తక్కువ ధర..బైక్ ఇచ్చే మైలేజీ..మారుతి లేటెస్ట్ కారు కోసం 35 వేల మంది వెయిటింగ్
మారుతి సుజుకి నుంచి వచ్చిన సరికొత్త ఎస్‌యూవీ విక్టోరిస్(Victoris) ఇండియన్ ఆటోమొబైల్ మార్కెట్లో ప్రకంపనలు సృష్టిస్తోంది. తక్కువ ధరలో ఎక్కువ క్వాలిటీని కోరుకునే సామాన్యుడికి ఈ కారు ఒక వరంగా మారింది. కేవలం కొద్ది నెలల వ్యవధిలోనే 70,000 కంటే ఎక్కువ బుకింగ్స్ సాధించి, మారుతి చరిత్రలో సరికొత్త అధ్యాయాన్ని లిఖించింది.
ఈ కారు కోసం ఏకంగా 35,000 మంది కస్టమర్లు తమ వంతు కోసం వేచి చూస్తున్నారంటే దీని క్రేజ్ ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. మారుతి సుజుకి తన ఫ్లాగ్‌షిప్ ఎస్‌యూవీ విక్టోరిస్‌ను లాంచ్ చేసినప్పటి నుంచి కస్టమర్ల నుంచి అనూహ్య స్పందన వస్తోంది. తాజా నివేదికల ప్రకారం..ఈ కారుకు 70,000 కంటే ఎక్కువ ఆర్డర్లు వచ్చాయి.

ఇందులో ఇప్పటికే 35,000 మందికి డెలివరీ పూర్తవగా, మరో 35,000 మంది కస్టమర్లు కారు కోసం వెయిటింగ్ లిస్ట్‌లో ఉన్నారు. డిసెంబర్ 2025 నెలలోనే మారుతి సుజుకి 14,000 విక్టోరిస్ కార్లను విక్రయించి, గ్రాండ్ విటారా తర్వాత తన సెకండ్ బెస్ట్ కాంపాక్ట్ ఎస్‌యూవీగా నిలబెట్టింది.
మారుతి విక్టోరిస్ ధర రూ.10.50 లక్షల (ఎక్స్-షోరూమ్) నుంచి ప్రారంభమవుతుంది. తన ప్రధాన ప్రత్యర్థి అయిన కియా సెల్టోస్ కంటే దాదాపు రూ. 49,000 తక్కువ ధరకే ఇది అందుబాటులో ఉండటం మధ్యతరగతి ప్రజలకు పెద్ద ఊరట. కేవలం ధర మాత్రమే కాదు, క్వాలిటీ విషయంలోనూ హోండా, టాటా వంటి కంపెనీలకు గట్టి పోటీ ఇస్తోంది.

ఇందులో 1.5 లీటర్ పెట్రోల్, హైబ్రిడ్, CNG ఆప్షన్లు ఉన్నాయి. ముఖ్యంగా సీఎన్‌జీ ట్యాంకును బాడీ కింద అమర్చడం వల్ల సామాన్యుడికి లగేజీ పెట్టుకోవడానికి ఎక్కువ బూట్ స్పేస్ లభిస్తోంది. సాధారణంగా మారుతి కార్లంటే సేఫ్టీ తక్కువ అని ఒక అపోహ ఉండేది. కానీ విక్టోరిస్ ఆ అపోహను చెరిపేసింది.
Bharat NCAP, Global NCAP క్రాష్ టెస్టుల్లో ఈ కారు 5-స్టార్ రేటింగ్ సాధించి, దేశంలోనే అత్యంత సురక్షితమైన కార్ల జాబితాలో చేరింది. ఇందులో 6 ఎయిర్‌బ్యాగ్‌లు, 360-డిగ్రీ కెమెరా, మారుతి చరిత్రలోనే మొదటిసారిగా లెవల్ 2 ADAS (అడ్వాన్స్‌డ్ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్) వంటి ప్రీమియం సేఫ్టీ ఫీచర్లు ఉన్నాయి. తక్కువ ధరలో ఇంతటి సేఫ్టీ లభించడమే ఈ కారు సక్సెస్‌కు ప్రధాన కారణం.

విక్టోరిస్ లోపల అడుగుపెడితే ఏదో లగ్జరీ కారులో ఉన్న అనుభూతి కలుగుతుంది. 10.1-అంగుళాల టచ్‌స్క్రీన్, పనోరమిక్ సన్‌రూఫ్, వైర్‌లెస్ ఆండ్రాయిడ్ ఆటో, ఆపిల్ కార్‌ప్లే, అలెక్సా వాయిస్ అసిస్టెంట్ వంటి ఫీచర్లు నేటి యువతను ఆకట్టుకుంటున్నాయి. హైబ్రిడ్ మోడల్ అయితే ఏకంగా లీటరుకు 28.65 కిలోమీటర్ల మైలేజీ ఇస్తుండటంతో పెట్రోల్ ఖర్చుల గురించి ఆందోళన చెందే వారికి ఇది బెస్ట్ ఛాయిస్ అని చెప్పవచ్చు.
పెట్రోల్ ధరలు మండిపోతున్న ఈ రోజుల్లో మైలేజీయే ముఖ్యం. విక్టోరిస్ హైబ్రిడ్ మోడల్ ఏకంగా లీటరుకు 28.65 కిలోమీటర్ల మైలేజీని ఇస్తోంది. ఇది దేశంలోనే అత్యధిక మైలేజీ ఇచ్చే ఎస్‌యూవీలలో ఒకటి. ఇక సీఎన్‌జీ (CNG) ప్రియుల కోసం మారుతి ఒక అద్భుతమైన టెక్నాలజీని వాడింది.


Click it and Unblock the Notifications








