ప్రపంచాన్ని శాసించబోతున్న ఎంజీ మోటార్స్.. ప్రత్యర్థులకు నిద్రలేకుండా చేస్తున్న '5-5-5' ప్లాన్
భారతదేశ ఆటోమొబైల్ రంగంలో ప్రీమియం ఎస్‌యూవీల హవా పెరుగుతుంది. ఈ తరుణంలో జేఎస్‌డబ్ల్యూ ఎంజీ మోటార్ (JSW MG Motor) తన ప్రతిష్టాత్మక మోడల్ మెజెస్టర్ (MG MAJESTOR)తో సంచలనం సృష్టిస్తోంది. దేశంలోనే మొట్టమొదటి D+ సెగ్మెంట్ ఎస్‌యూవీగా గుర్తింపు పొందిన ఈ కారును కేవలం అమ్మడమే కాకుండా, కస్టమర్లకు దీర్ఘకాలిక భరోసా ఇచ్చేందుకు కంపెనీ '5-5-5 పీస్ ఆఫ్ మైండ్' (5-5-5 Complete Peace of Mind) అనే వినూత్న కార్యక్రమాన్ని ప్రకటించింది. సాధారణంగా లగ్జరీ కార్లు కొనేవారికి మెయింటెనెన్స్ ఖర్చులు భారంగా అనిపిస్తుంటాయి, కానీ ఎంజీ మోటార్ ఈ ప్యాకేజీతో ఆ భయాలకు చెక్ పెట్టింది.
ఏమిటీ ఈ 5-5-5 మ్యాజిక్?
ఈ ప్రత్యేక ప్యాకేజీ కింద ఎంజీ మోటార్ మూడు కీలకమైన హామీలను అందిస్తోంది. అవి:
5 సంవత్సరాల అపరిమిత కిలోమీటర్ల వారంటీ: మీరు ఎన్ని కిలోమీటర్లు తిరిగినా, ఐదు ఏళ్ల పాటు కారు వారంటీ పరిధిలోనే ఉంటుంది.
5 సంవత్సరాల రోడ్ సైడ్ అసిస్టెన్స్ (RSA): దేశంలో ఎక్కడైనా కారు బ్రేక్‌డౌన్ అయితే, అపరిమిత కిలోమీటర్ల వరకు ఉచితంగా సహాయం అందిస్తారు.
5 ఉచిత సర్వీసులు (Labour-free): మొదటి ఐదు సర్వీసులకు ఎలాంటి లేబర్ ఛార్జీలు వసూలు చేయరు.

సాధారణంగా ఇతర కంపెనీలు ఇలాంటి సౌకర్యాల కోసం అదనంగా డబ్బులు వసూలు చేస్తాయి, కానీ మెజెస్టర్ కొనుగోలుదారులకు ఇది ఒక స్టాండర్డ్ ఆఫర్‌గా లభిస్తుంది. దీనివల్ల కారు కొన్న మొదటి ఐదేళ్ల వరకు యజమానికి ఎలాంటి అదనపు మెయింటెనెన్స్ టెన్షన్ ఉండదు.
పవర్‌ఫుల్ ఇంజిన్ - ఆఫ్-రోడింగ్ కింగ్
ఎంజీ మెజెస్టర్ కేవలం సౌకర్యంలోనే కాదు, పర్ఫార్మెన్స్‌లో కూడా తోపు అనిపించుకుంటోంది. ఇందులో 2.0 లీటర్ ట్విన్-టర్బో డీసెల్ ఇంజిన్‌ను అమర్చారు. ఇది 8-స్పీడ్ ఆటోమేటెడ్ గేర్‌బాక్స్‌తో వస్తుంది. 2WD,4WD ఆప్షన్లలో ఇది లభిస్తుంది. ఆఫ్-రోడింగ్ ప్రియుల కోసం ఈ కారులో ఈ సెగ్మెంట్‌లోనే మొదటిసారిగా ట్రిపుల్ డిఫరెన్షియల్ లాక్స్ (ముందు, వెనుక, మధ్య) అందించారు. అంతేకాకుండా, 10 రకాల ఆఫ్-రోడ్ మోడ్స్ ఉండటం వల్ల ఎలాంటి కఠినమైన దారుల్లోనైనా ఈ కారు రాజాలా దూసుకుపోతుంది.

టెక్నాలజీ, సేఫ్టీలో నంబర్ వన్
భారతదేశంలో లెవల్ 2 ADAS (Advanced Driver Assistance System) ఫీచర్ కలిగిన మొదటి D+ ఎస్‌యూవీ ఇదే కావడం విశేషం. ఇందులో క్రాల్ కంట్రోల్ మోడ్, 219 mm గ్రౌండ్ క్లియరెన్స్, 810 mm వాటర్ వేడింగ్ సామర్థ్యం (నీటిలో ప్రయాణించే శక్తి) ఉన్నాయి. అంటే భారీ వర్షాలు కురిసినా, రోడ్లపై నీరు నిలిచినా ఈ కారు ఏమాత్రం బెదరదు. లోపల కేబిన్ చాలా విశాలంగా, లగ్జరీగా ఉంటుంది. అత్యాధునిక ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ మరియు కనెక్టెడ్ కార్ ఫీచర్లతో ఇది ఒక విలాసవంతమైన విమానంలా అనిపిస్తుంది.
బుకింగ్స్, డెలివరీ వివరాలు
ఈ పవర్‌ఫుల్ ఎస్‌యూవీ కోసం బుకింగ్స్ ఇప్పటికే ప్రారంభమయ్యాయి. ఆసక్తి గల కస్టమర్లు రూ.41,000 చెల్లించి ఈ కారును రిజర్వ్ చేసుకోవచ్చు. ఏప్రిల్ 2026 నుంచి షోరూమ్‌లలో ఈ కారు ప్రదర్శనకు అందుబాటులో ఉంటుంది మరియు అదే సమయంలో టెస్ట్ డ్రైవ్‌లు కూడా ప్రారంభమవుతాయి. ఇక మే 2026 నుంచి కస్టమర్లకు డెలివరీలు అందించాలని కంపెనీ లక్ష్యంగా పెట్టుకుంది. "కస్టమర్లకు కేవలం ఒక కారును ఇవ్వడమే కాకుండా, వారికి పూర్తి ప్రశాంతతను అందించడమే మా లక్ష్యం" అని జేఎస్‌డబ్ల్యూ ఎంజీ మోటార్ ఇండియా సీసీఓ వినయ్ రైనా పేర్కొన్నారు.


Click it and Unblock the Notifications








