భారత్ పేద దేశం అంటే నమ్మకండి.. డబ్బు లేదనేది అబద్ధం! లగ్జరీ కార్లకు క్యూ కడుతున్నారు

ప్రస్తుతం భారతదేశంలో కార్ల వినియోగం గణనీయంగా పెరిగిపోయింది. ఒకప్పుడు ఇంటికి ఒక బైకు ఉంటే సరిపోతుందని భావించిన రోజులు క్రమంగా కనుమరుగైపోయాయి. ఇప్పుడు మాత్రం ప్రతి కుటుంబంలో కనీసం ఒక కారు ఉండాలనే ఆలోచన బలంగా పెరిగింది. జీవనశైలిలో వచ్చిన మార్పులు, పెరుగుతున్న ఆదాయ వనరులు, సౌకర్యాలపై ప్రజల ఆసక్తి కలిసి ఆటోమొబైల్ మార్కెట్‌ను పూర్తిగా మార్చేశాయి. ముఖ్యంగా మధ్యతరగతి నుంచి పై స్థాయికి ఎదుగుతున్న వినియోగదారులు ఇప్పుడు కేవలం అవసరానికి మాత్రమే కాదు, సౌకర్యం, ప్రతిష్ట కోసం కూడా కార్లను కొనుగోలు చేస్తున్నారు. ఈ మార్పు ప్రభావం కేవలం బడ్జెట్ కార్లపైనే కాకుండా, లగ్జరీ కార్ల మార్కెట్‌పైనా స్పష్టంగా కనిపిస్తోంది. గతంలో లగ్జరీ కార్లు చాలా మందికి అందని ద్రాక్షలుగా కనిపించేవి. కానీ ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారిపోయింది.

మెరుగైన ఆర్థిక స్థితి, ఈఎంఐ సౌకర్యాలు, బ్యాంకుల నుంచి సులభమైన రుణాలు కలిసి లగ్జరీ కార్ల కొనుగోళ్లు కూడా పెరగడానికి దోహదపడ్డాయి. దీంతో ప్రీమియం బ్రాండ్లు భారత మార్కెట్‌లో తమ స్థానాన్ని మరింత బలపరుచుకుంటున్నాయి. ఇదే ట్రెండ్‌కు నిదర్శనంగా మెర్సిడెస్-బెంజ్ ఇండియా (Mercedes-Benz India) అద్భుతమైన ప్రదర్శన కనబరిచింది. 2026 ఆర్థిక సంవత్సరాన్ని ఈ కంపెనీ తన చరిత్రలోనే అత్యధిక వార్షిక అమ్మకాలతో ముగించడం విశేషం.

Mercedes Benz India Registers Best Ever Sales 19363 Units In Fy26

గత ఆర్థిక సంవత్సరంలో మొత్తం 19,363 యూనిట్లను విక్రయిస్తూ, లగ్జరీ కార్ల విభాగంలో అగ్రస్థానాన్ని దక్కించుకుంది. ఇది కేవలం ఒక సంఖ్య మాత్రమే కాదు, భారతదేశంలో లగ్జరీ కార్లపై పెరుగుతున్న డిమాండ్‌కు ప్రతీకగా చెప్పుకోవచ్చు.ఇది దానికి ముందు ఆర్థిక సంవత్సరంలో 18,928 యూనిట్ల అమ్మకాలతో పోలిస్తే, ఈసారి మరింత వృద్ధిని నమోదు చేయడం మెర్సిడెస్-బెంజ్‌కు ఒక పెద్ద విజయంగా నిలిచింది.

అంటే, ఇప్పటికే ఉన్న బలమైన మార్కెట్ స్థితిని మరింత మెరుగుపరుచుకుంటూ ముందుకు సాగుతున్నట్లు ఇది సూచిస్తోంది. ఈ లగ్జరీ కార్ల అమ్మకాలను చూస్తే భారత్ పేద దేశమని ఎవరూ అనలేరు. ఈ వృద్ధి వెనుక ప్రధాన కారణం,మెర్సిడెస్ అందిస్తున్న టాప్-ఎండ్ లగ్జరీ మోడళ్లకు లభిస్తున్న భారీ ఆదరణే. ముఖ్యంగా Mercedes-Benz S-Class, Maybach S-Class, AMG మోడల్స్, EQS SUV వంటి ప్రీమియం వాహనాలు వినియోగదారులను బలంగా ఆకర్షిస్తున్నాయి.

Mercedes Benz India Registers Best Ever Sales 19363 Units In Fy26

ఈ మోడళ్లలో ఉన్న సౌకర్యాలు, టెక్నాలజీ, అలాగే బ్రాండ్ విలువ కలిసి కొనుగోలుదారులను మరింతగా ఆకట్టుకుంటున్నాయి. ప్రత్యేకంగా Mercedes-Benz EQS SUV విషయంలో చూస్తే, దీని అమ్మకాలు 16 శాతం పెరిగి, మొత్తం బ్రాండ్ సేల్స్‌లోనే 27 శాతం వాటాను సాధించడం విశేషం. అంటే, ఎలక్ట్రిక్ లగ్జరీ వాహనాలపై కూడా వినియోగదారుల ఆసక్తి వేగంగా పెరుగుతోందని ఇది స్పష్టం చేస్తోంది.

అమ్మకాల గణాంకాలు కూడా ఈ ట్రెండ్‌ను బలపరుస్తున్నాయి. 2025 మొదటి త్రైమాసికంలో 4,775 యూనిట్లు విక్రయించిన మెర్సిడెస్-బెంజ్, 2026 మొదటి త్రైమాసికంలో 5,131 యూనిట్లకు చేరుకుని దాదాపు 7 శాతం వృద్ధిని నమోదు చేసింది. ఇది కేవలం తాత్కాలిక పెరుగుదల కాకుండా, స్థిరంగా కొనసాగుతున్న డిమాండ్‌ను సూచిస్తోంది. ఈ మొత్తం పరిస్థితిలో అత్యంత గమనించాల్సిన విషయం ఏమిటంటే, ఉన్నత శ్రేణి లగ్జరీ కార్లకు ఉన్న డిమాండ్ ఎంతగా పెరిగిందో.

Mercedes Benz India Registers Best Ever Sales 19363 Units In Fy26

కొన్ని ప్రీమియం మోడళ్ల నెలలు తరబడి వేచి చూడాల్సిన పరిస్థితి ఏర్పడింది. ముఖ్యంగా Mercedes-AMG G63, Mercedes-Maybach S-Class వంటి మోడళ్లకు నాలుగు నెలల నుండి ఒక సంవత్సరం వరకు వెయిటింగ్ పీరియడ్ ఉండటం ఈ డిమాండ్ స్థాయిని స్పష్టంగా చూపిస్తోంది. మొత్తానికి, లగ్జరీ అంటే కేవలం ఒక కార్ కాదు, ఒక స్టేటస్ సింబల్‌గా మారిన ఈ కాలంలో, మెర్సిడెస్-బెంజ్ తన ప్రీమియం మోడళ్లతో బలమైన స్థానం సంపాదించుకుంది.

More from DriveSpark

Article Published On: Friday, April 10, 2026, 14:42 [IST]
English summary
Mercedes benz india registers best ever sales 19363 units in fy26
Read more on: #mercedes benz #india
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+