దీపం ఉండగానే ఇల్లు చక్కదిద్దికున్న కంపెనీ.. డిమాండ్ ఎక్కువ ఉన్న ఆ ఈవీపై ధర పెంపు
ఎంజీ కామెట్ EV (MG Comet EV) భారత మార్కెట్‌లో అందుబాటులో ఉన్న అత్యంత చిన్న, నగరానికి సరిపోయే ఎలక్ట్రిక్ కారుగా మంచి గుర్తింపు తెచ్చుకుంది. ముఖ్యంగా రోజూ ఆఫీస్‌కు వెళ్లడం, షాపింగ్, చిన్న దూర ప్రయాణాలు చేసే వారిని దృష్టిలో పెట్టుకుని ఈ కారును MG మోటార్ రూపొందించింది. కామెట్ EV డిజైన్ చాలా ప్రత్యేకంగా ఉంటుంది. బయట నుంచి చూసినప్పుడు ఇది ఒక ఫ్యూచరిస్టిక్ సిటీ కార్‌లా కనిపిస్తుంది. చిన్న పొడవు, బాక్స్ టైప్ ఆకారం, LED లైటింగ్‌తో ఇది రోడ్డుపై వెంటనే గుర్తుపడేలా ఉంటుంది. నగరాల్లో పార్కింగ్ పెద్ద సమస్యగా మారుతున్న ఈ రోజుల్లో, చిన్న సైజ్ కారణంగా కామెట్ EVను ఎక్కడైనా సులభంగా పార్క్ చేయొచ్చు. తాజాగా కంపెనీ ఈ కారు ధరను పెంచింది. ఆ వివరాలను ఒకసారి చూద్దాం.
కంపెనీ అధికారికంగా వెల్లడించిన సమాచారం ప్రకారం MG కామెట్ EV కొత్త ధరలు జనవరి 13 నుంచి అమల్లోకి వచ్చాయి. ఈ ధరల సవరణతో, కామెట్ EV కొనుగోలు చేయాలనుకునే కస్టమర్లకు ఇప్పుడు రూ.3,000 నుంచి గరిష్టంగా రూ.16,700 వరకు అదనపు భారం పడనుంది. మొత్తం మీద చూస్తే, ఈ ఎలక్ట్రిక్ కారుపై సుమారు 1.87 శాతం ధరల పెంపు అమలు చేసినట్లు కంపెనీ స్పష్టం చేసింది.

వేరియంట్‌ల వారీగా చూస్తే, కామెట్ EV ఎగ్జిక్యూటివ్ బేస్ మోడల్ ధరలో రూ.13,000 పెరుగుదల చోటుచేసుకుంది. గతంలో రూ.7,49,800గా ఉన్న ఈ వేరియంట్ ఎక్స్-షోరూమ్ ధర ఇప్పుడు రూ.7,62,800కి చేరింది. తక్కువ ధరలో ఎలక్ట్రిక్ కారు కొనాలనుకునే వారికి ఇది ఇప్పటికీ ఆకర్షణీయమైన ఎంపికగానే నిలుస్తోంది. అదే విధంగా, ఎక్సైట్ వేరియంట్ ధర కూడా పెరిగింది.
ఈ వేరియంట్‌పై రూ.16,000 ధరల పెంపు అమలు చేయడంతో, ఎక్స్-షోరూమ్ ధర రూ.8,56,800 నుంచి రూ.8,72,800కి చేరింది. మరింత ఫీచర్లతో కూడిన ఈ వేరియంట్, నగర వినియోగానికి అనువైన ఎలక్ట్రిక్ కారుగా కొనసాగుతోంది. ఇక టాప్ వేరియంట్‌గా నిలిచే ఎక్స్‌క్లూజివ్ మోడల్‌పై అత్యధికంగా రూ.16,700 పెంపు విధించారు. దీంతో, ఈ వేరియంట్ ఎక్స్-షోరూమ్ ధర రూ.9,56,100 నుంచి రూ.9,72,800కు పెరిగింది.

ప్రీమియం ఫీచర్లు కోరుకునే కస్టమర్లను లక్ష్యంగా చేసుకున్న ఈ వేరియంట్, ధర పెరిగినా తన ప్రత్యేకతను కోల్పోలేదని చెప్పవచ్చు. ఇంకా, ఎక్సైట్ ఫాస్ట్ ఛార్జర్ వేరియంట్ విషయానికి వస్తే, దీనిపై తక్కువ స్థాయిలోనే ధర పెరిగింది. ఈ మోడల్‌పై రూ.3,000 పెంపుతో, ఎక్స్-షోరూమ్ ధర రూ.8,96,800 నుంచి రూ.8,99,800కి చేరుకుంది. ఫాస్ట్ ఛార్జింగ్ సౌకర్యంతో త్వరగా చార్జ్ అయ్యే ఈ వేరియంట్, రోజువారీ నగర ప్రయాణాలకు మరింత అనుకూలంగా మారింది.
MG కామెట్ ఎలక్ట్రిక్ కారులోని ప్రత్యేక ఫాస్ట్ ఛార్జర్ వేరియంట్ ధరలో స్వల్ప పెరుగుదల చోటుచేసుకుంది. ఈ వేరియంట్‌పై కేవలం రూ.3,000 మాత్రమే పెరగడంతో, గతంలో రూ.9,96,800గా ఉన్న ఎక్స్-షోరూమ్ ధర ఇప్పుడు రూ.9,99,800కు చేరింది. ధర కొంత పెరిగినప్పటికీ, MG కామెట్ EV ఇప్పటికీ భారత మార్కెట్లో అత్యంత సరసమైన, ఉపయోగకరమైన ఎలక్ట్రిక్ సిటీ కార్లలో ఒకటిగా నిలుస్తోంది.

MG కామెట్ EVలో 17.4 kWh బ్యాటరీ ప్యాక్ అమర్చారు. ఈ బ్యాటరీ ఒకసారి పూర్తిగా ఛార్జ్ చేస్తే 230 కిలోమీటర్ల వరకు డ్రైవింగ్ రేంజ్ అందిస్తుంది. నగర వినియోగానికి సరిపోయేలా రూపొందించిన ఈ ఎలక్ట్రిక్ కారు, రోజువారీ ఆఫీస్ ప్రయాణాలు, షాపింగ్, చిన్న ట్రిప్‌లకు మంచి ఎంపికగా నిలుస్తోంది. కామెట్ EVతో 1,000 కిలోమీటర్లు ప్రయాణించడానికి కేవలం రూ. 519 మాత్రమే ఖర్చవుతుంది.


Click it and Unblock the Notifications








