కారు లోపల పడుకోవచ్చు..ఆకాశాన్ని చూడొచ్చు..విండ్సర్ ఫీచర్లు చూస్తే గుండె జారి గల్లంతవ్వాల్సిందే

భారతదేశ ఆటోమొబైల్ రంగంలో 2025 సంవత్సరం ఒక చారిత్రక మార్పుకు సాక్ష్యంగా నిలిచింది. ఎలక్ట్రిక్ వాహన మార్కెట్లో ఏళ్ల తరబడి ఏకఛత్రాధిపత్యం వహించిన టాటా మోటార్స్‌కు ఎంజీ మోటార్ ఇండియా కోలుకోలేని దెబ్బ కొట్టింది. కేవలం ఒకే ఒక్క కారు.. అది ఎంజీ విండ్‌సర్ (MG Windsor).

ఈ కారు విక్రయాల్లో సరికొత్త రికార్డులు సృష్టించి, దేశంలోనే అత్యధికంగా అమ్ముడైన ఈవీగా అగ్రస్థానాన్ని కైవసం చేసుకుంది. తక్కువ ధర, అదిరిపోయే ఫీచర్లు, వినూత్నమైన సేల్స్ ప్లాన్‌తో వచ్చిన విండ్‌సర్ సక్సెస్ స్టోరీ ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది.

MG Windsor EV Tops Indias EV Market in 2025 Beats Tata Motors with 46 735 Units Sold

2020లో నెక్సాన్ ఈవీ లాంచ్‌తో మొదలైన టాటా మోటార్స్ హవాకు 2025లో బ్రేక్ పడింది. జనవరి నుంచి డిసెంబర్ వరకు జరిగిన విక్రయాల్లో ఎంజీ విండ్‌సర్ ఏకంగా 46,735 యూనిట్లు అమ్ముడై దేశంలోనే నంబర్-1 ఎలక్ట్రిక్ కారుగా నిలిచింది. ఇది టాటా పాపులర్ మోడల్స్ అయిన నెక్సాన్ ఈవీ, పంచ్ ఈవీల ఉమ్మడి అమ్మకాలను కూడా దాటేయడం విశేషం.

ఈ అద్భుతమైన పర్ఫార్మెన్స్‌తో ఎంజీ మోటార్ ఈవీ అమ్మకాల్లో ఏకంగా 111 శాతం వృద్ధిని నమోదు చేసింది. కేవలం మెట్రో నగరాలకే పరిమితం కాకుండా, టైర్-2 పట్టణాల్లో కూడా విండ్‌సర్‌కు విపరీతమైన క్రేజ్ పెరిగింది. విండ్‌సర్ సక్సెస్ వెనుక ఉన్న అసలు రహస్యం దాని BaaS (Battery-as-a-Service) ధర విధానం.

MG Windsor EV Tops Indias EV Market in 2025 Beats Tata Motors with 46 735 Units Sold

కారు కొనేటప్పుడు బ్యాటరీ ధరను మినహాయించి, కేవలం కారు బాడీకి మాత్రమే ధర నిర్ణయించడంతో దీని ప్రారంభ ధర కేవలం రూ. 9.99 లక్షలకే (ఎక్స్-షోరూమ్) అందుబాటులోకి వచ్చింది. బ్యాటరీని అద్దెకు వాడుకున్నందుకు కిలోమీటరుకు రూ. 3.5 నుంచి రూ. 3.9 వరకు చెల్లించే సౌకర్యం మధ్యతరగతి ప్రజలకు వరంలా మారింది. దీనివల్ల పెట్రోల్ కార్ల ధరకే లగ్జరీ ఎలక్ట్రిక్ కారును సొంతం చేసుకునే అవకాశం కస్టమర్లకు లభించింది.

ఎంజీ విండ్‌సర్‌ను కేవలం కారు అనడం కంటే ఒక 'ఇంటెలిజెంట్ సియూవీ' (CUV) అనవచ్చు. ఇందులో విమానాల బిజినెస్ క్లాస్‌లో ఉండే ఏరో లౌంజ్ (Aero Lounge) సీట్లు ఉన్నాయి, ఇవి 135 డిగ్రీల వరకు వెనక్కి వంగుతాయి. దీనివల్ల ప్రయాణికులకు అత్యంత సౌకర్యవంతమైన ప్రయాణ అనుభూతి కలుగుతుంది.

MG Windsor EV Tops Indias EV Market in 2025 Beats Tata Motors with 46 735 Units Sold

డ్యాష్‌బోర్డ్ మీద 15.6 ఇంచుల భారీ గ్రాండ్ వ్యూ టచ్ స్క్రీన్, ఇన్ఫినిటీ వ్యూ గ్లాస్ రూఫ్, 360 డిగ్రీ కెమెరా, మరియు 6 ఎయిర్‌బ్యాగ్స్ వంటి ప్రీమియం ఫీచర్లు ఈ కారును సెగ్మెంట్ లీడర్‌గా మార్చాయి. విండ్‌సర్ రెండు బ్యాటరీ ఆప్షన్లలో లభిస్తుంది. 38 kWh బ్యాటరీతో 332 కి.మీ రేంజ్ ఇస్తుండగా, టాప్ వేరియంట్ అయిన ప్రో (PRO) వేరియంట్‌లో 52.9 kWh బ్యాటరీ ఉంటుంది, ఇది ఒక్కసారి ఛార్జ్ చేస్తే ఏకంగా 449 కి.మీ రేంజ్ అందిస్తుంది.

136 PS పవర్, 200 Nm టార్క్‌తో ఈ కారు సిటీ ట్రాఫిక్,హైవే ప్రయాణాలకు బెస్ట్ ఛాయిస్‌గా నిలిచింది. ఈ రికార్డు స్థాయి అమ్మకాలతో 2026లో కూడా ఎంజీ మోటార్ తన దూకుడును కొనసాగించేలా కనిపిస్తోంది.

More from DriveSpark

Article Published On: Tuesday, January 6, 2026, 11:40 [IST]
English summary
Mg windsor ev tops indias ev market in 2025 beats tata motors with 46 735 units sold
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+