పవర్‌ఫుల్ కార్ కమింగ్ ఫ్రమ్ పవర్‌ఫుల్ కంపెనీ.. రేపు ఇండియాలోకి ఎంట్రీ.. ఫార్చునర్‌కు భయం మొదలైంది

రేపు (ఫిబ్రవరి 12) ఆటోమొబైల్ ప్రేమికుల కోసం ఒక పెద్ద రోజు. JSW MG మోటార్ ఇండియా తమ కొత్త కారును ఘనంగా మార్కెట్‌లోకి తీసుకురావడానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. 2025 భారత్ మొబిలిటీ ఎక్స్‌పోలో ఇప్పటికే ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించిన పెద్ద-సైజు ఫ్యామిలీ SUV మెజెస్టర్ (Majestor) ఇప్పుడు అధికారికంగా అమ్మకానికి రానుంది. MG మెజెస్టర్‌ను చూసిన వెంటనే ఇది ఒక ప్రీమియం, రాయల్ ఫీల్ కలిగిన SUV అనే భావన కలుగుతుంది. ఈ SUVను ముఖ్యంగా ఇండియన్ ఫ్యామిలీలను టార్గెట్ చేసి అభివృద్ధి చేశారు. రోజువారీ ప్రయాణాల నుంచి హైవే ట్రిప్స్ వరకు అన్ని పరిస్థితుల్లోనూ మంచి డ్రైవింగ్ అనుభూతిని అందించాలనే లక్ష్యంతో మెజెస్టర్‌ను రూపొందించారు. ఈ కారు వివరాలను ఈ కింది కథణంలో చూద్దాం.

కొత్త MG మెజెస్టర్ SUV ధర రూ.37 లక్షల నుంచి రూ.40 లక్షల వరకు (ఎక్స్-షోరూమ్) ఉండొచ్చని అంచనా. ఈ ప్రైస్ రేంజ్‌లో ఒక ప్రీమియం ఫుల్-సైజ్ ఫ్యామిలీ SUVగా మెజెస్టర్ మంచి విలువను అందించగలదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఫ్యామిలీ అవసరాలను దృష్టిలో పెట్టుకుని ఈ కారును 6 సీట్ల లేదా 7 సీట్లతో అందించే అవకాశం ఉంది. విశాలమైన క్యాబిన్ లేఅవుట్‌తో ప్రయాణీకులు హాయిగా కూర్చుని ప్రయాణాలు చేయవచ్చు.

Mg Majestor Suv Set For India Debut Tomorrow Expected Price And Details

లాంగ్ డ్రైవ్‌లలో కూడా ఇబ్బంది లేకుండా కంఫర్ట్ అందించే సీటింగ్ పొజిషన్, లెగ్‌రూమ్ ఈ SUV ప్రత్యేకతగా నిలుస్తాయి. దాదాపు 343 లీటర్ల బూట్ స్పేస్ ఉండొచ్చని అంచనా వేస్తున్నారు. వారాంతపు ట్రిప్స్, సెలవు దినాల్లో కుటుంబంతో కలిసి దూర ప్రాంతాలకు వెళ్లే సమయంలో ఎక్కువ సామాను సులభంగా తీసుకెళ్లే వీలును ఇది కల్పిస్తుంది. ఫ్యామిలీ టూరింగ్‌ను ఇష్టపడే వారికి ఇది ఒక పెద్ద ప్లస్‌గా మారనుంది.

డిజైన్ పరంగా ఇప్పటికే చాలా వివరాలు బయటకు వచ్చాయి, అవన్నీ కూడా ఈ SUV ఎంత ఆకర్షణీయంగా ఉందో చెప్పేలా ఉన్నాయి. ముందు భాగంలో భారీ గ్రిల్, స్టైలిష్ బంపర్‌తో ఇది రోడ్డుపై బోల్డ్ ప్రెజెన్స్ చూపించేలా ఉంటుంది. ఆధునిక LED హెడ్‌లైట్లు, షార్ప్ LED DRLలు, వెనుక భాగంలో ఆకర్షణీయమైన LED టెయిల్ లైట్లు కారుకు ప్రీమియం లుక్‌ను మరింత పెంచుతున్నాయి.

Mg Majestor Suv Set For India Debut Tomorrow Expected Price And Details

క్యాబిన్ లోపల కూర్చునే వెంటనే ఒక ప్రీమియం లగ్జరీ కారులో ఉన్న ఫీలింగ్ రావాలనే ఉద్దేశంతో దీని ఇంటీరియర్‌ను డిజైన్ చేసినట్లు తెలుస్తోంది. డ్యాష్‌బోర్డ్ మధ్యలో పెద్ద 12.3-అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ ఉండగా, దీనిలో ఆండ్రాయిడ్ ఆటో, ఆపిల్ కార్‌ప్లే వంటి స్మార్ట్ కనెక్టివిటీ ఫీచర్లు ఉంటాయి. డ్రైవర్ ముందు మరో 12.3-అంగుళాల డిజిటల్ డ్రైవర్ డిస్ప్లే ఉండటం వల్ల అవసరమైన డ్రైవింగ్ సమాచారం స్పష్టంగా కనిపిస్తుంది.

క్యాబిన్‌లో వాతావరణాన్ని మరింత ఆకర్షణీయంగా మార్చేందుకు 64 రంగుల యాంబియంట్ లైటింగ్‌ను అందించే అవకాశం ఉంది. రాత్రి ప్రయాణాల్లో ఇది ఒక ప్రత్యేకమైన ప్రీమియం అనుభూతిని ఇస్తుందని చెప్పవచ్చు. మ్యూజిక్ లవర్స్ కోసం 12-స్పీకర్ JBL ప్రీమియం ఆడియో సిస్టమ్‌ను అందించనున్నారని తెలుస్తోంది అంతేకాదు, ట్రిపుల్ జోన్ క్లైమేట్ కంట్రోల్ ఫీచర్‌తో ముందు, వెనుక సీట్లలో కూర్చున్న ప్రయాణీకులు తమకు కావలసిన ఉష్ణోగ్రతను సెట్ చేసుకునే సౌలభ్యం కూడా ఉంటుంది.

Mg Majestor Suv Set For India Debut Tomorrow Expected Price And Details

పవర్‌ట్రెయిన్ విషయానికి వస్తే, దీనిలో 2.0-లీటర్ ట్విన్-టర్బో డీజిల్ ఇంజిన్‌ను అందించనున్నట్లు సమాచారం. ఈ ఇంజిన్ 216 bhp హార్స్‌పవర్, 479 Nm పీక్ టార్క్‌ను ఉత్పత్తి చేయగలదు. దీనికి జతగా 8-స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్ లభించనుండటంతో సిటీ డ్రైవ్ అయినా, హైవే జర్నీ అయినా స్మూత్ డ్రైవింగ్ అనుభూతి లభించే అవకాశం ఉంది. మైలేజీ పరంగా ఇది సుమారు 15.34 kmpl వరకు ఫ్యూయల్ ఎఫిషియెన్సీ ఇవ్వొచ్చని అంచనా.

More from DriveSpark

Article Published On: Wednesday, February 11, 2026, 11:12 [IST]
English summary
Mg majestor suv set for india debut tomorrow expected price and details
Read more on: #mg motors #india
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+