ఒక్క నెలలో 14 వేల మంది.. జనాలు బ్రహ్మరథం పడుతున్నారు.. ఈ కారుకు అంత డిమాండ్ ఎందుకో?
మారుతి సుజుకి విక్టోరిస్ (Maruti suzuki victoris) భారతీయ ఆటోమొబైల్ మార్కెట్‌లోకి అడుగుపెట్టిన చాలా తక్కువ కాలంలోనే ఒక ప్రముఖ SUVగా తనకంటూ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకుంది. కొత్త మోడల్ అయినప్పటికీ, లాంచ్ అయిన నాటి నుంచే వినియోగదారుల నుంచి వస్తున్న స్పందన చూస్తే ఈ కారుపై ఎంత స్థాయిలో ఆసక్తి ఏర్పడిందో స్పష్టంగా అర్థమవుతుంది. రోజురోజుకూ పెరుగుతున్న డిమాండ్ విక్టోరిస్‌ను మారుతి సుజుకి లైనప్‌లో ఒక కీలక మోడల్‌గా మార్చింది. ఈ SUV విజయాన్ని తాజా అమ్మకాల గణాంకాలు మరింత బలంగా నిరూపిస్తున్నాయి. డిసెంబర్ 2025 నెలలో మాత్రమే 14,000 యూనిట్లకు పైగా విక్టోరిస్ కార్లు వినియోగదారులకు డెలివరీ కావడం అంటే, మార్కెట్లో దీనికి ఉన్న క్రేజ్ ఏ స్థాయిలో ఉందో చెప్పడానికి ఇదే నిదర్శనం.
సాధారణంగా సంవత్సరం చివరి నెలల్లో కొనుగోళ్ల వేగం కొంత తగ్గుతుందని భావించినా, విక్టోరిస్ విషయంలో మాత్రం ఆ అంచనాలను పూర్తిగా తారుమారు చేసింది. విక్టోరిస్ ప్రయాణం అధికారికంగా సెప్టెంబర్ 16న జరిగిన గ్రాండ్ లాంచ్‌తో ప్రారంభమైంది. లాంచ్ అయిన మొదటి నెలలోనే ఈ SUV మంచి ఆరంభాన్ని నమోదు చేసింది. సెప్టెంబర్ నెలలోనే 4,261 యూనిట్లు అమ్ముడవడం ఒక కొత్త మోడల్‌కు సాధారణ విషయం కాదు.

విక్టోరిస్ డిజైన్, ఫీచర్లు, ధరలపై వినియోగదారులకు ఏర్పడిన పాజిటివ్ అభిప్రాయాన్ని ఇది స్పష్టంగా చూపిస్తుంది. అదే జోరు తరువాతి నెలల్లో మరింత పెరిగింది. అక్టోబర్‌లో 13,496 యూనిట్లు, నవంబర్‌లో 12,300 యూనిట్లు అమ్ముడవడం ద్వారా విక్టోరిస్ అమ్మకాల గ్రాఫ్ స్థిరంగా పైకి ఎగబాకింది. ఇది కేవలం ఒక నెల లేదా రెండు నెలల హైప్ మాత్రమే కాదని, దీర్ఘకాలిక డిమాండ్ ఉన్న SUVగా విక్టోరిస్ మారుతోందని ఈ సంఖ్యలు చెబుతున్నాయి.
ముఖ్యంగా పండుగల సీజన్‌లో కుటుంబాలు కొత్త కారు కొనుగోలు చేయాలనుకునే సమయంలో విక్టోరిస్ చాలా మందికి ప్రాధాన్య ఎంపికగా నిలిచింది. మొత్తంగా చూస్తే, లాంచ్ అయినప్పటి నుంచి డిసెంబర్ 2025 వరకు విక్టోరిస్ నమోదు చేసిన అమ్మకాల ప్రయాణం ఒక సక్సెస్ స్టోరీలా కనిపిస్తోంది. స్టైలిష్ లుక్, మారుతి సుజుకి నమ్మకం, భారతీయ రోడ్లకు సరిపోయే ప్రాక్టికాలిటీ ఈ అన్నిటి కలయికే విక్టోరిస్‌ను తక్కువ సమయంలోనే వినియోగదారులకు దగ్గర చేసింది.

ఈ SUVను మారుతి సుజుకి సరసమైన ధర పరిధిలోనే అందుబాటులోకి తీసుకురావడం వల్ల, మధ్యతరగతి కుటుంబాల నుంచి సెలబ్రిటీలు వరకు అందరూ దీనిపై ఆసక్తి చూపుతున్నారు. ఎక్స్-షోరూమ్ విక్టోరిస్ ధర రూ.10.50 లక్షల నుంచి రూ. 19.99 లక్షల వరకు ఉండటం ఈ సెగ్మెంట్‌లో దీనిని బలమైన ఎంపికగా నిలబెడుతోంది. ఈ ధరలో ఇంత స్టైలిష్ లుక్, టెక్నాలజీ, బ్రాండ్ నమ్మకం కలిసివచ్చే SUV దొరకడం పెద్ద ప్లస్ పాయింట్.
ఈ SUVను మూడు శక్తివంతమైన పవర్‌ట్రెయిన్ ఎంపికలతో మారుతి సుజుకి అందిస్తోంది. రోజువారీ వినియోగానికి మంచి బ్యాలెన్స్ కావాలనుకునే వారికి 1.5-లీటర్ మైల్డ్ హైబ్రిడ్ పెట్రోల్ ఇంజన్ ఉంది. ఇది 103 bhp పవర్, 137 Nm పీక్ టార్క్ను ఉత్పత్తి చేస్తూ, స్మూత్ డ్రైవింగ్ అనుభూతితో పాటు మెరుగైన ఇంధన సామర్థ్యాన్ని అందిస్తుంది. నగర ప్రయాణాలు, హైవే డ్రైవ్‌లకు ఇది సరైన ఎంపికగా నిలుస్తోంది.

ఇక టెక్నాలజీ, ఎఫిషియెన్సీ రెండింటినీ కోరుకునే వినియోగదారుల కోసం 1.5-లీటర్ స్ట్రాంగ్ హైబ్రిడ్(పెట్రోల్ + ఎలక్ట్రిక్) ఇంజన్ అందుబాటులో ఉంది. ఈ పవర్‌ట్రెయిన్ 116 bhp పవర్, 141 Nm పీక్ టార్క్ను ఉత్పత్తి చేస్తుంది. 1.5-లీటర్ CNG ఇంజన్ కూడా ఉంది. ఇది 88 bhp హార్స్‌పవర్, 121 Nm పీక్ టార్క్ను ఉత్పత్తి చేస్తూ, తక్కువ ఖర్చుతో ఎక్కువ దూరం ప్రయాణించే వారికి మంచి పరిష్కారంగా నిలుస్తోంది.
మైలేజ్ విషయంలో కూడా కొత్త మారుతి విక్టోరిస్ చాలా ఆకట్టుకుంటుంది. ఇంజిన్, వేరియంట్‌ను బట్టి ఈ SUV 21 kmpl నుంచి 28.65 kmpl వరకు మైలేజీని అందిస్తుందని కంపెనీ చెబుతోంది. పెరుగుతున్న ఇంధన ధరల నేపథ్యంలో, ఇంత మంచి మైలేజ్ ఉండటం విక్టోరిస్‌ను మరింత ప్రాక్టికల్, ఖర్చు తగ్గించే SUVగా మారుస్తోంది.


Click it and Unblock the Notifications








