బస్సులు, రైళ్లను మర్చిపోయేలా చేస్తున్న కారు.. పెద్ద కుటుంబాలు కలిసి వెళ్లడానికి బాగా సెట్ అవుద్ది!
భారతదేశంలో కారు కొనుగోలు చేసే చాలా మంది కుటుంబ అవసరాలకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. ముఖ్యంగా ఐదుగురికి పైగా సభ్యులు ఉన్న కుటుంబాలు, ఎక్కువ సీటింగ్ , విశాలమైన క్యాబిన్, సౌకర్యవంతమైన ప్రయాణ అనుభవం కలిగిన ఎంపీవీ (MPV) కార్ల వైపు మొగ్గు చూపుతుంటాయి. ఈ విభాగంలో చాలా కాలంగా మంచి గుర్తింపు సంపాదించుకున్న మోడళ్లలో మారుతి సుజుకి ఎక్స్‌ఎల్6 (Maruti Suzuki XL6) ఒకటి. ఈ కారు ప్రతి నెలా స్థిరమైన అమ్మకాలతో తన మార్కెట్ స్థానాన్ని బలోపేతం చేసుకుంటోంది. ఎస్‌యూవీలకు డిమాండ్ పెరుగుతున్నప్పటికీ, పెద్ద కుటుంబాల కోసం సౌకర్యవంతమైన ప్రయాణాన్ని అందించే MPVగా XL6కు ఇప్పటికీ మంచి ఆదరణ కొనసాగుతోంది.
తక్కువ ఖర్చులో ఎక్కువ మంది కలిసి ప్రయాణించడానికి ఇది పర్ఫెక్ట్ కారు. నగరాల్లో,లాంగ్ డ్రైవ్‌లకు కూడా అనువుగా ఉండటం, తక్కువ నిర్వహణ ఖర్చు, మారుతి సుజుకి విస్తృత సర్వీస్ నెట్‌వర్క్ వంటి అంశాలు ఈ కారును మరింత ఆకర్షిస్తున్నాయి. తాజాగా విడుదలైన జూన్ 2026 అమ్మకాల గణాంకాలు కూడా ఈ ఆదరణను స్పష్టంగా ప్రతిబింబిస్తున్నాయి. ఆ నెలలో మారుతి సుజుకి XL6 మొత్తం 2,711 యూనిట్ల అమ్మకాలను నమోదు చేసింది.

గత ఏడాది ఇదే నెలలో ఈ MPV 2,011 యూనిట్లు మాత్రమే విక్రయించగా, ఈసారి అమ్మకాలు దాదాపు 35 శాతం వార్షిక వృద్ధి నమోదు చేశాయి. పోటీ రోజురోజుకూ పెరుగుతున్న MPV విభాగంలో ఒకే ఏడాదిలో ఇంత మంచి వృద్ధిని సాధించడం ఈ మోడల్‌కు మార్కెట్లో ఉన్న బలమైన డిమాండ్‌ను తెలియజేస్తోంది. రాబోయే నెలల్లో కూడా ఇదే జోరు కొనసాగితే, XL6 మరింత కీలక పాత్ర పోషించే అవకాశం కనిపిస్తోంది.
డిజైన్ పరంగా XL6 ప్రీమియం MPVగా ప్రత్యేక గుర్తింపును కలిగి ఉంది. ముందుభాగంలో స్టైలిష్ LED హెడ్‌ల్యాంప్‌లు, ఆకర్షణీయమైన LED డేటైమ్ రన్నింగ్ లైట్లు (DRLs), బోల్డ్ ఫ్రంట్ గ్రిల్ ఈ కారుకు మోడ్రన్ లుక్‌ను అందిస్తాయి. వెనుక భాగంలో ఉన్న LED టెయిల్ ల్యాంప్‌లు కూడా దీని ప్రీమియం డిజైన్‌ను మరింత హైలైట్ చేస్తాయి. అలాగే 16 అంగుళాల డ్యూయల్-టోన్ అల్లాయ్ వీల్స్ MPVకి స్పోర్టీ టచ్‌ను తీసుకువస్తాయి.

ధరల విషయానికి వస్తే, ఈ MPV రూ.11.52 లక్షల నుంచి రూ.14.48 లక్షల (ఎక్స్-షోరూమ్) ధరల మధ్యలో అందుబాటులో ఉంది. వివిధ రకాల వినియోగదారుల అవసరాలను దృష్టిలో ఉంచుకుని కంపెనీ దీనిని జీటా, ఆల్ఫా, ఆల్ఫా ప్లస్ వంటి ప్రధాన వేరియంట్లలో విక్రయిస్తోంది. దీంతో బడ్జెట్, ఫీచర్ల అవసరాన్ని బట్టి కొనుగోలుదారులు తమకు నచ్చిన వేరియంట్‌ను ఎంచుకునే అవకాశం ఉంటుంది.
పనితీరు విషయానికి వస్తే, XL6లో 1.5-లీటర్ K-సిరీస్ పెట్రోల్ ఇంజిన్ అందించారు. ఈ ఇంజిన్ 6,000 rpm వద్ద 102 PS పవర్, 4,400 rpm వద్ద 137 Nm గరిష్ట టార్క్ ఉత్పత్తి చేస్తుంది. అలాగే, CNG వేరియంట్ కూడా అందిస్తోంది. ఇందులోని 1.5-లీటర్ CNG ఇంజిన్ 5,500 rpm వద్ద 87 PS పవర్, 4,200 rpm వద్ద 121 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.

సమాచారం ప్రకారం, పెట్రోల్, CNG వేరియంట్లను బట్టి సుమారు 20.97 కిమీ/లీటర్ నుంచి 26.32 కిమీ/కిలో వరకు మైలేజ్ అందిస్తుంది. మంచి మైలేజ్, విశాలమైన క్యాబిన్, ఆరు సీట్ల సౌకర్యం, తక్కువ నిర్వహణ ఖర్చు వంటి అంశాల కారణంగా ఎక్కువ దూరాలు ప్రయాణించే కుటుంబాలకు XL6 ఒక ఖర్చుకు తగిన విలువను అందించే MPVగా నిలుస్తోంది.


Click it and Unblock the Notifications