డాక్టర్లు, ఇంజనీర్లు ఎక్కువగా ఈ కారే కొంటారు.. రూ.4.99 లక్షలు, 34 కి.మీ మైలేజ్! నెం.1 హ్యాచ్‌బ్యాక్
2025 సంవత్సరం ముగిసిన నేపథ్యంలో భారతదేశంలోని అన్ని ప్రధాన ఆటోమొబైల్ తయారీ సంస్థలు తమ వార్షిక అమ్మకాల గణాంకాలను ఒక్కొక్కటిగా విడుదల చేస్తున్నాయి. ఈ గణాంకాలు దేశీయ ఆటో మార్కెట్‌లోని వినియోగదారుల అభిరుచులు, ట్రెండ్స్, బ్రాండ్‌ల బలం ఏ స్థాయిలో ఉందో స్పష్టంగా చూపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో మరోసారి ఒక విషయం తేటతెల్లమైంది. భారతదేశంలో అత్యధిక కార్లను విక్రయించిన సంస్థగా మారుతి సుజుకి తన ఆధిపత్యాన్ని 2025లో కూడా కొనసాగించింది. మారుతి సుజుకి విజయంలో కీలక పాత్ర పోషించిన మోడళ్లలో వ్యాగన్ ఆర్ ప్రత్యేకంగా చెప్పుకోవాలి. గత కొన్ని సంవత్సరాలుగా భారత మార్కెట్లో స్థిరమైన డిమాండ్‌ను కలిగి ఉన్న ఈ హ్యాచ్‌బ్యాక్, 2025 సంవత్సరంలో కూడా అదే స్థాయిలో వినియోగదారుల ఆదరణను పొందింది.
ఫలితంగా, వ్యాగన్ ఆర్ 2025లో భారతదేశంలో అత్యధికంగా అమ్ముడైన హ్యాచ్‌బ్యాక్ కారుగా నిలిచింది. అధికారిక అమ్మకాల గణాంకాల ప్రకారం, 2025 సంవత్సరంలో మొత్తం 1.94 లక్షల మంది వినియోగదారులు మారుతి సుజుకి వ్యాగన్ ఆర్‌ను కొనుగోలు చేశారు. ఈ సంఖ్య కేవలం ఒక మోడల్ విజయాన్ని మాత్రమే కాకుండా, మారుతి బ్రాండ్‌పై ఉన్న విశ్వాసాన్ని కూడా ప్రతిబింబిస్తుంది. ఈ కారంటే డాక్టర్లు, ఇంజనీర్లకు చాలా ఇష్టం.

సరసమైన ధర, విశాలమైన క్యాబిన్, మంచి మైలేజ్, తక్కువ మెయింటెనెన్స్ ఖర్చులు వంటి అంశాలు వ్యాగన్ ఆర్‌ను భారతీయ మధ్యతరగతి కుటుంబాలకు నమ్మకమైన ఎంపికగా మార్చాయి. ముఖ్యంగా నగరాల్లో రోజువారీ ప్రయాణాలకు అనువుగా ఉండే డిజైన్, కుటుంబంతో కలిసి ప్రయాణించేందుకు సరిపడా స్పేస్, అలాగే మారుతి సుజుకి విస్తృత సర్వీస్ నెట్‌వర్క్ వ్యాగన్ ఆర్‌కు అదనపు బలంగా నిలిచాయి.
బడ్జెట్‌కు భారం కాకుండా, మొదటి కారు కొనాలనుకునే వినియోగదారులకు నమ్మకమైన ఎంపికగా ఈ మోడల్ మార్కెట్లో ప్రత్యేక గుర్తింపు పొందింది. రూ. 4.99 లక్షల నుంచి రూ. 6.95 లక్షల వరకు(ఎక్స్-షోరూమ్) ఉండే ధర కారణంగా, పరిమిత బడ్జెట్‌లో మంచి క్వాలిటీ కారును కోరుకునే వారికి ఇది బలమైన ఆప్షన్‌గా నిలుస్తోంది. ముఖ్యంగా మొదటిసారి కారు కొనుగోలు చేసే కుటుంబాలకు ఇది ప్రాక్టికల్, వాల్యూ ఫర్ మనీ ప్యాకేజీగా అనిపిస్తుంది.

కస్టమర్ల విభిన్న అవసరాలను దృష్టిలో ఉంచుకుని ఈ మోడల్‌ను LXI, VXI, ZXI, ZXI+ అనే నాలుగు వేరియంట్లలో అందుబాటులోకి తీసుకువచ్చారు. ఇంజిన్ విషయానికి వస్తే, మొదటగా 1.0-లీటర్ నేచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజన్ అందుబాటులో ఉంటుంది. స్మూత్ డ్రైవింగ్ అనుభవం కోసం ప్రత్యేకంగా రూపొందించిన ఈ ఇంజన్ 67 bhp పవర్, 89 Nm పీక్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.
ఇది చిన్న కుటుంబాలు, రోజువారీ నగర ప్రయాణాలు, ఆఫీస్ కమ్యూట్‌లకు చాలా అనువుగా ఉంటుంది. పవర్ డెలివరీ సాఫీగా ఉండటం వల్ల ట్రాఫిక్‌లో కూడా డ్రైవింగ్ అలసటను తగ్గిస్తుంది. ఈ ఇంజన్ 5-స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్‌తో పాటు 5-స్పీడ్ AMT ఆటోమేటిక్ ఆప్షన్‌లో కూడా లభించడం మరో ముఖ్యమైన ప్లస్ పాయింట్. ముఖ్యంగా నగరాల్లో ఎక్కువగా ట్రాఫిక్‌ను ఎదుర్కొనే వారికి AMT వేరియంట్ అదనపు సౌకర్యాన్ని అందిస్తుంది.

ఇదే కాకుండా, మరింత శక్తివంతమైన పనితీరును కోరుకునే వినియోగదారుల కోసం 1.2-లీటర్ నేచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజన్ ఆప్షన్ కూడా ఉంది. ఈ ఇంజన్ 90 bhp పవర్, 113 Nm టార్క్‌ను అందించగలదు. డ్రైవింగ్ స్టైల్, ఎంచుకున్న ఇంజిన్ వేరియంట్‌ను బట్టి ఈ కారు 23 kmpl నుంచి 34 kmpl వరకు ఇంధన సామర్థ్యాన్ని అందిస్తుంది.


Click it and Unblock the Notifications








