రూ. 5 లక్షలు ఉంటే ఈ కారు కొనచ్చు! 34 కి.మీ మైలేజ్.. చిన్న కుటుంబాలకు దేశంలోనే పర్ఫెక్ట్ కారు
మారుతి సుజుకి సెలెరియో (maruti suzuki celerio) భారత మార్కెట్‌లో అత్యంత ప్రజాదరణ పొందిన హ్యాచ్‌బ్యాక్ కార్లలో ఒకటి. ముఖ్యంగా తక్కువ బడ్జెట్‌లో మంచి మైలేజ్, సిటీ డ్రైవింగ్‌కు సౌకర్యం, మారుతి బ్రాండ్ నమ్మకం కావాలనుకునే వినియోగదారులకు సెలెరియో ఒక బెస్ట్ ఆప్షన్‌గా నిలుస్తోంది. యువత నుంచి చిన్న కుటుంబాల వరకు విస్తృత వర్గాల వినియోగదారులను ఈ కారు ఆకర్షిస్తోంది. కొత్త తరం సెలెరియోకు మారుతి సుజుకి మరింత ఫ్రెష్ లుక్‌ను అందించింది. స్మూత్ కర్వ్స్‌తో కూడిన బాడీ, కొత్త గ్రిల్ డిజైన్, స్టైలిష్ హెడ్‌ల్యాంప్స్ వలన ఈ కారు మునుపటి మోడల్‌తో పోలిస్తే మరింత మోడ్రన్‌గా కనిపిస్తుంది. కాంపాక్ట్ సైజ్‌లో ఉన్నప్పటికీ, ఇది రోడ్లపై చక్కని ప్రెజెన్స్‌ను ఇస్తుంది. సిటీ ట్రాఫిక్‌లో ఈ కారును నడపడం చాలా ఈజీగా ఉంటుంది.
మారుతి సుజుకి సెలెరియో కారు ఎంట్రీ-లెవల్ వేరియంట్ అయిన LXi మాన్యువల్ ప్రస్తుత ఎక్స్-షోరూమ్ ధర కేవలం రూ. 4.70 లక్షలు మాత్రమే. ఈ ధర శ్రేణిలో ఒక నమ్మకమైన మారుతి కారును కొనుగోలు చేసే అవకాశం లభించడం చాలా మందికి పెద్ద ప్లస్ పాయింట్‌గా మారుతోంది. మరోవైపు, అన్ని ఫీచర్లతో వచ్చే టాప్ వేరియంట్ ZXi+ ఆటోమేటిక్ (AMT) ధర రూ. 6.73 లక్షలుగా ఉంది.

అంటే, తక్కువ బడ్జెట్ నుంచి కొంచెం ప్రీమియం అవసరాల వరకు అన్ని వర్గాల వినియోగదారులను ఈ కారు కవర్ చేస్తోంది. ఈ ధరలను పరిశీలిస్తే, పేద మరియు మధ్య తరగతి కుటుంబాలు కూడా ఎలాంటి ఆర్థిక ఒత్తిడి లేకుండా సెలెరియోను హాయిగా కొనుగోలు చేయగలుగుతాయి. ముఖ్యంగా మొదటిసారి కారు కొనాలనుకునే వారు, రోజూ ఆఫీస్‌కు వెళ్లే ఉద్యోగులు, చిన్న కుటుంబాలు వీళ్లందరికీ ఈ కారు ఒక ఆచరణాత్మక ఎంపికగా నిలుస్తోంది.
ధర తక్కువగా ఉన్నప్పటికీ, సెలెరియో పనితీరు విషయంలో ఎక్కడా రాజీ పడదు. ముఖ్యంగా మైలేజ్ పరంగా చూస్తే, ఇది భారతదేశంలో అత్యధికంగా అందించే పెట్రోల్ కార్లలో ఒకటి. సెలెరియో శక్తివంతమైన 2-సిలిండర్ పవర్‌ట్రెయిన్తో వస్తుంది. దీని 1-లీటర్ పెట్రోల్ ఇంజన్ 68.5 bhp హార్స్‌పవర్, 91 Nm పీక్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. అదేవిధంగా, 1-లీటర్ CNG ఇంజన్ 57 bhp హార్స్‌పవర్, 82 Nm పీక్ టార్క్‌ను అందిస్తుంది.

సుజుకి సెలెరియో మైలేజ్ విషయంలో భారతీయ వినియోగదారులను ఆకట్టుకునే స్థాయిలో నిలుస్తోంది. ఈ కారు పెట్రోల్ వేరియంట్లు మాత్రమే లీటరుకు సుమారు 26 కి.మీ వరకు మైలేజీని అందించడం విశేషం. రోజువారీ సిటీ డ్రైవింగ్‌కు ఇది చాలా ఉపయోగకరంగా మారుతుంది. అయితే, ఇంకా తక్కువ ఇంధన ఖర్చుతో ఎక్కువ ప్రయాణం చేయాలనుకునే వారి కోసం మారుతి సుజుకి ప్రత్యేకంగా CNG వేరియంట్లను కూడా అందిస్తోంది.
ఇప్పుడు సెలెరియో CNG వేరియంట్ల విషయానికి వస్తే, ఇవి నిజంగా ఆకట్టుకునే సంఖ్యలను చూపిస్తున్నాయి. మారుతి సుజుకి అధికారిక వెబ్‌సైట్ ప్రకారం, సెలెరియో CNG వేరియంట్‌కు ARAI సర్టిఫైడ్ మైలేజ్ 34.43 కి.మీ/కి.మీగా ఉంది. అంటే, ఒక్క కిలో CNGతోనే ఎక్కువ దూరం ప్రయాణించే అవకాశం ఈ కారుతో లభిస్తోంది. ప్రస్తుతం ఇంధన ధరలు పెరుగుతున్న పరిస్థితుల్లో, ఈ స్థాయి మైలేజ్ వినియోగదారులపై భారం తగ్గించే అంశంగా మారుతోంది.

ఈ కారులో అందించిన ఫీచర్స్‌ను ఒకసారి చూసినట్లయితే, 7-అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫో టైన్‌మెంట్ సిస్టమ్ ఉంది, దీంతో ఆడియో, కాంటాక్ట్స్, ఇతర కనెక్టివిటీ ఫీచర్లను సులభంగా ఉపయోగించవచ్చు. లోపల 5 సీట్ల సీటింగ్ అరేంజ్‌మెంట్ ఉంది. ఎలక్ట్రిక్ పవర్ స్టీరింగ్ సౌకర్యవంతమైన, లైట్, కంట్రోల్‌లో సులభమైన డ్రైవింగ్ అనుభూతిని ఇస్తుంది. ఇవే కాకుండా సేఫ్టీ కోసం కూడా అత్యున్నత ప్రమాణాలను కలిగి ఉంది.


Click it and Unblock the Notifications








