ఒకప్పుడు పెద్ద పెద్ద కార్ల కంపెనీలనే గడగడలాడించిన కారు.. గత 4 నెలలుగా ఒక్కరంటే ఒక్కరు కూడా కొనలేదు

JSW MG మోటార్ ఇండియా మార్కెట్లో దూసుకుపోతున్న తరుణంలో, ఆ కంపెనీకి చెందిన ఒక ఖరీదైన SUV మాత్రం ఊహించని రీతిలో పతనమైంది. ఒకప్పుడు లగ్జరీ ఫీచర్లతో అదిరిపోయే ఎంట్రీ ఇచ్చిన ఎంజీ గ్లోస్టర్ (MG Gloster), గత నాలుగు నెలలుగా ఒక్క యూనిట్ కూడా అమ్ముడుపోలేదంటే నమ్మశక్యం కావడం లేదు. మార్చి 2026 నాటికి అందిన గణాంకాల ప్రకారం.. ఈ కారు అమ్మకాలు జీరో (0) వద్దే ఆగిపోయాయి.

ఎంజీ మోటార్ ఇండియా విడుదల చేసిన తాజా సేల్స్ డేటా చూస్తుంటే ఆశ్చర్యం కలగక మానదు. 2025 చివరి నెల నుంచి 2026 మార్చి వరకు గ్లోస్టర్ పరిస్థితి అగమ్యగోచరంగా ఉంది. అక్టోబర్ 2025లో కేవలం 9 యూనిట్లు అమ్ముడవగా, నవంబర్ నాటికి ఆ సంఖ్య 5కి పడిపోయింది. ఆ తర్వాత డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి.. ఇప్పుడు మార్చిలో కూడా ఒక్క కారు కూడా సేల్ అవ్వలేదు.

MG Gloster Sales Hit Rock Bottom Zero Units Sold Since December 2025

అంటే వరుసగా నాలుగు నెలలుగా ఈ లగ్జరీ SUV ఖాతా తెరవలేదు. దాదాపు రూ.38.33 లక్షల ప్రారంభ ధర కలిగిన ఈ కారు, కంపెనీ పోర్ట్‌ఫోలియోలో అత్యంత ఖరీదైన మోడళ్లలో ఒకటి. అయితే, ఇదే సమయంలో కంపెనీ కొత్తగా లాంచ్ చేసిన విండ్సర్ ఈవీ (Windsor EV) మాత్రం రికార్డు స్థాయిలో అమ్ముడవుతుండటం గమనార్హం.

కస్టమర్లు ఎందుకు ముఖం చాటేస్తున్నారు?
గ్లోస్టర్ లాంటి పవర్ఫుల్ కారుకు ఈ పరిస్థితి రావడానికి ప్రధాన కారణం ఫేస్‌లిఫ్ట్ వెర్షన్ (MG Gloster Facelift) కోసం కస్టమర్లు వేచి చూడటమే అని విశ్లేషకులు భావిస్తున్నారు. మార్కెట్లో ఇప్పటికే కొత్త ఫేస్‌లిఫ్ట్ వెర్షన్ రాబోతుందన్న ప్రచారం జరుగుతోంది. పాత వెర్షన్ కొనేకంటే, కొత్త హంగులతో రాబోయే కారు కోసం జనం వెయిట్ చేస్తున్నారు.

MG Gloster Sales Hit Rock Bottom Zero Units Sold Since December 2025

దీనికి తోడు టయోటా ఫార్చ్యూనర్ (Fortuner) వంటి ప్రత్యర్థి కార్లు మార్కెట్లో గట్టి పోటీ ఇస్తుండటం, మెయింటెనెన్స్, మైలేజ్ పరంగా కూడా కస్టమర్లు ఇతర ఆప్షన్ల వైపు మొగ్గు చూపుతుండటం గ్లోస్టర్ ను దెబ్బతీశాయి. రూ.75 లక్షల పైన ఉండే MG M9 వంటి మోడళ్లు హై-ఎండ్ లగ్జరీగా ఉండటం కూడా దీనికి అడ్డంకిగా మారింది.

