కొత్త అల్లుడికి బైక్ బదులు ఈ మారుతి కారు కొనివ్వండి.. ఇప్పుడు ఏకంగా రూ.2.10 లక్షలు తగ్గిందిగా

కొత్తగా కారు కొనాలనే ఆలోచనలో ఉన్న మధ్యతరగతి ప్రజలకు మారుతి సుజుకి బంపర్ ఆఫర్ ప్రకటించింది. మార్కెట్లో హాట్ కేకులా అమ్ముడవుతున్న విక్టోరిస్ సీఎన్‌జీ ఎస్‌యూవీపై ఏకంగా రూ.2.10 లక్షల భారీ డిస్కౌంట్ ఇస్తున్నారు. లీటరుకు 27 కిలోమీటర్లకు పైగా మైలేజ్ ఇచ్చే ఈ ఫ్యామిలీ కారుపై వచ్చిన ఈ డీల్ ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.

దేశంలో రోజురోజుకూ పెరుగుతున్న పెట్రోల్ ధరలతో బెంబేలెత్తిపోతున్న వాహనదారులకు ఈ వార్త నిజంగా పెద్ద ఊరటనిస్తుంది. మారుతి సుజుకి డీలర్ అసోసియేషన్ తమ విక్టోరిస్ సీఎన్‌జీ మోడల్‌పై దేశవ్యాప్తంగా అద్భుతమైన ఆఫర్లను అందిస్తోంది. ఈ కారును కొనుగోలు చేసే కస్టమర్లకు నేరుగా రూ.1,50,000ల ఫ్లాట్ క్యాష్ డిస్కౌంట్ లభిస్తుంది.

maruti suzuki victoris cng suv mega discount offers mileage specifications

దీనితో పాటు మీ పాత కారును ఎక్స్ఛేంజ్ చేసుకుంటే మరో 50,000 రూపాయల అదనపు బోనస్ లభిస్తుంది. ఐటీ కంపెనీలు లేదా కొన్ని ఎంపిక చేసిన కార్పొరేట్ సంస్థలలో పనిచేసే ప్రభుత్వ, ప్రైవేట్ ఉద్యోగులకు మరో 10,000 రూపాయల ఇన్‌స్టిట్యూషనల్ డిస్కౌంట్ కూడా ఇస్తున్నారు. వీటన్నింటినీ కలిపితే మొత్తం 2,10,000 రూపాయల వరకు ఆదా అవుతుంది.

అతి తక్కువ వడ్డీకే బ్యాంక్ లోన్ సదుపాయం
నగదు కొరత ఉన్నవారికి కూడా డీలర్లు అదిరిపోయే ఫైనాన్స్ స్కీమ్స్ ఇస్తున్నారు. మంచి క్రెడిట్ హిస్టరీ, సిబిల్ స్కోర్ ఉన్న కస్టమర్లకు కేవలం 7.60 శాతం వంటి అత్యంత తక్కువ వడ్డీ రేటుతోనే కారు లోన్ సదుపాయాన్ని కల్పిస్తున్నారు. దీనివల్ల నెలవారీ ఈఎంఐ భారం చాలా వరకు తగ్గుతుంది.

maruti suzuki victoris cng suv mega discount offers mileage specifications

అమ్మకాల్లో దూసుకుపోతున్న విక్టోరిస్ ఎస్‌యూవీ
సాధారణంగా అమ్ముడుపోని మోడల్స్ పైనే కంపెనీలు ఇలాంటి పెద్ద డిస్కౌంట్లు ఇస్తుంటాయి. కానీ విక్టోరిస్ విషయంలో సీన్ రివర్స్ లో ఉంది. సెప్టెంబర్ 2025 లో లాంచ్ అయినప్పటి నుంచి కేవలం కొద్ది నెలల్లోనే ఈ ఎస్‌యూవీ ఏకంగా 89,291 యూనిట్ల విక్రయాలతో సరికొత్త రికార్డు సృష్టించింది.

ఈ మొత్తం అమ్మకాలలో ఒంటరిగా సీఎన్‌జీ వేరియంట్ వాటాయే 45 శాతంగా ఉంది. ఈ కారు బేస్ మోడల్ ఎక్స్-షోరూమ్ ధర 1,15,0000 రూపాయల నుంచి ప్రారంభమై టాప్ మోడల్ 1,47,2000 రూపాయల వరకు ఉంటుంది. ఇప్పుడు ఈ భారీ తగ్గింపుతో ప్రైవేట్ కార్ల విభాగంలో దీనికి తిరుగులేకుండా పోయింది.

maruti suzuki victoris cng suv mega discount offers mileage specifications

తిరుగులేని పవర్‌ఫుల్ ఇంజన్ పర్ఫార్మెన్స్
మారుతి విక్టోరిస్ సీఎన్‌జీ కారులో 1.5 లీటర్ సామర్థ్యం గల శక్తివంతమైన కే15సి ఇంజన్‌ను వాడారు. ఇది సీఎన్‌జీ మోడ్‌లో నడుస్తున్నప్పుడు 88 హార్స్‌పవర్ మరియు 121 ఎన్ఎమ్ టార్క్‌ను ప్రొడ్యూస్ చేస్తుంది. అదే పెట్రోల్‌పై నడిపినప్పుడు దీని పవర్ 101 హార్స్‌పవర్‌కు పెరుగుతుంది. ప్రయాణాన్ని సులభతరం చేయడానికి ఇందులో 5 స్పీడ్ మ్యాన్యువల్ గేర్‌బాక్స్ ఇచ్చారు.

మైలేజ్ వింటే దిమ్మతిరగడం ఖాయం
ఈ కారుకు ఉన్న అతిపెద్ద ప్లస్ పాయింట్ దీని మైలేజ్. ఒక కిలో సీఎన్‌జీ ఇంధనానికి ఈ ఎస్‌యూవీ ఏకంగా 27.02 కిలోమీటర్ల మైలేజ్ ఇస్తుందని కంపెనీ అధికారికంగా నిరూపించింది. తక్కువ ఖర్చుతో ఎక్కువ దూరం ప్రయాణించాలనుకునే మిడిల్ క్లాస్ ఫ్యామిలీలకు ఇది పర్ఫెక్ట్ ఛాయిస్.

సీఎన్‌జీ మార్కెట్లో మారుతి సుజుకి హవా
భారతీయ ఆటోమొబైల్ మార్కెట్లో సీఎన్‌జీ వాహనాల హవా నడుస్తోంది. ఒక్క ఏప్రిల్ నెలలోనే మారుతి సుజుకి రికార్డు స్థాయిలో 76,348 సీఎన్‌జీ కార్లను విక్రయించింది. అంటే కంపెనీ అమ్మే ప్రతి నాలుగు కార్లలో ఒకటి సీఎన్‌జీ కావడం విశేషం.

మార్కెట్లో తమ స్థానాన్ని మరింత పటిష్టం చేసుకోవడానికే ఈ భారీ ఆఫర్లు ఇస్తున్నామని కంపెనీ ఉన్నతాధికారి పార్థో బెనర్జీ తెలిపారు. అయితే ఈ డిస్కౌంట్లు వేర్వేరు నగరాల్లోని డీలర్లను బట్టి మారవచ్చు కాబట్టి కొనేముందు మీ స్థానిక షోరూమ్‌లో ఒకసారి సంప్రదించడం మంచిది.

Article Published On: Tuesday, May 26, 2026, 7:34 [IST]
English summary
Maruti suzuki victoris cng suv mega discount offers mileage specifications
Read more on: #maruti suzuki #discounts
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+