ఒక్కసారి ఛార్జ్ చేస్తే 450 కిమీ..ఈ కారులో ఎక్కితే విమానంలో వెళ్లినట్లే..ఇప్పుడు రూ.65 వేల డిస్కౌంట్ కూడా

ఎలక్ట్రిక్ కార్ల మార్కెట్‌లో తనదైన ముద్ర వేసిన ఎంజీ విండ్సర్ EV, 2025 క్యాలెండర్ ఇయర్లో అత్యధికంగా అమ్ముడైన ఈవీగా రికార్డు సృష్టించింది. అయితే గతేడాది నవంబర్, డిసెంబర్ నెలల్లో విక్రయాలు స్వల్పంగా తగ్గడంతో, కొత్త ఏడాదిలో మళ్ళీ జోరు పెంచేందుకు ఎంజీ మోటార్స్ సిద్ధమైంది. ఇందులో భాగంగానే విండ్సర్ EV చరిత్రలో మొదటిసారిగా ఏకంగా రూ.65,000 వరకు భారీ డిస్కౌంట్లను ప్రకటించింది. ఈ ఆఫర్ వల్ల కారు ధర లాంచ్ సమయంలో ఉన్న రేటు కంటే కూడా తక్కువకు లభించడం విశేషం.

విండ్సర్ EV ప్రారంభ ధర గతేడాది రూ.13.50 లక్షలుగా ఉండగా, జనవరి 2026లో అది రూ.14.00 లక్షలకు పెరిగింది. అయితే ఇప్పుడు ప్రకటించిన రూ.65,000 డిస్కౌంట్‌ను లెక్కిస్తే, ఈ కారును కేవలం రూ.13.35 లక్షలకే ఇంటికి తీసుకెళ్లవచ్చు. అంటే కారు మొదట లాంచ్ అయినప్పటి ధర కంటే ఇప్పుడు రూ.15,000 తక్కువకే లభిస్తోందన్నమాట. ఈ అద్భుతమైన అవకాశం కొత్త కారు కొనాలనుకునే వారికి ఒక గోల్డెన్ ఛాన్స్ అని చెప్పాలి.

MG Windsor EV Gets Massive Rs 65 000 Discount Now Cheaper Than Launch Price

విండ్సర్ EVలో రెండు రకాల బ్యాటరీ ఆప్షన్లు ఉన్నాయి. ఇందులో చిన్న బ్యాటరీ (38 kWh) వేరియంట్లకు కంపెనీ ఎక్కువ ప్రాధాన్యతనిస్తూ భారీ ఆఫర్లను ఇస్తోంది. దీనిపై రూ.30,000 ఫ్లాట్ క్యాష్ డిస్కౌంట్, రూ.25,000 ఎక్స్ఛేంజ్ బోనస్, రూ.10,000 కార్పొరేట్ డిస్కౌంట్ కలిపి మొత్తం రూ.65,000 వరకు లబ్ధి చేకూరుస్తోంది. అయితే, ఎక్కువ రేంజ్ ఇచ్చే పెద్ద బ్యాటరీ (52.9 kWh) వేరియంట్లకు మాత్రం డిమాండ్ ఎక్కువగా ఉండటంతో రూ.20,000 క్యాష్ డిస్కౌంట్, రూ.10,000 కార్పొరేట్ డిస్కౌంట్ మాత్రమే అందుబాటులో ఉన్నాయి.

విండ్సర్ EVని కేవలం ఎలక్ట్రిక్ కారు అని పిలిస్తే సరిపోదు, ఇదొక లగ్జరీ క్లౌడ్ లాంజ్. ఇందులో ఎయిరో లాంజ్ సీట్లు ఉన్నాయి, ఇవి 135 డిగ్రీల వరకు వెనక్కి వంగుతాయి. అంటే లాంగ్ జర్నీలో కూడా హాయిగా పడుకుని ప్రయాణించవచ్చు. లోపల 15.6 అంగుళాల భారీ టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, విజువల్స్ అదుర్స్ అనిపిస్తాయి. 8.8 అంగుళాల డిజిటల్ డ్రైవర్ డిస్‌ప్లే, పనోరమిక్ గ్లాస్ రూఫ్, 9 స్పీకర్ల ఇన్ఫినిటీ సౌండ్ సిస్టమ్ వంటి ఫీచర్లు ప్రయాణాన్ని మరింత కలర్‌ఫుల్‌గా మారుస్తాయి.

MG Windsor EV Gets Massive Rs 65 000 Discount Now Cheaper Than Launch Price

ఈ కారు భద్రత విషయంలోనూ రాజీ పడలేదు. ఇందులో 6 ఎయిర్‌బ్యాగ్‌లు, 360-డిగ్రీల కెమెరా, ఎలక్ట్రానిక్ పార్కింగ్ బ్రేక్ వంటివి ప్రామాణికంగా ఉన్నాయి. వీటికి అదనంగా లెవల్ 2 ADAS (అడ్వాన్స్‌డ్ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్) సదుపాయం కూడా ఉంది. ఇది ట్రాఫిక్ జామ్ అసిస్ట్, అడాప్టివ్ క్రూయిజ్ కంట్రోల్ మరియు కొలిజన్ అలర్ట్ వంటి ఫీచర్లతో డ్రైవింగ్‌ను మరింత సురక్షితం చేస్తుంది. అలాగే వెహికల్-టు-లోడ్ (V2L) ఫీచర్ ద్వారా మీ కారు బ్యాటరీతో ఇతర ఎలక్ట్రానిక్ వస్తువులను కూడా వాడుకోవచ్చు.

విండ్సర్ EV స్టాండర్డ్, ప్రో అనే రెండు వెర్షన్లలో లభిస్తోంది. స్టాండర్డ్ వేరియంట్ (38 kWh) ఒక్కసారి ఛార్జ్ చేస్తే 332 కిలోమీటర్ల రేంజ్ ఇస్తుంది. ఇక ప్రో వేరియంట్ (52.9 kWh) ఏకంగా 449 కిలోమీటర్ల భారీ రేంజ్‌ను ఆఫర్ చేస్తోంది. ప్రస్తుతం మార్కెట్లో ఉన్న టాటా కర్వ్ EV, త్వరలో రాబోతున్న మారుతి ఇ-విటారా వంటి కార్లకు ఇది గట్టి సవాలు విసురుతోంది. ఈ భారీ డిస్కౌంట్లతో ఎంజీ విండ్సర్ విక్రయాలు మళ్ళీ పుంజుకుంటాయని ఆటోమొబైల్ నిపుణులు భావిస్తున్నారు.

More from DriveSpark

Article Published On: Wednesday, January 14, 2026, 14:08 [IST]
English summary
Mg windsor ev gets massive rs 65 000 discount now cheaper than launch price
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+