చుక్క పెట్రోల్ అవసరం లేదు.. రోజూ ఆఫీసుకు వెళ్లే వాళ్లకు డబ్బులు ఆదా చేసే కారు
భారతదేశంలో ఎలక్ట్రిక్ వాహన విప్లవం కొనసాగుతోంది. సామాన్యుడికి కూడా ఈవీ (EV) అనుభూతిని అందించాలనే ఉద్దేశంతో ఎంజీ మోటార్స్ (MG Motors) తన కామెట్ ఈవీ(Comet Ev)ని అత్యంత తక్కువ ధరకే మార్కెట్లోకి తీసుకొచ్చింది. మీరు ఒకవేళ కొత్త ఎలక్ట్రిక్ కారును కొనుగోలు చేయాలని ఆలోచిస్తుంటే, ఈ మే నెల మీకు ఒక అద్భుతమైన అవకాశం. ఎందుకంటే ఎంజీ కామెట్ ఈవీపై ఇప్పుడు ఏకంగా రూ.60,000 వరకు ప్రయోజనాలను పొందే అవకాశం ఉంది.
మే నెలలో అదిరిపోయే డిస్కౌంట్లు
ఎంజీ మోటార్స్ తన కామెట్ ఈవీపై మోడల్ ఇయర్ (MY) ఆధారంగా వేర్వేరు ఆఫర్లను ప్రకటించింది. కొత్తగా వస్తున్న ఎంవై26 (MY26) యూనిట్లపై రూ.10,000 నగదు తగ్గింపు, మరో రూ.10,000 ఎక్స్ఛేంజ్ బోనస్, పాత కస్టమర్ల కోసం రూ. 20,000 లాయల్టీ బోనస్, అదనంగా రూ.10,000 కార్పొరేట్ బెనిఫిట్స్ లభిస్తున్నాయి. ఇక స్టాక్‌లో ఉన్న ఎంవై25 (MY25) మోడళ్లపై ఏకంగా రూ.30,000 వరకు నగదు తగ్గింపుతో పాటు ఇతర బెనిఫిట్స్ అందుబాటులో ఉన్నాయి. దీంతో ఈ కారును మరింత తక్కువ ధరకే ఇంటికి తీసుకెళ్లవచ్చు.

బుజ్జి కారు.. అదిరిపోయే రేంజ్
ఎంజీ కామెట్ ఈవీ ధర రూ.7.62 లక్షల నుంచి రూ.9.99 లక్షల (ఎక్స్‌షోరూమ్) మధ్యలో ఉంటుంది. ఇందులో 17.4kWh సామర్థ్యం కలిగిన బ్యాటరీ ప్యాక్‌ను అమర్చారు. ఒక్కసారి ఫుల్ ఛార్జ్ చేస్తే ఈ కారు ఏకంగా 230 కిలోమీటర్ల దూరం ప్రయాణిస్తుందని కంపెనీ చెబుతోంది. నగరాల్లో రోజువారీ ప్రయాణాలకు, ఆఫీసు పనులకు ఇది ఒక పర్ఫెక్ట్ వాహనంగా నిలుస్తుంది. కేవలం 4.2 మీటర్ల టర్నింగ్ రేడియస్ ఉండటం వల్ల ట్రాఫిక్ ఎక్కువగా ఉండే రోడ్లపై కూడా దీనిని నడపడం ఎంతో సులభం.
హైటెక్ ఫీచర్లు.. ప్రీమియం లుక్
చూడటానికి కాంపాక్ట్‌గా ఉన్నప్పటికీ, ఫీచర్ల విషయంలో ఎంజీ ఎక్కడా తగ్గలేదు. కారు లోపల 10.25 అంగుళాల భారీ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, అదే పరిమాణంలో డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ ఉన్నాయి. వైర్‌లెస్ కనెక్టివిటీ, టర్న్-బై-టర్న్ నావిగేషన్, రియల్ టైమ్ ట్రాఫిక్ అప్‌డేట్స్ వంటి స్మార్ట్ ఫీచర్లు ఇందులో ఉన్నాయి. ఫుల్ ఎల్‌ఈడీ స్ట్రిప్ లైట్లు, స్లీక్ హెడ్‌ల్యాంప్స్, ఆకర్షణీయమైన అల్లాయ్ వీల్స్‌తో ఈ కారు ఎంతో మోడ్రన్‌గా కనిపిస్తుంది.

సిటీ డ్రైవింగ్‌కు ఒక వరం
కామెట్ ఈవీని ముఖ్యంగా పట్టణ ప్రాంతాల అవసరాలకు అనుగుణంగా జీఎస్‌ఈవీ (GSEV) ప్లాట్‌ఫారమ్‌పై నిర్మించారు. దీని పొడవు కేవలం 2974 మిమీ ఉండటం వల్ల పార్కింగ్ సమస్యలు అస్సలు ఉండవు. ఇందులో 12 అంగుళాల టైర్లు, ముందు భాగంలో డిస్క్ బ్రేకులు, వెనుక భాగంలో డ్రమ్ బ్రేకులు అమర్చారు. బ్లూ, గ్రీన్, ఆరెంజ్, రెడ్ వంటి నాలుగు ఆకర్షణీయమైన రంగుల్లో ఈ కారు లభిస్తోంది.
టాటా టియాగో ఈవీ , సిట్రోయెన్ ఈసీ3 వంటి మోడళ్లకు ఇది గట్టి పోటీనిస్తోంది. ఈ డిస్కౌంట్ ఆఫర్లు పరిమిత కాలం మాత్రమే అందుబాటులో ఉంటాయి కాబట్టి, ఆసక్తి గల వారు వెంటనే ఎంజీ షోరూమ్‌ని సందర్శించడం ఉత్తమం.


Click it and Unblock the Notifications