తొందరపడి పాత కారు కొనకండి.. మారుతి నుంచి మధ్య తరగతి కోసం మంచి మైలేజ్ కార్లు రాబోతున్నాయి

భారత్‎లో నంబర్ వన్ ఆటోమొబైల్ సంస్థ అయిన మారుతి సుజుకి (Maruti Suzuki) రాబోయే 12 నుంచి 18 నెలల్లో సరికొత్త మోడళ్లతో ఇండియన్ ఆటో మార్కెట్‌ను శాసించడానికి పక్కా ప్లాన్ రెడీ చేసింది. మీరు గనుక ప్రస్తుతం కొత్త కారు కొనాలనే ఆలోచనలో ఉంటే.. మరికొన్ని నెలలు ఆగడం చాలా మంచిది. ఎందుకంటే మారుతి సుజుకి తన బెస్ట్ సెల్లింగ్ కార్లయిన బాలెనో, బ్రెజ్జా, ఫ్రాంక్స్‌లకు సరికొత్త అప్‌డేట్ వెర్షన్లను తీసుకురావడంతో పాటు.. ఫ్యామిలీల కోసం సరికొత్త 7-సీటర్ ఎలక్ట్రిక్ కార్లను కూడా లైన్లో పెట్టింది. ఆ అప్‌కమింగ్ 4 అదిరిపోయే కార్ల వివరాలు తెలుసుకుందాం.

1. మారుతి సుజుకి బ్రెజ్జా ఫేస్‌లిఫ్ట్ (Brezza Facelift)
ఇండియన్ రోడ్లపై ఇప్పటికే పలుమార్లు టెస్టింగ్ చేస్తూ దొరికిపోయిన బ్రెజ్జా ఫేస్‌లిఫ్ట్‌లో ఎక్స్‌టీరియర్ పరంగా సరికొత్త అల్లాయ్ వీల్స్, అప్‌డేటెడ్ బాడీ క్లాడింగ్, ప్రీమియం ఎల్‌ఈడీ లైటింగ్ ఎలిమెంట్స్ ఉండబోతున్నాయి. అయితే అసలైన మార్పులు కారు లోపల జరగనున్నాయి.

maruti suzuki upcoming four new cars baleno brezza fronx facelift ymc electric mpv details telugu

ప్రస్తుతం ఉన్న 9-ఇంచుల స్క్రీన్ స్థానంలో కొత్తగా 10.1-ఇంచుల భారీ టచ్‌స్క్రీన్‌ను అమర్చనున్నారు. అంతేకాదు, సీఎన్‌జీ (CNG) లవర్స్ కోసం ఇందులో అండర్‌బాడీ ట్యాంక్ టెక్నాలజీని వాడుతున్నారు. దీనివల్ల డిక్కీ (Boot Space) లో లగేజీ పెట్టుకోవడానికి భారీగా స్థలం దొరుకుతుంది. ప్రస్తుతం ఉన్న 5-స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్‌తో పాటు కొత్తగా 6-స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్ ఆప్షన్‌ను కూడా కంపెనీ జత చేయనుంది.

2. మారుతి బాలెనో ఫేస్‌లిఫ్ట్ (Baleno Facelift)
మారుతి సుజుకి కంపెనీకి చెందిన మోస్ట్ పాపులర్ ప్రీమియం హ్యాచ్‌బ్యాక్ బాలెనో కూడా సరికొత్త మిడ్-లైఫ్ అప్‌డేట్‌తో ముస్తాబవుతోంది. ఈ కొత్త వెర్షన్‌లో కస్టమర్ల సేఫ్టీకి, డిజిటల్ ఫీచర్లకు అత్యధిక ప్రాధాన్యత ఇవ్వనున్నారు.

maruti suzuki upcoming four new cars baleno brezza fronx facelift ymc electric mpv details telugu

కారు ఫ్రంట్ లుక్‌ను మరింత అందంగా మార్చుతూ సరికొత్త గ్రిల్, అప్‌డేటెడ్ ఎల్‌ఈడీ డీఆర్‌ఎల్‌లు (DRLs), సరికొత్త లోయర్ బంపర్‌ను డిజైన్ చేశారు. వెనుక వైపు ఆకట్టుకునే టెయిల్ లైట్స్, కొత్త అల్లాయ్ వీల్స్‌తో పాటు బాలెనో చరిత్రలోనే మొదటిసారిగా సింగిల్ ప్యానెల్ సన్‌రూఫ్ ఫీచర్‌ను కూడా అందించబోతున్నట్లు లీకైన నివేదికలు చెబుతున్నాయి.

