ఫుల్ ట్యాంక్ చేస్తే 1100కిమీ.. జూలై 16న మార్కెట్‎ను షేక్ చేయడానికి బ్రహ్మస్త్రాన్ని దింపుతున్న ఎంజీ మోటార్స్

భారత SUV మార్కెట్లో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న JSW MG Motor సంస్థ, దేశీయ మార్కెట్లో మరోసారి సంచలనం సృష్టించడానికి సిద్ధమైంది. ఈ ఏడాది దీపావళి పండుగ నాటికి ఇండియన్ మార్కెట్లో రెండు సరికొత్త పవర్‌ఫుల్ ఎస్‌యూవీలను లాంచ్ చేయడానికి కంపెనీ సర్వం సిద్ధం చేసింది. ఇందులో ఒకటి ప్లగ్-ఇన్ హైబ్రిడ్ మోడల్ కాగా, మరొకటి పూర్తి ఎలక్ట్రిక్ వెర్షన్ కావడం విశేషం. ప్రముఖ ఆటోమొబైల్ నివేదికల ప్రకారం.. రాబోయే ఈ ప్లగ్-ఇన్ హైబ్రిడ్ ఎస్‌యూవీకి కంపెనీ ఎంజీ హెక్టార్ హాక్ అని పేరు పెట్టే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ సరికొత్త ప్రీమియం కారును జూలై 16, 2026న కంపెనీ అధికారికంగా ప్రపంచానికి పరిచయం చేయబోతోంది.

రాబోయే సరికొత్త ఎంజీ హెక్టార్ హాక్, దాని ఎలక్ట్రిక్ వెర్షన్ కార్లు రెండూ కూడా చైనా మార్కెట్లో విపరీతమైన ఆదరణ పొందిన వులింగ్ స్టార్‌లైట్ 560 మోడల్ ఆధారంగా తయారవుతున్నాయి. దీనివల్ల ఈ రెండు ఎస్‌యూవీల ప్లాట్‌ఫారమ్, బాడీ స్ట్రక్చర్, మెకానికల్ పార్ట్స్ చాలా వరకు ఒకేలా ఉండే అవకాశం ఉంది.

MG Hector Hawk to Debut on July 16 New Plug-in Hybrid SUV Promises 1100 km Driving Range

అయితే భారతదేశపు రోడ్లు, ఇక్కడి కస్టమర్ల అభిరుచికి తగ్గట్లు ఇంజిన్, బ్యాటరీ సెటప్‌లలో కంపెనీ కొన్ని కీలక మార్పులు చేస్తోంది. మన దేశంలో ఇప్పటివరకు ఎంజీ సంస్థ నుంచి పూర్తిస్థాయి ప్లగ్-ఇన్ హైబ్రిడ్ కారు రాలేదు కాబట్టి, ఆ విభాగంలో రాబోతున్న ఈ సరికొత్త హాక్ మోడల్‌పై మార్కెట్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.

ఈ కారుకు సంబంధించిన టెక్నికల్ వివరాలను గమనిస్తే.. చైనా వెర్షన్‌లో ఉన్నట్లుగానే భారత మోడల్‌లో కూడా 1.5-లీటర్ నేచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజన్‌తో పాటు ఒక పవర్‌ఫుల్ ఎలక్ట్రిక్ మోటార్, 20.5 kWh సామర్థ్యం గల బ్యాటరీ ప్యాక్‌ను అందించే అవకాశం ఉంది. ఈ రెండు పవర్స్ కలిసి కారుకు ఏకంగా 197 bhp పవర్‌ను, 230 Nm టాప్ టార్క్‌ను అందిస్తాయి.

