ఒక్కసారి ఛార్జింగ్ పెట్టి మూడు జిల్లాలు తిరగొచ్చు..ఈ కారులో పడుకుని ఆకాశాన్ని చూస్తూ ఎంజాయ్ చేయొచ్చు
ప్రస్తుతం పెట్రోల్, డీజిల్ ధరలు మండిపోతున్నాయి. ఈ సందర్భంలో సామాన్యుల చూపు ఎలక్ట్రిక్ వాహనాల వైపు మళ్లుతోంది. ముఖ్యంగా ఫ్యామిలీతో కలిపి ప్రయాణించే వారికి సరిగ్గా సరిపోయేలా ఎంజీ విండ్సర్ ఈవీ(MG Windsor EV) మార్కెట్లో సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది.
అదిరిపోయే రేంజ్, లగ్జరీ ఫీచర్లు, అందరికీ అందుబాటులో ఉండే ధరతో ఈ కారు ఎలక్ట్రిక్ కార్ల విభాగంలో రారాజుగా నిలుస్తోంది. 499 కిలోమీటర్ల రేంజ్, కేవలం 50 నిమిషాల్లోనే ఛార్జ్ అయ్యే కెపాసిటీ దీని సొంతం. ఎంజీ మోటార్స్ ఇండియా తన విండ్సర్ ఈవీని కేవలం ఒక కారులా కాకుండా, ఒక లగ్జరీ లాంజ్ లా డిజైన్ చేసింది.

సాధారణంగా ఎలక్ట్రిక్ కార్లు అంటే ఇరుగ్గా ఉంటాయనే అపోహను ఈ కారు పటాపంచలు చేసింది. విశాలమైన క్యాబిన్, అద్భుతమైన లెగ్ స్పేస్, ప్రీమియం ఫీచర్లతో ఇది ఫ్యామిలీకి బెస్ట్ ఆప్షన్ గా మారిపోయింది. మరీ ముఖ్యంగా బడ్జెట్ 2026 తర్వాత ఎలక్ట్రిక్ వాహనాలపై పెరిగిన ప్రోత్సాహకాలతో ఈ కారు మరింత ఆకర్షణీయంగా తయారైంది.
ఎంజీ విండ్సర్ ఈవీ ఎక్స్ షోరూం ధర సుమారు రూ.14 లక్షల నుంచి ప్రారంభమవుతుంది. అయితే ఎంజీ కంపెనీ ఒక వినూత్నమైన BaaS (Battery-as-a-Service) మోడల్‌ను పరిచయం చేసింది. దీని ప్రకారం మీరు కారును కేవలం రూ.9.99 లక్షలకే కొనుగోలు చేయవచ్చు.

బ్యాటరీ ఖర్చును మీరు కొన్నప్పుడు చెల్లించకుండా, దానికి కిలోమీటరుకు ఇంత అని అద్దె చెల్లించాల్సి ఉంటుంది. దీనివల్ల కారు ప్రారంభ ధర గణనీయంగా తగ్గి సామాన్యుడికి కూడా ఎలక్ట్రిక్ కారును సొంతం చేసుకునే అవకాశం దక్కుతుంది.
బ్యాటరీ కెపాసిటీ, రేంజ్ విండ్సర్ ఈవీలో రెండు రకాల బ్యాటరీ ప్యాక్ ఆప్షన్లు ఉన్నాయి.
38 kWh బ్యాటరీ: ఇది ఒక్కసారి ఛార్జ్ చేస్తే 332 కిలోమీటర్ల రేంజ్ ఇస్తుంది. సిటీ డ్రైవింగ్‌కు ఇది సరిగ్గా సరిపోతుంది.
52.9 kWh బ్యాటరీ: ఇది ఏకంగా 449 కిలోమీటర్ల (MIDC సర్టిఫైడ్) రేంజ్ను అందిస్తుంది. ఛార్జింగ్ విషయంలో కూడా ఈ కారు టాప్ క్లాస్. 60 kW DC ఫాస్ట్ ఛార్జర్ వాడితే కేవలం 50 నిమిషాల్లోనే 80 శాతం ఛార్జింగ్ పూర్తవుతుంది. అంటే మీరు ఒక హోటల్ లో భోజనం చేసి వచ్చేలోపు కారు మళ్ళీ జర్నీకి రెడీ అవుతుంది.

ఈ కారు లోపల అడుగుపెడితే ఏదో విమానం బిజినెస్ క్లాసులో ఉన్నట్లు అనిపిస్తుంది. ఇందులో 15.6 అంగుళాల భారీ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ ఉంది. వెనుక సీట్లను 135 డిగ్రీల వరకు రిక్లైన్ (వాల్చుకోవడం) చేయవచ్చు, దీనివల్ల ఎంత పెద్ద లాంగ్ జర్నీలు చేసినా అలసట ఉండదు. పైకప్పున ఉండే పనోరమిక్ గ్లాస్ రూఫ్ ద్వారా ఆకాశాన్ని చూస్తూ ఎంజాయ్ చేయవచ్చు. 579 లీటర్ల భారీ బూట్ స్పేస్ ఉండటంతో, ఫ్యామిలీ మొత్తం సామాన్లను సులభంగా సర్దుకోవచ్చు.
మన దేశంలోని రోడ్ల మీద సేఫ్టీ అనేది చాలా ముఖ్యం. విండ్సర్ ఈవీలో 6 ఎయిర్‌బ్యాగ్‌లు, 360-డిగ్రీ కెమెరా, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్ వంటి ఫీచర్లు ఉన్నాయి. టాప్ వేరియంట్లలో లెవల్ 2 ADAS టెక్నాలజీ ఉంది. దీనివల్ల కారు ఆటోమేటిక్ ఎమర్జెన్సీ బ్రేకింగ్, లేన్ కీప్ అసిస్ట్, అడాప్టివ్ క్రూయిజ్ కంట్రోల్ వంటి అధునాతన సౌకర్యాలను కల్పిస్తుంది. ఇది డ్రైవర్‌కు ఎంతో భరోసానిస్తుంది.

మీరు నెలకు పెట్రోల్ కోసం వేల రూపాయలు ఖర్చు చేస్తూ, మెయింటెనెన్స్ తక్కువగా ఉండే కారు కావాలనుకుంటే ఎంజీ విండ్సర్ ఈవీ అద్భుతమైన ఆప్షన్. దీని రన్నింగ్ కాస్ట్ పెట్రోల్ కారుతో పోలిస్తే చాలా తక్కువ. పర్యావరణానికి మేలు చేయడమే కాకుండా, విలాసవంతమైన ప్రయాణాన్ని మీ కుటుంబానికి అందించడానికి ఈ కారు ఉత్తమమైనది.


Click it and Unblock the Notifications








