మే నెలలో కొత్త కార్ల జాతర.. హోండా నుంచి టాటా వరకు మార్కెట్లో వస్తున్న 5 అదిరిపోయే కార్లు ఇవే
కొత్త కారు కొనుగోలు చేయాలని ప్లాన్ చేస్తున్నారా ? అయితే వచ్చే నెల మీ కోసం అదిరిపోయే ఆప్షన్లను ఆటో కంపెనీలు తీసుకు వస్తున్నాయి. ఇండియన్ ఆటోమొబైల్ మార్కెట్ మే 2026లో సరికొత్త కళను సంతరించుకోనుంది.
దిగ్గజ సంస్థలైన హోండా, టయోటా, టాటా, ఎంజీ మోటార్స్ తమ సరికొత్త మోడల్స్‌ను రోడ్లపైకి దింపేందుకు సిద్ధమయ్యాయి. వీటిలో ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న ఎలక్ట్రిక్ కార్లు, స్టైలిష్ సెడాన్లు, ప్రీమియం ఎస్‌యూవీలు ఉన్నాయి. మే నెలలో లాంచ్ కానున్న ఆ 5 సెన్సేషనల్ కార్ల గురించి తెలుసుకుందాం.

1. హోండా సిటీ ఫేస్‌లిఫ్ట్ (Honda City Facelift)
హోండా తన పాపులర్ సెడాన్ సిటీని సరికొత్త హంగులతో మే 22, 2026న లాంచ్ చేయనుంది. ఇందులో అప్‌డేటెడ్ ఫ్రంట్ గ్రిల్, కొత్త డిజైన్ అలాయ్ వీల్స్, లెవల్-2 ADAS వంటి అడ్వాన్సుడ్ ఫీచర్లు ఉండనున్నాయి.
దీని ఇంటీరియర్‌లో సీట్ వెంటిలేషన్, సన్‌రూఫ్, ఎలక్ట్రిక్ సీట్ అడ్జస్ట్‌మెంట్ వంటి లగ్జరీ ఫీచర్లు హైలైట్‌గా నిలుస్తాయి. ఇది 1.5 లీటర్ పెట్రోల్,హైబ్రిడ్ ఆప్షన్లలో లభిస్తుంది.

2. హోండా ZR-V (Honda ZR-V)
హోండా నుంచి రానున్న మరో అద్భుతం ZR-V. ఇది ఒక ప్రీమియం మిడ్-సైజ్ ఎస్‌యూవీ. ఇది పూర్తిగా విదేశాల నుంచి (CBU) దిగుమతి అవుతుంది కాబట్టి ధర కాస్త ఎక్కువగానే ఉండవచ్చు.
ఇందులో గూగుల్ అసిస్టెంట్, 12 స్పీకర్ల బోస్ ఆడియో సిస్టమ్, 9-అంగుళాల టచ్‌స్క్రీన్ వంటి అద్భుతమైన ఫీచర్లు ఉన్నాయి. ఇది కేవలం 2.0 లీటర్ హైబ్రిడ్ ఇంజిన్‌తో మే 22న ఎంట్రీ ఇచ్చే అవకాశం ఉంది.

3. టయోటా ఈబెల్లా (Toyota eBella)
టయోటా తన మొదటి పూర్తి ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ ఈబెల్లాను మే నెలలో పరిచయం చేయనుంది. ఇది మారుతి సుజుకి ఈ-విటారాకు రీబ్యాజ్డ్ వెర్షన్. ఇది రెండు బ్యాటరీ ప్యాక్ లతో వస్తుంది.
49 kWh బ్యాటరీ వెర్షన్ 440 కి.మీ రేంజ్ ఇస్తుండగా, 61 kWh వెర్షన్ ఏకంగా 543 కి.మీ రేంజ్ ఇస్తుంది. 10 స్పీకర్ల JBL ఆడియో సిస్టమ్, పనోరమిక్ గ్లాస్ రూఫ్ దీని ప్రధాన ఆకర్షణలు.
4. టాటా సియెర్రా ఈవీ (Tata Sierra EV)
టాటా మోటార్స్ నుంచి ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న సియెర్రా ఈవీ 2026 రెండో త్రైమాసికంలో వస్తోంది. మే నెలలోనే దీని ప్రొడక్షన్ వెర్షన్ లాంచ్ అయ్యే ఛాన్స్ ఉంది.
ఇది హారియర్ ఈవీ తరహాలోనే 65 kWh, 75 kWh బ్యాటరీ ప్యాక్ లతో రానుంది. దీని ఐకానిక్ డిజైన్, అల్ట్రా-మోడరన్ ఇంటీరియర్స్ యూత్ ను విపరీతంగా ఆకర్షిస్తున్నాయి.
5. ఎంజీ మేజెస్టర్ (MG Majester)
ఎంజీ మోటార్స్ తన ప్రీమియం ఎస్‌యూవీ మేజెస్టర్ ధరలను మే నెలలో వెల్లడించనుంది. ఏప్రిల్ లోనే ఇది రావాల్సి ఉన్నా, కొన్ని కారణాల వల్ల వాయిదా పడింది.
ఎంజీ నుంచి వస్తున్న ఈ లగ్జరీ కారు ధరలు, డెలివరీల కోసం ఫ్యాన్స్ ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. టెక్నాలజీ పరంగా ఎంజీ ఎప్పుడూ ముందే ఉంటుంది కాబట్టి, మేజెస్టర్ లో మనం ఊహించని ఫీచర్లు చూడొచ్చు.


Click it and Unblock the Notifications