ఇదే లక్కీ ఛాన్స్..ఇది మిస్సయితే చాలా నష్టపోతారు..మారుతి లేటెస్ట్ మోడల్ పై ఏకంగా రూ.78000 ఆదా

కొత్త కారు కొనుగోలు చేయాలని ప్లాన్ చేస్తున్నారా ? మరీ ముఖ్యంగా మిడ్-సైజ్ ఎస్‌యూవీ (SUV) కోరుకునే వారికి మారుతి సుజుకి అదిరిపోయే గుడ్ న్యూస్ చెప్పింది. హ్యుందాయ్ క్రెటా వంటి కార్లకు గట్టి పోటీ ఇస్తున్న మారుతి సుజుకి తన ఫ్లాగ్‌షిప్ మోడల్ విక్టోరిస్ (Maruti Suzuki Victoris) పై లాంచ్ అయిన తర్వాత మొదటిసారి భారీ డిస్కౌంట్లను ప్రకటించింది. ఈ ఫిబ్రవరి నెలలో ఈ కారుపై ఏకంగా రూ.78,000 వరకు ఆదా చేసుకునే అవకాశం ఉంది. కేవలం నాలుగు నెలల్లోనే 50 వేల యూనిట్ల అమ్మకాల మార్కును దాటిన ఈ కారుపై ఆఫర్లు ప్రకటించడం ఇప్పుడు ఆటోమొబైల్ రంగంలో హాట్ టాపిక్ గా మారింది.

మారుతి సుజుకి విక్టోరిస్ ప్రస్తుతం ఆరు వేరియంట్లలో అందుబాటులో ఉంది. వీటి ధరలు రూ.10.50 లక్షల నుంచి ప్రారంభమై రూ.19.99 లక్షల (ఎక్స్-షోరూమ్) వరకు ఉన్నాయి. ఫిబ్రవరి 2026 నెలలో వేరియంట్‌ను బట్టి కంపెనీ ప్రకటించిన ఆఫర్లు ఇలా ఉన్నాయి:

Maruti Suzuki Victoris Gets Up to Rs 78 000 Discount in February 2026

Victoris LXi, VXi (పెట్రోల్, సీఎన్‌జీ): ఈ ఎంట్రీ లెవల్ వేరియంట్లపై మొత్తం రూ.50,000 వరకు తగ్గింపు ఉంది. ఇందులో రూ.30,000 కస్టమర్ ఆఫర్ కాగా, రూ.20,000 లాయల్టీ బోనస్ ఉంటుంది. బడ్జెట్ లో కారు కావాలనుకునే వారికి ఇది మంచి ఛాన్స్.

Victoris ZXi & ZXi+: ఈ మిడ్, టాప్ ఎండ్ మోడళ్లపై రూ.61,000 వరకు ఆదా చేసుకోవచ్చు. ఇందులో రూ.41,000 డైరెక్ట్ ఆఫర్, ₹20,000 బోనస్ కలిసి ఉన్నాయి. ఫీచర్లు ఎక్కువగా ఉండాలి అనుకునే వారికి ఇది సరైన ఎంపిక.

Victoris Strong Hybrid: విక్టోరిస్ రేంజ్ లోనే అత్యధికంగా ఈ వేరియంట్ పై రూ.78,000 వరకు బెనిఫిట్ లభిస్తుంది. ఇందులో రూ.48,000 కస్టమర్ ఆఫర్, రూ.30,000 లాయల్టీ బోనస్ ఉన్నాయి. అత్యుత్తమ మైలేజీ ఇచ్చే ఈ కారుపై ఇంత పెద్ద డిస్కౌంట్ రావడం ఇదే మొదటిసారి.

Maruti Suzuki Victoris Gets Up to Rs 78 000 Discount in February 2026
గత ఏడాది సెప్టెంబర్‌లో మారుతి తన ప్రీమియం ఎరీనా డీలర్‌షిప్‌ల ద్వారా విక్టోరిస్‌ను లాంచ్ చేసింది. నెక్సా ఛానల్ ద్వారా అమ్ముడయ్యే గ్రాండ్ విటారా కంటే కొంచెం తక్కువ ధరకు రావడంతో జనం దీనికి బ్రహ్మరథం పట్టారు. కేవలం 4 నెలల్లోనే ఈ కారు 50,000 యూనిట్ల సేల్స్ మార్కును దాటి రికార్డు సృష్టించింది. 2026 జనవరి నెలలో కూడా 15,240 యూనిట్ల అమ్మకాలతో దేశంలోని టాప్ 10 కార్లలో ఒకటిగా నిలిచింది. కాంపాక్ట్ ఎస్‌యూవీ విభాగంలో పోటీని తట్టుకునేందుకు మరియు అమ్మకాలను మరింత పెంచేందుకు మారుతి ఇప్పుడు ఈ వ్యూహాత్మక డిస్కౌంట్లను ప్రకటించింది.

