మార్కెట్ రూపురేఖలు మార్చే విధంగా మారుతి మాస్టర్ ప్లాన్.. రాబోయే రెండేళ్లలో మూడు మోడల్స్ లాంచ్

భారత ఆటోమొబైల్ దిగ్గజం మారుతి సుజుకి (Maruti Suzuki) దేశీ మార్కెట్లో తన ఆధిపత్యాన్ని మరింత సుస్థిరం చేసుకునేందుకు భారీ ప్లాన్ సిద్ధం చేసింది. రాబోయే 2026-27 ఆర్థిక సంవత్సరం ముగిసేలోపు మూడు సరికొత్త కార్లను లాంచ్ చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. తన పాపులర్ మోడల్స్ అయిన బలెనో, బ్రెజా కార్లను కొత్త హంగులతో (Facelift) తీసుకురావడంతో పాటు, మోస్ట్ అవేటెడ్ 7-సీటర్ గ్రాండ్ విటారాను కూడా రంగంలోకి దించుతోంది. ఈ మూడు కార్లు కూడా అత్యాధునిక ఫీచర్లు, పవర్‌ఫుల్ ఇంజిన్ ఆప్షన్లతో రానున్నాయి.

1. మారుతి 7-సీటర్ గ్రాండ్ విటారా (Y17):
మారుతి సుజుకి నుంచి రాబోతున్న మోస్ట్ పవర్‌ఫుల్ వెహికల్ ఇదే. ప్రస్తుతం మార్కెట్లో ఉన్న గ్రాండ్ విటారాకు ఇది ఎక్స్‎టెండెడ్ వెర్షన్. దీనికి 'Y17' అనే కోడ్ నేమ్ ఇచ్చారు. హ్యుందాయ్ అల్కజార్, టాటా సఫారి, మహీంద్రా XUV700 వంటి దిగ్గజాలకు ఇది గట్టి పోటీ ఇవ్వనుంది.

Maruti Suzuki to Launch New Baleno Brezza Facelifts and 7 Seater Grand Vitara by 2027

మూడవ వరుస సీట్ల కోసం ఈ కారు వీల్‌బేస్‌ను పెంచారు. వెనుక వైపు డిజైన్ కొంచెం నిటారుగా ఉండి, లోపల కూర్చునే వారికి మంచి హెడ్ రూమ్ అందిస్తుంది. ఇందులో పనోరమిక్ సన్‌రూఫ్, లెవల్-2 ADAS (అడ్వాన్స్‌డ్ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్), 360-డిగ్రీ కెమెరా, 6 ఎయిర్‌బ్యాగ్‌లు ఉంటాయి. 1.5 లీటర్ నేచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్, 1.5 లీటర్ స్ట్రాంగ్ హైబ్రిడ్ ఇంజిన్ ఆప్షన్లతో రానుంది. ఇది ఆల్-వీల్ డ్రైవ్ (AWD) ఆప్షన్‌ను కూడా కలిగి ఉంటుంది.

2. మారుతి బలెనో ఫేస్‌లిఫ్ట్ (Baleno Facelift):
దేశంలో అత్యధికంగా అమ్ముడవుతున్న హ్యాచ్‌బ్యాక్ బలెనోను మారుతి ఇప్పుడు మరింత ఆధునికంగా తీర్చిదిద్దుతోంది. ఇప్పటికే దీని టెస్టింగ్ కూడా మొదలైంది. కొత్త గ్రిల్, అప్‌డేటెడ్ ఎల్‌ఈడీ డీఆర్ఎల్స్ (DRLs), కొత్త అలాయ్ వీల్స్, కొత్త బంపర్లతో ఈ కారు చాలా స్టైలిష్‌గా కనిపిస్తుంది.

Maruti Suzuki to Launch New Baleno Brezza Facelifts and 7 Seater Grand Vitara by 2027

బలెనోలో మొదటిసారిగా సింగిల్ ప్యానల్ సన్‌రూఫ్ వచ్చే అవకాశం ఉంది. అలాగే పెద్ద టచ్‌స్క్రీన్, ప్రీమియం సీట్ అప్హోల్స్టరీ, పవర్డ్ డ్రైవర్ సీట్ వంటి ఫీచర్లు తోడవుతున్నాయి. ప్రస్తుత 1.2 లీటర్ డ్యూయల్ జెట్ ఇంజిన్‌తో పాటు, కొత్త స్విఫ్ట్‌లో వాడిన 1.2 లీటర్ 3-సిలిండర్ జెడ్-సిరీస్ ఇంజిన్‌ను కూడా ఇందులో ప్రవేశపెట్టే ఛాన్స్ ఉంది.

3. మారుతి బ్రెజా ఫేస్‌లిఫ్ట్ (Brezza Facelift):
మిడ్-సైజ్ ఎస్‌యూవీ సెగ్మెంట్‌లో రారాజుగా ఉన్న బ్రెజాను కూడా మారుతి అప్‌డేట్ చేస్తోంది. ఈ ఫేస్‌లిఫ్ట్ వెర్షన్ యువతను ఆకట్టుకునేలా ఉంటుంది. రివైజ్డ్ ఫ్రంట్ గ్రిల్, షార్ప్ ఎల్‌ఈడీ హెడ్‌లైట్లు, కొత్త డిజైన్ టెయిల్ లైట్లు ఇందులో ప్రధాన ఆకర్షణ. లోపల 10.25 ఇంచుల భారీ టచ్‌స్క్రీన్ ఇన్‌ఫోటైన్‌మెంట్ సిస్టమ్ ఉంటుంది.

Maruti Suzuki to Launch New Baleno Brezza Facelifts and 7 Seater Grand Vitara by 2027

ఎండకాలంలో చల్లగా ఉండేలా వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్స్‎ను మారుతి ఇందులో జోడించనుంది. డ్యాష్‌బోర్డ్‌ను కూడా సాఫ్ట్-టచ్ మెటీరియల్‌తో మరింత ప్రీమియంగా మార్చనున్నారు. 1.5 లీటర్ పెట్రోల్ ఇంజిన్‌తో పాటు, పెర్ఫార్మెన్స్ కోరుకునే వారి కోసం 1.0 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజిన్ ఆప్షన్ కూడా ఇచ్చే అవకాశం ఉంది. అలాగే సీఎన్‌జీ వెర్షన్‌లో సిలిండర్లు కనిపించకుండా ఉండేలా‎అండర్ బాడీ కిట్‎ను అమర్చనున్నారు.

మారుతి సుజుకి తీసుకుంటున్న ఈ నిర్ణయాలు చూస్తుంటే, రాబోయే రోజుల్లో బడ్జెట్ నుంచి లగ్జరీ వరకు అన్ని సెగ్మెంట్లలోనూ తన పట్టును మరింత పెంచుకోనుంది. ముఖ్యంగా 7-సీటర్ ఎస్‌యూవీ రాకతో పెద్ద ఫ్యామిలీల చూపు మారుతి వైపు మళ్లేలా ఉంది. అడ్వాన్స్‌డ్ సేఫ్టీ ఫీచర్లను కూడా జత చేయడంతో కస్టమర్లు ఇక మారుతి కార్ల వైపు కళ్లు మూసుకుని మొగ్గు చూపే అవకాశం ఉంది.

Article Published On: Friday, April 24, 2026, 12:43 [IST]
English summary
Maruti suzuki to launch new baleno brezza facelifts and 7 seater grand vitara by 2027
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+