ఫీచర్లు ఎన్ని ఉన్నా ఫలితం లేదాయే..
గ్లోస్టర్ ఫీచర్ల పరంగా చూస్తే ఏ లగ్జరీ కారుకూ తీసిపోదు. ఇందులో 2WD, 4WD ఆప్షన్లు ఉన్నాయి. ఇంటీరియర్ పరంగా చూస్తే డార్క్ థీమ్, లెదర్ అప్హోల్స్టరీ, 12-వే అడ్జస్టబుల్ డ్రైవర్ సీటు, మసాజ్, వెంటిలేషన్ వంటి అత్యాధునిక సౌకర్యాలు ఉన్నాయి.

MG Gloster Sales Hit Rock Bottom Zero Units Sold Since December 2025

పాన్ రోమిక్ సన్‌రూఫ్, ఏడు రకాల డ్రైవింగ్ మోడ్స్ (సాండ్, ఎకో, స్పోర్ట్, నార్మల్, రాక్, స్నో, మడ్) ఈ కారు సొంతం. డిజైన్ పరంగా డార్క్ థీమ్, స్మోక్డ్ బ్లాక్ టెయిల్ లైట్స్, బ్లాక్ స్ట్రోమ్ వేరియంట్ తో ఇది ఎంతో స్టైలిష్ గా కనిపిస్తుంది. కానీ, ఇన్ని హంగులున్నా కస్టమర్లను ఆకర్షించడంలో ఇది విఫలమైంది.

శక్తివంతమైన ఇంజిన్.. కానీ చాలని మైలేజ్
MG గ్లోస్టర్ లో 2.0 లీటర్ డీజిల్ ఇంజిన్ ఉంటుంది. ఇది సింగిల్ టర్బో, ట్విన్ టర్బో అనే రెండు వేరియంట్లలో లభిస్తుంది. ట్విన్ టర్బో వెర్షన్ 215.5 bhp పవర్, 480 Nm టార్క్ ఇస్తుంది. సింగిల్ టర్బో 161 bhp పవర్, 373.5 Nm టార్క్ ఉత్పత్తి చేస్తుంది. అన్ని వేరియంట్లలో 8-స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ ఉంది. కానీ దీని మైలేజ్ కేవలం 10.04 kmpl నుంచి 13.92 kmpl మధ్యే ఉంటుంది. భారీ పరిమాణం, తక్కువ మైలేజ్ దీనికి ప్రధాన మైనస్ పాయింట్లుగా మారాయి.

అడ్వాన్స్‌డ్ సేఫ్టీ ఫీచర్లు (ADAS)
భద్రత విషయంలో గ్లోస్టర్ చాలా ముందుంది. ఇందులో అడ్వాన్స్‌డ్ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్ (ADAS) ఉంది. అడాప్టివ్ క్రూయిజ్ కంట్రోల్, ఆటోమేటిక్ ఎమర్జెన్సీ బ్రేకింగ్, లేన్ డిపార్చర్ వార్నింగ్, బ్లైండ్ స్పాట్ డిటెక్షన్ వంటి 10కి పైగా సేఫ్టీ ఫీచర్లు ఉన్నాయి. ఇంత సెక్యూరిటీ ఉన్నా కస్టమర్లలో నమ్మకాన్ని కలిగించలేకపోవడం ఆశ్చర్యకరం. మరి రాబోయే కాలంలో గ్లోస్టర్ ఫేస్‌లిఫ్ట్ వెర్షన్ తోనైనా ఈ సున్నా అమ్మకాల రికార్డును ఎంజీ కంపెనీ తిరగరాస్తుందో లేదో వేచి చూడాలి.

More from DriveSpark

Article Published On: Friday, April 17, 2026, 10:15 [IST]
English summary
Mg gloster sales hit rock bottom zero units sold since december 2025
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+