పెద్ద కుటుంబాలు ఉన్న వారి కోసం మారుతి సుజుకి అదిరిపోయే ప్లాన్.. మార్కెట్లోకి 3 అదిరిపోయే ఫ్యామిలీ కార్లు!

భారతదేశంలో కార్ల అమ్మకాల్లో రారాజుగా వెలుగొందుతున్న మారుతి సుజుకి (Maruti Suzuki) భవిష్యత్తుపై భారీ ప్రణాళికలు రచిస్తోంది. రాబోయే రెండు మూడు ఏళ్లలో ఇండియన్ మార్కెట్లో బ్యాక్ టు బ్యాక్ మూడు సరికొత్త MPV (మల్టీ పర్పస్ వెహికల్) కార్లను లాంచ్ చేయడానికి కంపెనీ సిద్ధమవుతోంది. ముఖ్యంగా పెద్ద ఫ్యామిలీ ఉన్న కస్టమర్లను ఆకట్టుకోవడమే లక్ష్యంగా ఈ కార్లను డిజైన్ చేస్తున్నారు. ఈ లిస్టులో కస్టమర్ల ఆల్‌టైమ్ ఫేవరెట్ ఎర్టిగా కొత్త మోడల్‌తో పాటు ఒక ప్రీమియం ఎలక్ట్రిక్ వెహికల్, ఒక బడ్జెట్ ఫ్రెండ్లీ కారు కూడా ఉండటం విశేషం.

కొత్త అవతారంలో మారుతి ఎర్టిగా ఫేస్ లిఫ్ట్
భారతదేశంలో అత్యధికంగా అమ్ముడవుతున్న ఎర్టిగా MPVని సరికొత్త అప్‌డేట్స్‌తో తీసుకురావడానికి మారుతి సుజుకి కసరత్తు చేస్తోంది. ఈ 'ఎర్టిగా ఫేస్‌లిఫ్ట్' (Ertiga Facelift) కారును 2026 చివరి నాటికి లేదా 2027 ప్రారంభంలో మార్కెట్లోకి ప్రవేశపెట్టే అవకాశం ఉంది. ఈ కొత్త వెర్షన్ లో సరికొత్త ఫ్రంట్ గ్రిల్, ఎల్‌ఈడీ హెడ్‌లైట్లు, ఎల్‌ఈడీ డీఆర్‌ఎల్‌లు, ఎల్‌ఈడీ ఫాగ్ ల్యాంప్‌లతో పాటు వెనుక వైపు కనెక్టెడ్ ఎల్‌ఈడీ టెయిల్ లైట్లను అందించనున్నారు.

maruti suzuki upcoming three new family mpv cars ertiga facelift ymc ev ydb

కారు లోపల మరింత ప్రీమియం ఫీచర్లు, 16-ఇంచుల సరికొత్త అలాయ్ వీల్స్ ఉండనున్నాయి. ఇంజన్ పరంగా ప్రస్తుతమున్న 1.5-లీటర్ పెట్రోల్ ఇంజన్ (103 PS పవర్, 137 Nm టార్క్) నే కొనసాగించనున్నారు. ఇది మాన్యువల్, ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఆప్షన్లలో లభిస్తుంది.

మారుతి సుజుకి నుంచి ఫస్ట్ ఎలక్ట్రిక్ ఎమ్‌పీవీ (Maruti YMC)
మారుతి సుజుకి తన మొట్టమొదటి పూర్తి స్థాయి ఎలక్ట్రిక్ ఎమ్‌పీవీ కారును YMC (కోడ్‌నేమ్) పేరుతో అభివృద్ధి చేస్తోంది. ఈ కారు ఈ ఏడాది చివరలో లేదా వచ్చే ఏడాది ప్రారంభంలో మార్కెట్లోకి వచ్చే అవకాశం ఉంది. రాబోయే ఇ-విటారా (e Vitara) ఈవీ కార్లలో వాడే స్కేట్‌బోర్డ్ ఈవీ ఆర్కిటెక్చర్‌ ఆధారంగానే దీనిని నిర్మిస్తున్నారు.

maruti suzuki upcoming three new family mpv cars ertiga facelift ymc ev ydb

ఈ మారుతి వైఎమ్‌సీ కారు 40 kWh, 60 kWh అనే రెండు రకాల బ్యాటరీ ప్యాక్ ఆప్షన్లతో రానుంది. ఇది సింగిల్ ఛార్జ్‌పై ఏకంగా 550 కిలోమీటర్ల వరకు లాంగ్ రేంజ్ ఇస్తుందని కంపెనీ చెబుతోంది. ఇందులో లెవెల్-2 ADAS సేఫ్టీ ఫీచర్లు, 360-డిగ్రీ కెమెరా, పనోరమిక్ గ్లాస్ రూఫ్ వంటి ప్రీమియం ఫీచర్లు ఉండనున్నాయి. ఇది కియా క్యారెన్స్ ఈవీ, బీవైడీ ఈమ్యాక్స్ 7 కార్లకు గట్టి పోటీ ఇవ్వనుంది.

బడ్జెట్ ధరలో మారుతి YDB ఎంట్రీ
అర్టిగా కారు కంటే తక్కువ ధరలో, తక్కువ బడ్జెట్ ఉన్న వారి కోసం మారుతి సుజుకి YDB అనే సరికొత్త సబ్-4 మీటర్ ఎమ్‌పీవీ కారును తీసుకువస్తోంది. జపాన్ మార్కెట్లో ఇప్పటికే మంచి సక్సెస్ సాధించిన సుజుకి స్పేసియా (Suzuki Spacia) కారు ఆధారంగా దీనిని రూపొందిస్తున్నారు. అయితే భారతీయ కస్టమర్ల బడ్జెట్‌కు అనుగుణంగా ధరను ఉంచడం కోసం జపాన్ మోడల్‌లో ఉండే కొన్ని ఖరీదైన ఫీచర్లను (స్లైడింగ్ డోర్లు వంటివి) ఇందులో తొలగించే అవకాశం ఉంది.

maruti suzuki upcoming three new family mpv cars ertiga facelift ymc ev ydb

జపాన్‌లో ఇది 660cc ఇంజన్‌తో వస్తుండగా, ఇండియాకు వచ్చేసరికి ఇందులో 1.2-లీటర్ Z-సిరీస్ పెట్రోల్ ఇంజన్‌తో కూడిన స్ట్రాంగ్ హైబ్రిడ్ టెక్నాలజీని అందించనున్నారు. ఇది లీటరుకు అద్భుతమైన మైలేజీని ఇస్తుందని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి.

Article Published On: Thursday, June 4, 2026, 11:56 [IST]
English summary
Maruti suzuki upcoming three new family mpv cars ertiga facelift ymc ev ydb
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+