బైక్ లాగా 34 కి.మీ మైలేజ్ కారు, రూ. 4.99 లక్షలు.. దేశవ్యాప్తంగా ప్రతిరోజూ 532 మంది కొనేశారు!
మారుతి సుజుకి వ్యాగన్‌ఆర్ (Maruti suzuki WagonR)... ఈ పేరు వినగానే చాలా మంది ఇండియన్ ఫ్యామిలీలకు ఒక నమ్మకం గుర్తుకొస్తుంది. సంవత్సరాలుగా భారతీయ రోడ్లపై తన ప్రత్యేక గుర్తింపును నిలుపుకుంటూ వచ్చిన ఈ కారు, ఇప్పటికీ మధ్యతరగతి కుటుంబాలకు సేఫ్ అండ్ స్మార్ట్ ఎంపికగా కొనసాగుతోంది. తక్కువ బడ్జెట్‌లో నమ్మకమైన ఇంజిన్, మంచి స్పేస్, రోజువారీ వినియోగానికి సరిపడే మైలేజ్ ఇవన్నీ లభిస్తాయి. ప్రత్యేకంగా కుటుంబ అవసరాలను దృష్టిలో పెట్టుకుని రూపొందించిన ఈ కారులో హెడ్‌రూమ్, లెగ్‌రూమ్ బాగా ఉండటం పెద్ద ప్లస్ పాయింట్. పిల్లలు, పెద్దవాళ్లు కలిసి ప్రయాణించినా అసౌకర్యంగా అనిపించదు. అదే కారణంగా ప్రభుత్వ టీచర్లు, డాక్టర్లు, ఇంజనీర్లు లాంటి స్థిరమైన వృత్తుల్లో ఉన్నవాళ్లు ఈ కారుపై ఎక్కువగా నమ్మకం పెట్టుకుంటారు.
ఆఫీస్‌కు రోజూ వెళ్లడం, వీకెండ్‌లో కుటుంబంతో బయటకు వెళ్లడం, చిన్న ట్రిప్స్ ప్లాన్ చేయడం అన్నింటికీ ఇది సరిపడే కారుగా వ్యాగన్‌ఆర్ పేరు తెచ్చుకుంది. మైలేజ్ విషయానికి వస్తే, మారుతి సుజుకి బ్రాండ్‌కు ఉన్న బలమే వ్యాగన్‌ఆర్‌కూ ఉంది. పెట్రోల్ ధరలు పెరుగుతున్న ఈ కాలంలో, ఫ్యామిలీ బడ్జెట్‌పై ఎక్కువ భారం పడకుండా మంచి ఇంధన సామర్థ్యాన్ని అందించడం ఈ కారును ఇంకా ఆకర్షణీయంగా మారుస్తోంది.

మెయింటెనెన్స్ ఖర్చులు కూడా తక్కువగానే ఉండటం వల్ల, ఒకసారి కొనుగోలు చేసిన తర్వాత దీర్ఘకాలం వరకు టెన్షన్ లేకుండా వాడుకునే అవకాశం ఉంటుంది. ఈ నమ్మకానికి గణాంకాలే పెద్ద సాక్ష్యం. 2025 సంవత్సరంలో మారుతి సుజుకి వ్యాగన్‌ఆర్ అమ్మకాల పరంగా అద్భుతమైన రికార్డు నమోదు చేసింది. ఒక్క సంవత్సరంలోనే మొత్తం 1,94,238 యూనిట్లు వినియోగదారులకు డెలివరీ చేయబడ్డాయి. అంటే రోజుకు సగటున దాదాపు 532 కార్లు అమ్ముడయ్యాయన్న మాట.
ఇది కేవలం అమ్మకాల సంఖ్య మాత్రమే కాదు, ఈ మోడల్‌పై ఎంత గట్టిగా నమ్మకం పెట్టుకున్నారో స్పష్టంగా చూపిస్తుంది. మారుతున్న ట్రెండ్స్ మధ్యలో కూడా వ్యాగన్‌ఆర్ తన స్థానం కోల్పోకుండా ముందుకు సాగుతోంది. కొత్త కార్లు, కొత్త డిజైన్లు మార్కెట్లోకి వస్తున్నా, వ్యాగన్‌ఆర్ ఇప్పటికీ బలమైన ఎంపికగానే నిలుస్తోంది. అందుకే, ఒక ఫ్యామిలీ కారు కొనాలనుకునే వారికి మారుతి వ్యాగన్‌ఆర్ పేరు ఇప్పటికీ మొదట గుర్తొచ్చే కార్లలో ఒకటిగా ఉంటుంది.

ధర విషయానికి వస్తే, అందుబాటులో ఉండే ఫ్యామిలీ కారు అనే పేరు నిలబెట్టుకుంది. ధర రూ. 4.99 లక్షల నుంచి ప్రారంభమై రూ. 6.95 లక్షల వరకు(ఎక్స్-షోరూమ్) ఉంటుంది. ఈ ధర కారణంగా మధ్యతరగతి కుటుంబాలే కాదు, ఫస్ట్ టైమ్ కార్ కొనుగోలు చేసే వారు కూడా సులభంగా ఎంచుకునే అవకాశం ఉంటుంది. తక్కువ బడ్జెట్‌లో నమ్మకమైన బ్రాండ్ కారు కావాలనుకునే వారికి వ్యాగన్‌ఆర్ ఒక ప్రాక్టికల్ ఆప్షన్‌గా నిలుస్తోంది.
ఇందులో శక్తివంతమైన, పవర్‌ట్రెయిన్ ఆప్షన్లు అందుబాటులో ఉన్నాయి. 1-లీటర్ నేచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజిన్ 67 PS పవర్, 89 Nm పీక్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తూ, రోజువారీ నగర డ్రైవింగ్‌కు చాలా స్మూత్ అనుభవాన్ని ఇస్తుంది. మరింత పవర్ కోరుకునే వినియోగదారుల కోసం 1.2-లీటర్ పెట్రోల్ ఇంజిన్ కూడా ఉంది. ఇది 90 PS పవర్, 113 Nm టార్క్‌ను అందించి, హైవే డ్రైవ్స్‌లోనూ మంచి కాన్ఫిడెన్స్‌ను కలిగిస్తుంది.

ఇంధన ఖర్చులను తగ్గించుకోవాలనుకునే వారికి 1-లీటర్ CNG ఇంజిన్ మంచి ఎంపిక. ఈ వేరియంట్ 57 PS శక్తి, 82 Nm గరిష్ట టార్క్‌ను అందిస్తుంది. వేరియంట్‌ను బట్టి ఈ కారులో 5-స్పీడ్ మాన్యువల్ లేదా 5-స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్ లభిస్తాయి. మైలేజ్ విషయంలో ముందంజలోనే ఉంది. పెట్రోల్, CNG వేరియంట్‌లను బట్టి ఈ కారు సుమారు 23 kmpl నుంచి 34 kmpl వరకు మైలేజీని అందిస్తుంది.


Click it and Unblock the Notifications