మారుతి విక్టోరిస్ తన శక్తిని గ్రాండ్ విటారా నుంచి తీసుకుంటుంది. ఇందులో మూడు రకాల ఇంజిన్ ఆప్షన్లు అందుబాటులో ఉన్నాయి:
1.5 లీటర్ మైల్డ్-హైబ్రిడ్ పెట్రోల్: ఇది 103hp పవర్ ఇస్తుంది. దీనికి 5-స్పీడ్ మాన్యువల్ లేదా 6-స్పీడ్ టార్క్ కన్వర్టర్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్ జత చేశారు.

Maruti Suzuki Victoris Gets Up to Rs 78 000 Discount in February 2026

1.5 లీటర్ స్ట్రాంగ్ హైబ్రిడ్: మైలేజీ ప్రియుల కోసం ఇది బెస్ట్ ఛాయిస్. 116hp పవర్ ఇచ్చే ఈ ఇంజిన్ ఇ-సివిటి (e-CVT) గేర్‌బాక్స్‌తో వస్తుంది.
1.5 లీటర్ పెట్రోల్-సీఎన్‌జీ: ఆదా కావాలనుకునే వారికి ఇది సరైనది, ఇది 89hp పవర్‌ను ఉత్పత్తి చేస్తుంది, 5-స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్‌మిషన్‌తో వస్తుంది.

విక్టోరిస్ కేవలం లుక్స్ లోనే కాదు, మైలేజీలో కూడా దుమ్మురేపుతోంది. స్ట్రాంగ్ హైబ్రిడ్ మోడల్ ఏకంగా 28.65 కి.మీ. మైలేజీని ఇస్తుందని ARAI ధృవీకరించింది. ఇక సీఎన్‌జీ వెర్షన్ కిలోగ్రాముకు 27.02 కి.మీ. ఇస్తుండగా, పెట్రోల్ మోడల్ 21 కి.మీ. వరకు మైలేజీని ఆఫర్ చేస్తోంది.

ముఖ్యంగా సీఎన్‌జీ మోడల్ లో బూట్ స్పేస్ సమస్య లేకుండా సిలిండర్‌ను కారు అడుగు భాగంలో అమర్చారు. దీనివల్ల డిక్కీలో స్థలం పుష్కలంగా ఉంటుంది. సేఫ్టీ పరంగా కూడా ఈ కారుకు తిరుగులేదు. భారత్ NCAP క్రాష్ టెస్ట్‌లో 5 స్టార్ రేటింగ్ సాధించి అత్యంత సురక్షితమైన కారుగా నిలిచింది. లోపల వెర్టికల్ టచ్‌స్క్రీన్, పనోరమిక్ సన్‌రూఫ్, 360-డిగ్రీ కెమెరా వంటి ఆధునిక ఫీచర్లు ప్రయాణాన్ని మరింత విలాసవంతంగా మారుస్తాయి.

విక్టోరిస్‌తో పాటు మారుతి తన మరో హిట్ మోడల్ గ్రాండ్ విటారా పై కూడా ఆఫర్లు ప్రకటించింది. గ్రాండ్ విటారా బేస్ వేరియంట్ అయిన సిగ్మా పై రూ.25,000 కస్టమర్ ఆఫర్, రూ.35,000 వరకు స్క్రాపేజ్ బెనిఫిట్ లభిస్తోంది. అయితే, గ్రాండ్ విటారాలోని టాప్ వేరియంట్లపై కంపెనీ ప్రస్తుతం ఎటువంటి అధికారిక తగ్గింపులను ధృవీకరించలేదు. స్టాక్ ఉన్నంత వరకు మాత్రమే ఈ ఆఫర్లు వర్తిస్తాయి. కాబట్టి ఆలస్యం చేయకుండా మీ దగ్గరలోని అరీనా షోరూమ్‌ను సంప్రదించడం మంచిది.

More from DriveSpark

Article Published On: Sunday, February 8, 2026, 15:46 [IST]
English summary
Maruti suzuki victoris gets up to rs 78 000 discount in february 2026
Read more on: #maruti suzuki #discounts
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+