ఎంత పెద్ద ఫ్యామిలీ అయినా ఒకే కారులో వెళ్లొచ్చు..అదిరిపోయే రేంజ్, తక్కువ ధరతో మారుతి కొత్త ఈవీ
భారతదేశ ఆటోమొబైల్ రంగంలో కొన్నేళ్లుగా రారాజుగా వెలుగొందుతుంది మారుతి సుజుకి. సామాన్యుల బడ్జెట్ కు సరిపోయే విధంగా కార్లను తయారు చేస్తూ మార్కెట్లో నంబర్ 1గా నిలబడింది.ఇప్పుడు ఎలక్ట్రిక్ వాహనాల మార్కెట్లోకి భారీ ప్లానింగుతో అడుగుపెడుతోంది.
ఇప్పటికే తన మొదటి ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ ఈ విటారాతో అందరి దృష్టిని ఆకర్షించిన మారుతి, ఇప్పుడు మిడిల్ క్లాస్ ఫ్యామిలీల కోసం ఓ అద్భుతమైన 7 సీటర్ ఎలక్ట్రిక్ ఎంపీవీని రెడీ చేస్తోంది. ఈ కారుతో రెండు మూడు ఫ్యామిలీలు కలిసి హాయిగా ప్రయాణించవచ్చని మార్కెట్ వర్గాల టాక్.

మారుతి సుజుకి కంపెనీ ప్రస్తుతం YMC అనే కోడ్ పేరుతో ఒక కొత్త ఎలక్ట్రిక్ ఎంపీవీని అభివృద్ధి చేస్తోంది. ఇది కేవలం ఒక్క కుటుంబానికే కాదు, ఉమ్మడి కుటుంబాలకు కూడా సరిపోయే విధంగా 7 సీట్ల సామర్థ్యంతో రాబోతోంది.
ప్రస్తుతం మార్కెట్లో ఉన్న ఎర్టిగా, ఎక్స్‌ఎల్6 వంటి పాపులర్ ఎంపీవీల కంటే ఇది మరింత లగ్జరీగా, ప్రీమియంగా ఉండబోతోంది. 2026 చివరి నాటికి లేదా 2027 ప్రారంభంలో ఇది ఇండియన్ రోడ్లపై పరుగులు తీసే అవకాశం ఉంది.
ఈ కొత్త ఎంపీవీని మారుతి, టయోటా కలిసి సంయుక్తంగా అభివృద్ధి చేసిన 27PL స్కేట్‌బోర్డ్ ఆర్కిటెక్చర్ పై నిర్మిస్తున్నారు. ఇదే ప్లాట్‌ఫారమ్ మీద మారుతి ఈ విటారా ఎస్‌యూవీ కూడా రూపుదిద్దుకుంది. ఇందులో ముఖ్యంగా రెండు బ్యాటరీ ఆప్షన్లు ఉండబోతున్నాయి.
ఒకటి 49 kWh కాగా, రెండోది 61.1 kWh సామర్థ్యం కలిగి ఉంటుంది. ఈ పెద్ద బ్యాటరీ ప్యాక్ సహాయంతో ఈ కారు సింగిల్ ఛార్జ్‌పై ఏకంగా 500 నుంచి 550 కిలోమీటర్ల వరకు రేంజ్ ఇస్తుందని అంచనా. అంటే ఒక్కసారి ఛార్జ్ చేస్తే లాంగ్ ట్రిప్పులకు కూడా ఎలాంటి టెన్షన్ ఉండదు.

ఫీచర్ల విషయానికి వస్తే.. మారుతి తన ఈవీలలో ఫీచర్ల విషయంలో ఎక్కడా తగ్గడం లేదు. ఇందులో పెద్ద టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, వైర్‌లెస్ ఆండ్రాయిడ్ ఆటో, ఆపిల్ కార్‌ప్లే, డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ వంటివి ఉంటాయి.
వీటితో పాటు భద్రత కోసం Level 2 ADAS (అడ్వాన్స్‌డ్ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్), 6 ఎయిర్‌బ్యాగులు, 360-డిగ్రీల కెమెరా వంటి అడ్వాన్సుడ్ ఫీచర్లు ఇందులో యాడ్ చేయనున్నారు. లోపల స్పేస్ కూడా చాలా ఎక్కువగా ఉండటంతో ప్రయాణం చాలా సౌకర్యవంతంగా ఉంటుంది.
మారుతి ఎప్పుడూ తన కార్ల ధరలను సామాన్యులకు అందుబాటులో ఉండేలా చూస్తుంది. ఈ ఎలక్ట్రిక్ ఎంపీవీ ధర సుమారు రూ.18 లక్షల నుంచి రూ.25 లక్షల (ఎక్స్-షోరూమ్) మధ్యలో ఉండే అవకాశం ఉంది.
ఈ ధరలో వస్తే ఇది కియా కేరెన్స్ ఈవీ కి గట్టి పోటీ ఇస్తుంది. మారుతి సర్వీస్ నెట్‌వర్క్, నమ్మకం తోడైతే, ఈ కారు మార్కెట్లో సంచలనం సృష్టించడం ఖాయం. నెక్సా డీలర్‌షిప్‌ల ద్వారా ఈ కారును విక్రయించనున్నారు. తప్పకుండా ఈ కారు మార్కెట్లోకి వచ్చిన తర్వాత సంచలనం క్రియేట్ చేయడం ఖాయమని నిపుణులు విశ్లేషిస్తున్నారు.


Click it and Unblock the Notifications








