లీటరుకు 35 కిమీ మైలేజ్.. మధ్య తరగతి, పెద్ద ఫ్యామిలీల కోసం మారుతి సుజుకీ 4 అదిరిపోయే కార్లు
భారతదేశపు అతిపెద్ద కార్ల తయారీ సంస్థ మారుతి సుజుకి (Maruti Suzuki) మరోసారి రోడ్లపై తన ఆధిపత్యాన్ని చాటుకోవడానికి సిద్ధమైంది. మారుతున్న కాలం, కస్టమర్ల అభిరుచులకు అనుగుణంగా ఈ ఏడాది తన లైనప్‌ను భారీ మార్పులతో రీ-లాంచ్ చేసేందుకు ప్లాన్ చేస్తోంది. ఇందులో భాగంగా మిడ్-సైజ్ ఎస్‌యూవీ, హైబ్రిడ్ క్రాస్ ఓవర్, 7-సీటర్ సెగ్మెంట్లలో నాలుగు అదిరిపోయే కార్లను తీసుకురాబోతోంది. ఇవి ఫీచర్లు, మైలేజ్, ధరలో ప్రత్యర్థి కంపెనీలకు గట్టి పోటీ ఇవ్వడం ఖాయంగా కనిపిస్తోంది. మీరు కూడా ఈ ఏడాది కొత్త కారు కొనాలని చూస్తుంటే, ఈ నాలుగు ఆప్షన్లను ఒకసారి పరిశీలించండి.
కొత్త లుక్‌లో మారుతి బ్రెజా ఫేస్‌లిఫ్ట్
మారుతి సుజుకికి అత్యధిక అమ్మకాలను తెచ్చిపెట్టే బ్రెజా (Brezza) త్వరలో సరికొత్త ఫేస్‌లిఫ్ట్ అవతార్‌లో లాంచ్ కానుంది. ఈ కొత్త కారులో సరికొత్త బంపర్లు, అప్‌డేట్ చేసిన ఫాగ్ లాంప్స్, కొత్త డిజైన్ అలోయ్ వీల్స్ వంటి మార్పులు ఉండబోతున్నాయి.

కారు లోపల మరింత ప్రీమియం ఫీలింగ్ కోసం పెద్ద టచ్‌స్క్రీన్, వెంటిలేటెడ్ సీట్లు, వైర్‌లెస్ ఛార్జింగ్ వంటి అడ్వాన్స్‌డ్ ఫీచర్లను జోడించనున్నారు. ముఖ్యంగా ఇంజన్ విషయంలో పెద్ద మార్పు ఉండొచ్చని సమాచారం. ప్రస్తుతం ఉన్న 1.5-లీటర్ ఇంజన్ స్థానంలో ఫ్రాంక్స్ (Fronx)లో వాడే 1.0-లీటర్ టర్బో-పెట్రోల్ ఇంజన్‌ను ప్రవేశపెట్టే అవకాశం ఉంది. దీనివల్ల పన్నులు తగ్గి కస్టమర్లకు ధరలో మేలు జరుగుతుంది.
35 కిమీ మైలేజ్‌తో మారుతి ఫ్రాంక్స్ హైబ్రిడ్
మార్కెట్లోకి వచ్చిన అతి తక్కువ కాలంలోనే సంచలనం సృష్టించిన ఫ్రాంక్స్ (Fronx)కు ఇప్పుడు భారీ మేకోవర్ లభించబోతోంది. ఈ క్రాస్ ఓవర్‌లో కొత్త డిజైన్ బంపర్లు, ఎల్‌ఈడీ లైట్లు, సెక్యూరిటీ కోసం లెవల్-2 ADAS వంటి ఫీచర్లను అందించబోతున్నారు.

అన్నిటికంటే ప్రధానమైన మార్పు ఏంటంటే.. ఇందులో కంపెనీ సరికొత్త స్ట్రాంగ్-హైబ్రిడ్ టెక్నాలజీని వాడుతోంది. ఇందులో 1.2-లీటర్ పెట్రోల్ ఇంజన్ కేవలం జనరేటర్‌లా పనిచేస్తూ బ్యాటరీని ఛార్జ్ చేస్తుంది. ఈ అద్భుతమైన సెటప్ వల్ల ఈ కారు లీటరుకు ఏకంగా 35 కిలోమీటర్ల మైలేజీని ఇస్తుందని అంచనా.
గ్రాండ్ విటారా ఫేస్‌లిఫ్ట్..
మారుతి ఫ్లాగ్‌షిప్ ఎస్‌యూవీ గ్రాండ్ విటారా (Grand Vitara) కూడా ఈ పండుగ సీజన్ నాటికి సరికొత్తగా ముస్తాబవుతోంది. అప్‌డేట్ చేసిన మోడల్‌లో కొత్త ఫ్రంట్ గ్రిల్, కొత్త బంపర్లు, ఆకర్షణీయమైన 17-ఇంచ్ అలోయ్ వీల్స్ రానున్నాయి.

కారు లోపల ఇప్పుడు 10.1-ఇంచ్ పెద్ద ఇన్ఫోటైన్‌మెంట్ స్క్రీన్, ఫుల్-డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, లెవల్-2 ADAS వంటి సేఫ్టీ ఫీచర్లను అందించనున్నారు. ఇంజన్, పవర్‌ట్రెయిన్ విషయంలో పెద్దగా మార్పులు ఉండకపోవచ్చు కానీ, లుక్ పరంగా మాత్రం ఇది మరింత మాస్ సెంటర్ అట్రాక్షన్‌గా మారుతుంది.
పెద్ద ఫ్యామిలీల కోసం గ్రాండ్ విటారా 7-సీటర్
జాయింట్ ఫ్యామిలీలను దృష్టిలో ఉంచుకుని మారుతి ఇప్పుడు గ్రాండ్ విటారా ప్లాట్‌ఫామ్ ఆధారంగా ఒక కొత్త 7-సీటర్ ఎస్‌యూవీని (కోడ్ నేమ్: Y17) అభివృద్ధి చేస్తోంది. మూడవ వరుస ప్రయాణికులకు కూడా ఎక్కువ స్థలం, సౌకర్యం ఉండేలా దీని వీల్‌బేస్‌ను పెంచారు.

ఈ ప్రీమియం ఎస్‌యూవీలో పనోరమిక్ సన్‌రూఫ్, 360-డిగ్రీ కెమెరా, హెడ్-అప్ డిస్ప్లే, స్టాండర్డ్‌గా ఆరు ఎయిర్‌బ్యాగ్‌లు రానున్నాయి. ఇది కూడా ఈ పండుగ సీజన్ నాటికే మార్కెట్లోకి వచ్చే అవకాశం ఉంది. ఇందులో కూడా ప్రస్తుతం ఉన్న గ్రాండ్ విటారాలోని మైల్డ్, స్ట్రాంగ్ హైబ్రిడ్ ఇంజన్ ఆప్షన్లు అందుబాటులో ఉంటాయి.


Click it and Unblock the Notifications