మార్కెట్లో అల్లకల్లోలం.. పెద్ద పెద్ద ఎస్‌యూవీల పని ఖతం.. కొత్తగా వచ్చిన కారును 11 వేల మంది ఒకేసారి కొనేశారు
దేశీయ ఆటోమొబైల్ దిగ్గజం మారుతి సుజుకి మార్కెట్లో తన ఆధిపత్యాన్ని మరోసారి చాటుకుంది. సాధారణంగా మారుతి అంటే స్విఫ్ట్, డిజైర్, బ్రెజా వంటి మోడళ్లే మనకు గుర్తొస్తాయి. కానీ, ఇప్పుడు సీన్ మారింది. కంపెనీ కొత్తగా తీసుకొచ్చిన మారుతి సుజుకి విక్టోరిస్ (Maruti Suzuki Victoris) ఎస్‌యూవీ మార్కెట్లో సంచలనం సృష్టిస్తోంది. కేవలం కొద్ది నెలల క్రితమే లాంచ్ అయిన ఈ కారు, అమ్మకాల్లో దూసుకుపోతూ టాప్-10 కార్ల జాబితాలోకి గ్రాండ్ ఎంట్రీ ఇచ్చింది. మార్చి 2026 నెలలో ఏకంగా 11,062 మంది కస్టమర్లు ఈ కారును సొంతం చేసుకున్నారంటే దీని క్రేజ్ ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు.
మారుతి బ్రాండ్ ఇమేజ్ మార్చేసిన కారు
మారుతి కార్లు అంటే మైలేజీ బాగుంటుంది కానీ సేఫ్టీ తక్కువ అనే విమర్శ ఉండేది. కానీ విక్టోరిస్ ఆ అపవాదును చెరిపేసింది. ఈ ఎస్‌యూవీకి గ్లోబల్ NCAP, భారత్ NCAP (Bharat NCAP) రెండింటిలోనూ 5-స్టార్ సేఫ్టీ రేటింగ్ లభించింది. సెప్టెంబర్ 2025లో లాంచ్ అయినప్పటి నుంచి ఈ కారు యువతను, ముఖ్యంగా భద్రతకు ప్రాధాన్యం ఇచ్చే కుటుంబాలను విశేషంగా ఆకర్షిస్తోంది. మారుతి చరిత్రలోనే అత్యంత సురక్షితమైన కార్లలో ఒకటిగా విక్టోరిస్ నిలిచింది. దీనివల్లే మార్చి నెలలో 11 వేల మార్కును సునాయాసంగా దాటేసింది.

కస్టమర్ల గుండెల్లో చోటు
విక్టోరిస్ కేవలం అమ్మకాల్లోనే కాదు, విమర్శకుల ప్రశంసలు పొందడంలోనూ ముందుంది. ఈ కారు తాజాగా ప్రతిష్టాత్మకమైన ICOTY 2026 (Indian Car of the Year) అవార్డును కూడా కైవసం చేసుకుంది. ఆధునిక డిజైన్, కస్టమర్లకు కావాల్సిన అన్ని రకాల టెక్నాలజీ ఫీచర్లను అందించడంలో మారుతి సక్సెస్ అయింది. ఇతర దిగ్గజ కంపెనీల ఎస్‌యూవీలకు గట్టి పోటీనిస్తూ, లాంచ్ అయిన తక్కువ కాలంలోనే టాప్-10 బెస్ట్ సెల్లింగ్ ఎస్‌యూవీల జాబితాలో చోటు సంపాదించడం విశేషం.
పవర్‌ఫుల్ ఇంజన్.. మైలేజీలోనూ తోపు
విక్టోరిస్ కారు కేవలం పెట్రోల్‌కే పరిమితం కాలేదు. ఇది పెట్రోల్, స్ట్రాంగ్ హైబ్రిడ్, CNG ఆప్షన్లలో అందుబాటులో ఉంది. ఇందులో 1.5 లీటర్ పెట్రోల్ (మైల్డ్ హైబ్రిడ్), 1.5 లీటర్ స్ట్రాంగ్ హైబ్రిడ్ (eCVT), 1.5 లీటర్ CNG ఇంజన్ ఆప్షన్లు ఉన్నాయి. ట్రాన్స్‌మిషన్ విషయానికి వస్తే 5-స్పీడ్ మాన్యువల్, 6-స్పీడ్ ఆటోమేటిక్ గేర్ బాక్స్ వెర్షన్లలో ఇది దొరుకుతుంది. అటు సిటీ డ్రైవింగ్‌కు, ఇటు లాంగ్ జర్నీలకు ఏమాత్రం అలసట లేకుండా ప్రయాణించేలా దీని పవర్‌ట్రైన్‌ను రూపొందించారు.

ఫీచర్లు చూస్తే మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే
మారుతి విక్టోరిస్‌లో ఫీచర్లకు కొదవ లేదు. ఇందులో పెద్ద పనోరమిక్ సన్‌రూఫ్, కూలింగ్ ఇచ్చే వెంట్లేటెడ్ సీట్లు, కారు చుట్టూ ఉన్న పరిసరాలను గమనించడానికి 360-డిగ్రీ కెమెరా ఉన్నాయి. అన్నిటికంటే ముఖ్యంగా ఇందులో లెవల్-2 ADAS (అడ్వాన్స్‌డ్ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్) వంటి అత్యాధునిక సేఫ్టీ టెక్నాలజీ ఉంది. ఇక ఆఫ్-రోడింగ్ ఇష్టపడే వారి కోసం ALLGRIP Select 4x4 ఆప్షన్ కూడా ఇచ్చారు. అంటే బురదలో లేదా రాళ్ల దారుల్లో కూడా ఈ కారు ఆగకుండా దూసుకెళ్తుంది.
ధర ఎంతంటే?
ఇంతటి లగ్జరీ ఫీచర్లు, సేఫ్టీ ఉన్న ఈ కారు ధర కూడా పోటీగా ఉంది. భారత మార్కెట్లో విక్టోరిస్ ఎక్స్-షోరూమ్ ధర రూ.10.49 లక్షల నుంచి రూ.19.99 లక్షల వరకు ఉంది. ఈ ధరలో 5-స్టార్ రేటింగ్ ఉన్న ఎస్‌యూవీ దొరకడం కష్టమని భావిస్తున్న కస్టమర్లు షోరూంల ముందు క్యూ కడుతున్నారు. టాటా సఫారీ, మహీంద్రా ఎక్స్‌యూవీ 700 వంటి దిగ్గజాలకు ఇది గట్టి సవాల్ విసురుతోంది. రాబోయే నెలల్లో దీని అమ్మకాలు మరింత పెరిగే అవకాశం ఉందని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు.


Click it and Unblock the Notifications








