ఇప్పుడు అందరికి ఇలాంటి కారే కావాలి! మార్కెట్లోకి స్టైలీష్ కారు లాంచ్.. మొదటి 3,000 మందికి స్పెషల్ గిఫ్ట్స్
JSW MG మోటార్ ఇండియా తమ తాజా ఫ్లాగ్‌షిప్ SUVను భారత మార్కెట్‌లో అధికారికంగా ప్రవేశపెట్టింది. 2025 భారత్ మొబిలిటీ ఎక్స్‌పోలోనే భారీ ఆకర్షణగా నిలిచిన పెద్ద సైజు ఫ్యామిలీ SUV MG మెజెస్టర్ (Majestor) ఇప్పుడు లాంచ్ అయింది. మెజెస్టర్‌ను ఒక్కసారి చూసిన వెంటనే ఇది సాధారణ SUV కాదు, పూర్తి స్థాయి ప్రీమియం - రాయల్ క్లాస్ వాహనం అన్న ఫీలింగ్ కలుగుతుంది. ప్రత్యేకంగా ఇండియన్ ఫ్యామిలీల అవసరాలను దృష్టిలో పెట్టుకొని డిజైన్ చేసిన ఈ SUV, రోజువారీ ప్రయాణాల నుంచి లాంగ్ హైవే డ్రైవ్‌ల వరకు అన్ని పరిస్థితుల్లోనూ కంఫర్ట్, పవర్, స్టేబిలిటీ అందించేలా రూపొందించారు. విశాలమైన క్యాబిన్, బలమైన రోడ్ ప్రెజెన్స్‌తో మెజెస్టర్ పెద్ద కుటుంబాలకు సరైన ఎంపికగా కనిపిస్తోంది.
MG మోటార్ ఇండియా ఈ SUV కోసం ప్రీ-బుకింగ్‌లను ప్రారంభించింది. ఆసక్తి ఉన్న కస్టమర్లు రూ.41,000 టోకెన్ అమౌంట్ చెల్లించి మెజెస్టర్‌ను బుక్ చేసుకోవచ్చు. దీని ధరలను కంపెనీ ఏప్రిల్ నెలలో వెల్లడించనుంది. ఈ SUVకు సంబంధించిన డెలివరీలు మే నెల నుంచి అధికారికంగా ప్రారంభమవుతాయని కంపెనీ స్పష్టంగా ధృవీకరించింది. లాంచ్ ముందే భారీ ఆసక్తి నెలకొనడంతో, ప్రారంభ దశలోనే కస్టమర్లను ఆకట్టుకునేందుకు MG ప్రత్యేక బెనిఫిట్స్‌ను కూడా ప్రకటించింది.

మెజెస్టర్‌ను ముందస్తుగా బుక్ చేసుకునే మొదటి 3,000 మంది కస్టమర్లకు భారీ హామీలు ఇస్తోంది. ఇందులో భాగంగా 5 సంవత్సరాల ఉచిత అపరిమిత కిలోమీటర్ వారంటీ, 5 సంవత్సరాల రోడ్‌సైడ్ అసిస్టెన్స్, అలాగే 5 సంవత్సరాల లేబర్-ఫ్రీ సర్వీస్ కాంట్రాక్ట్‌ను అందించనుంది. ఇది దీర్ఘకాలిక యాజమాన్యంలో కస్టమర్లకు అదనపు నమ్మకాన్ని, మానసిక ప్రశాంతతను అందించే నిర్ణయంగా భావించవచ్చు. వేరియంట్ల విషయానికి వస్తే, MG మెజెస్టర్ మూడు ట్రిమ్‌లలో అందుబాటులోకి రానుంది.
ఇది షార్ప్ 4x2, సావీ 4x2, అలాగే ఆఫ్-రోడ్ ప్రేమికులను లక్ష్యంగా చేసుకున్న సావీ 4x4 వేరియంట్లలో లభిస్తుంది. పెద్ద కుటుంబాల అవసరాలను దృష్టిలో పెట్టుకొని, ఈ SUVను 6-సీటర్ లేదా 7-సీటర్ ఆప్షన్లలో కూడా అందించనున్నారు. దీంతో కంఫర్ట్‌తో పాటు ఫ్లెక్సిబిలిటీ కూడా మెజెస్టర్ ప్రత్యేకతగా నిలుస్తోంది. డిజైన్ పరంగా చూస్తే, ఇది గ్లోస్టర్ ప్లాట్‌ఫామ్‌పై ఆధారపడినప్పటికీ, మెజెస్టర్‌కు పూర్తిగా కొత్త ఐడెంటిటీ ఇచ్చారు.

ముందుభాగంలో రెండు వైపులా ఇంటిగ్రేటెడ్ LED DRLలు, వాటి కింద నిలువుగా అమర్చిన చదరపు ఆకారంలోని LED హెడ్‌ల్యాంప్‌లు బోల్డ్, రాయల్ లుక్‌ను ఇస్తాయి. పెద్ద సైజ్ బాడీ, స్ట్రాంగ్ రోడ్ ప్రెజెన్స్‌తో మెజెస్టర్ దూరం నుంచే ప్రత్యేకంగా కనిపించేలా డిజైన్ చేశారు. కలర్స్ విషయానికి వస్తే, ఈ D-సెగ్మెంట్ SUV మెటల్ బ్లాక్, పెర్ల్ వైట్, కాంక్రీట్ గ్రే, మెటల్ యాష్ వంటి ప్రీమియం మోనోటోన్ షేడ్స్‌లో లభించనుంది.
ఈ భారీ SUVలో 2.0-లీటర్ ట్విన్-టర్బో డీజిల్ ఇంజిన్ అందించారు. ఎనిమిది-స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌తో పాటు అధునాతన 4x4 డ్రైవ్ సిస్టమ్‌కు జతచేయబడిన ఈ ఇంజిన్ 213 bhp శక్తిని, 478 Nm పీక్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. దీని ఇంటీరియర్‌లో కనిపించే స్మోక్డ్ ఎబోనీ థీమ్, మెటీరియల్స్ క్వాలిటీ నుంచి ఫినిషింగ్ వరకూ ప్రతీ అంశం హై-ఎండ్ కస్టమర్లను దృష్టిలో పెట్టుకుని రూపొందించబడింది.

ఫీచర్ల జాబితా చూస్తే, పెద్ద పనోరమిక్ సన్‌రూఫ్ క్యాబిన్‌ను మరింత విశాలంగా మార్చగా, లెవల్-2 ADAS సిస్టమ్, డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, మధ్యలో భారీ 12.3-అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్, త్రీ-జోన్ క్లైమేట్ కంట్రోల్, ముందు సీట్లలో ఉన్న వెంటిలేషన్, మసాజ్ ఫంక్షన్‌లు దూర ప్రయాణాలను కూడా అలసటలేని అనుభూతిగా మార్చుతాయి. నగర ట్రాఫిక్ అయినా, టైట్ పార్కింగ్ స్పేస్‌లైనా సులభంగా నిర్వహించేందుకు 360-డిగ్రీ కెమెరా సిస్టమ్ అదనపు నమ్మకాన్ని ఇస్తుంది.


Click it and Unblock the Notifications








