తెచ్చిపెట్టే పాపులర్ సబ్-కాంపాక్ట్ ఎస్‌యూవీ బ్రెజా సరికొత్త అప్‌డేట్లతో మార్కెట్లోకి వచ్చేందుకు రెడీ అయింది. ఈ సరికొత్త బ్రెజా ఫేస్‌లిఫ్ట్ మోడల్ రాబోయే జూలై 23వ తేదీన దేశీయంగా గ్రాండ్ లాంచ్ కానుంది. ఈసారి కారు లుక్స్, ఇంటీరియర్ ఫీచర్లలో కస్టమర్ల అవసరాలకు తగ్గట్టుగా కీలక మార్పులు చేశారు.

Maruti Suzuki To Launch 3 New SUVs With 35 kmpl Mileage To Challenge Nexon And Punch

ఈ కొత్త కారులో అతిపెద్ద అప్‌డేట్ దీని ఇంజన్ రూపంలో ఉండబోతోంది. మారుతి ఫ్రాంక్స్ కారులో ఉపయోగించే 1.0-లీటర్ టర్బో బూస్టర్‌జెట్ పెట్రోల్ ఇంజన్‌ను ఈ కొత్త బ్రెజాలో కూడా అందించనున్నారు. ఇది 100bhp పవర్ ప్రొడ్యూస్ చేస్తుంది. 6-స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్‌తో వస్తుంది. ప్రయాణీకుల సేఫ్టీని మరింత పెంచడం కోసం ఈ బ్రెజా ఫేస్‌లిఫ్ట్ కారులో మొదటిసారిగా అడ్వాన్స్‌డ్ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్ (ADAS) టెక్నాలజీని కూడా జోడిస్తున్నారు.

2. కొత్త మారుతి ఫ్రాంక్స్ ఫేస్‌లిఫ్ట్
మారుతి కూపే స్టైల్ క్రాస్ఓవర్ కారు ఫ్రాంక్స్ సరికొత్త మిడ్‌లైఫ్ అప్‌డేట్‌తో సరికొత్త అవతారంలో రాబోతోంది. కంపెనీ ఈ మోడల్‌ను వచ్చే ఏడాది అంటే 2027లో లాంచ్ చేయడానికి సన్నాహాలు చేస్తోంది. ఈ కారు డిజైన్ మరింత ప్రీమియంగా ఉండటంతో పాటు లోపల సరికొత్త డిజిటల్ ఫీచర్లను యాడ్ చేయనున్నారు.

Maruti Suzuki To Launch 3 New SUVs With 35 kmpl Mileage To Challenge Nexon And Punch

ఈ కొత్త ఫ్రాంక్స్ కారులో లభించే అతిపెద్ద ప్లస్ పాయింట్ ఏమిటంటే, మారుతి సుజుకి సొంతంగా అభివృద్ధి చేసిన సరికొత్త స్ట్రాంగ్ హైబ్రిడ్ టెక్నాలజీ. ఈ సరికొత్త హైబ్రిడ్ టెక్నాలజీ ఇంజన్ సహాయంతో నడిచే ఫ్రాంక్స్ కారు లీటర్ పెట్రోల్‌కు ఏకంగా 35 కిలోమీటర్ల కంటే ఎక్కువ మైలేజీని ఇస్తుందని ఆటోమొబైల్ వర్గాల అంచనా. మైలేజ్ ప్రియులకు ఈ కారు ఒక బెస్ట్ ఆప్షన్‌గా మారనుంది.

3. మారుతి కొత్త మైక్రో ఎస్‌యూవీ - కోడ్‌నేమ్ Y43
టాటా పంచ్, హ్యుందాయ్ ఎక్స్టర్ కార్ల లీడర్‌షిప్‌కు గట్టి పోటీ ఇచ్చేందుకు మారుతి సుజుకి ఒక సరికొత్త మైక్రో ఎస్‌యూవీ కారుపై వేగంగా వర్క్ చేస్తోంది. ప్రస్తుతం ఈ కారుకు Y43 అనే కోడ్‌నేమ్ పెట్టారు. ఇటీవలే మార్కెట్లో నిలిపివేసిన మారుతి ఇగ్నిస్ కారు స్థానాన్ని ఈ సరికొత్త మైక్రో ఎస్‌యూవీ భర్తీ చేయనుంది. కంపెనీ దీనిని 2027 చివరి నాటికి మార్కెట్లోకి తీసుకురావాలని భావిస్తోంది.

Maruti Suzuki To Launch 3 New SUVs With 35 kmpl Mileage To Challenge Nexon And Punch

చిన్న కారే అయినప్పటికీ ఇందులో కస్టమర్లకు అనేక రకాల ఇంజన్ ఆప్షన్లను మారుతి అందించబోతోంది. ఈ కారులో మైల్డ్-హైబ్రిడ్ పెట్రోల్, సీఎన్‌జీ ఆప్షన్లతో పాటు ప్యూర్ ఎలక్ట్రిక్, కంప్రెస్డ్ బయో గ్యాస్ (CBG), మారుతి సొంత స్ట్రాంగ్ హైబ్రిడ్ ఇంజన్ వేరియంట్లను కూడా ప్రవేశపెట్టే అవకాశం ఉంది. మిడిల్ క్లాస్ ఫ్యామిలీలను టార్గెట్ చేస్తూ వస్తున్న ఈ కారు ధర సుమారు రూ.6.25 లక్షల నుంచి ప్రారంభం కావచ్చని సమాచారం.

Article Published On: Thursday, July 9, 2026, 11:15 [IST]
English summary
Maruti suzuki to launch 3 new suvs with 35 kmpl mileage to challenge nexon and punch
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+