MG Hector Hawk to Debut on July 16 New Plug-in Hybrid SUV Promises 1100 km Driving Range

ఈ కారులోని స్పెషాలిటీ ఏంటంటే.. పెట్రోల్ ఏమాత్రం వాడకుండా కేవలం ప్యూర్ ఎలక్ట్రిక్ మోడ్‌లోనే ఈ ఎస్‌యూవీ ఏకంగా 100 కిలోమీటర్ల దూరం ప్రయాణిస్తుంది. ఒకవేళ పెట్రోల్ ఇంజన్ మరియు బ్యాటరీ పవర్ రెండింటినీ కలిపి ఉపయోగిస్తే.. ఈ కారు ఏకంగా 1,100 కిలోమీటర్ల లాంగ్ డ్రైవింగ్ రేంజ్‌ను ఇస్తుంది. అంటే సుదూర ప్రయాణాలు చేసే వారికి రీఛార్జ్ లేదా పెట్రోల్ కొట్టించే టెన్షన్ అస్సలు ఉండదు.

మరోవైపు, దీనితో పాటే రాబోతున్న పూర్తి ఎలక్ట్రిక్ మోడల్‌లో 56.7 kWh సామర్థ్యం గల భారీ బ్యాటరీ ప్యాక్‌ను అమర్చనున్నట్లు సమాచారం. ఇది సింగిల్ ఎలక్ట్రిక్ మోటార్ సహాయంతో 236 bhp పవర్‌ను, 200 Nm టార్క్‌ను జనరేట్ చేస్తుంది. ఒకసారి ఫుల్ ఛార్జ్ చేస్తే ఈ ఈవీ కారు ఏకంగా 500 కిలోమీటర్ల టాప్ రేంజ్ ఇస్తుందని కంపెనీ చెబుతోంది.

MG Hector Hawk to Debut on July 16 New Plug-in Hybrid SUV Promises 1100 km Driving Range

పర్ఫార్మెన్స్ పరంగా కూడా ఈ కారు చాలా వేగంగా ఉంటుంది.. కేవలం 13 సెకన్లలోనే సున్నా నుంచి 100 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటుంది. ఇక ఛార్జింగ్ విషయానికి వస్తే, డీసీ ఫాస్ట్ ఛార్జర్ సహాయంతో కేవలం 20 నిమిషాల్లోనే దీని బ్యాటరీని 30 శాతం నుంచి 80 శాతానికి ఛార్జ్ చేయవచ్చు. ఒకవేళ ఇంట్లో ఉండే సాధారణ ఏసీ ఛార్జర్ ద్వారా అయితే పూర్తిగా ఛార్జ్ అవ్వడానికి 9.2 గంటల సమయం పడుతుంది.

కొత్త ఎంజీ హెక్టార్ హాక్ కారును అధునాతన, లగ్జరీ ఫీచర్లతో కంపెనీ ముస్తాబు చేస్తోంది. కారు లోపల డాష్‌బోర్డ్‌పై 12.8-ఇంచుల భారీ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, డ్రైవర్ కోసం 8.8-ఇంచుల డిజిటల్ డిస్‌ప్లే, అద్భుతమైన సౌండ్ ఇచ్చే 6-స్పీకర్ల ఆడియో సిస్టమ్, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ వంటి ఫీచర్లు ఉన్నాయి.

సేఫ్టీ కోసం ఇందులో సరికొత్త ఆల్-ఎల్ఈడీ లైటింగ్ సిస్టమ్‌తో పాటు ప్రమాదాలను ముందుగానే పసిగట్టే 'లెవెల్-2 ఏడీఏఎస్' (Level-2 ADAS) టెక్నాలజీని కూడా జోడించారు. ఈ కారు పొడవు 4,745 మిమీ, వెడల్పు 1,850 మిమీ, ఎత్తు 1,770 మిమీగా ఉంటుంది. దీని పెద్ద 2,810 మిమీ వీల్‌బేస్ కారణంగా కారు లోపల ప్రయాణికులకు కూర్చోవడానికి చాలా విశాలమైన స్పేస్, లగ్జరీ కంఫర్ట్ లభిస్తుంది.

Article Published On: Friday, July 10, 2026, 16:32 [IST]
English summary
Mg hector hawk to debut on july 16 new plug in hybrid suv promises 1100 km driving range
Read more on: #mg motors
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+