3. మారుతి ఫ్రాంక్స్ సిరీస్ హైబ్రిడ్ & ఫ్లెక్స్ ఫ్యూయల్ (Fronx Hybrid)
మారుతి ఫ్రాంక్స్ కారు సరికొత్త సిరీస్ హైబ్రిడ్ (Series Hybrid) టెక్నాలజీతో ఈ ఏడాది మే లేదా జూన్ నెలలోనే మార్కెట్లోకి ఎంట్రీ ఇవ్వడానికి రెడీగా ఉంది. ఇందులో 1.2-లీటర్ Z12E త్రీ-సిలిండర్ పెట్రోల్ ఇంజిన్‌ను అమర్చారు. అయితే ఈ ఇంజిన్ కారు చక్రాలను తిప్పదు, కేవలం బ్యాటరీని చార్జ్ చేయడానికి ఒక జనరేటర్ లాగా మాత్రమే పనిచేస్తుంది.

maruti suzuki upcoming four new cars baleno brezza fronx facelift ymc electric mpv details telugu

కారు చక్రాలు పూర్తిగా ఎలక్ట్రిక్ మోటార్ ద్వారానే నడుస్తాయి కాబట్టి ఇది మైండ్ బ్లాకింగ్ మైలేజీని ఇస్తుంది. దీనితో పాటు భవిష్యత్తు కోసం ఇథనాల్‎తో నడిచే ఈ85 (E85) బ్లెండెడ్ ఫ్లెక్స్ ఫ్యూయల్ వెర్షన్‌ను కూడా 1.5 లీటర్ ఇంజిన్, 6-స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఆప్షన్లతో మారుతి సుజుకి డెవలప్ చేస్తోంది.

4. మారుతి వైఎమ్‌సీ 7-సీటర్ ఎలక్ట్రిక్ ఎంపీవీ (YMC EV)
పెద్ద కుటుంబాల కోసం మారుతి సుజుకి లాంచ్ చేయబోతున్న సరికొత్త 7-సీటర్ ఎలక్ట్రిక్ కారు కోడ్‌నేమ్ YMC. సోషల్ మీడియాలో బాగా ట్రెండ్ అవుతున్న ఈ కారు బ్రెజ్జా, బాలెనోల కంటే చాలా పొడవుగా, ఎత్తుగా ఉంటుంది. దీని డిజైన్ పక్కా బాక్సీ లుక్‌లో ఉంటూ.. క్లోజ్డ్ ఫ్రంట్ గ్రిల్, కారు ముందు, వెనుక భాగంలో వెలిగే పొడవైన ఎల్‌ఈడీ లైట్ బార్స్‎తో రాబోతోంది.

మూడు వరుసల సీట్లు (3-Rows) ఉండే ఈ లగ్జరీ ఈవీ కారులో ప్రయాణికులకు మంచి గాలి, వెలుతురు వచ్చేలా పెద్ద పెద్ద గ్లాస్ ఏరియాలను డిజైన్ చేశారు. మారుతి రాబోయే ఇ-విటారా లాంటి ప్రీమియం అల్లాయ్ వీల్స్‌ను ఈ సరికొత్త ఫ్యామిలీ ఈవీ కారుకు అమర్చనున్నారు.

Article Published On: Wednesday, May 20, 2026, 7:32 [IST]
English summary
Maruti suzuki upcoming four new cars baleno brezza fronx facelift ymc electric mpv details telugu
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+