కేవలం 30 మాత్రమే.. ఎంతో అదృష్టం ఉంటే కానీ ఈ కారు మీరు కొనలేరు.. ఇండియాలోకి మినీ కూపర్ కొత్త కారు
లగ్జరీ, స్పోర్ట్స్ కార్ల ప్రియుల కోసం ప్రముఖ గ్లోబల్ ఆటోమొబైల్ బ్రాండ్ మినీ ఇండియా(Mini India) దేశీయ మార్కెట్లోకి ఒక అద్భుతమైన పవర్‌ఫుల్ కారును ప్రవేశపెట్టింది. రేసింగ్ ట్రాక్‌లపై దూసుకెళ్లే మినీ జీపీ (Mini GP) మోడల్ ఆధారంగా రూపొందించిన సరికొత్త Mini Cooper S GP Inspired Editionను భారత్‌లో అధికారికంగా లాంచ్ చేసింది.
ఈ సరికొత్త లగ్జరీ హాట్ హ్యాచ్‌బ్యాక్ ప్రారంభ ధరను రూ.58.90 లక్షలు (ఎక్స్-షోరూమ్) గా కంపెనీ నిర్ణయించింది. అత్యంత ప్రీమియం, లిమిటెడ్ ఎడిషన్‌గా వస్తున్న ఈ కారును భారతదేశం మొత్తం మీద కేవలం 30 మంది అదృష్టవంతులకు మాత్రమే విక్రయించనున్నారు. ఈ మోడల్ కోసం మే నెల ప్రారంభం నుంచే ప్రీ-బుకింగ్స్ ఓపెన్ అయ్యాయి.

సాధారణ మినీ కూపర్ ఎస్ మోడల్‌తో పోలిస్తే ఈ జీపీ ఇన్‌స్పైర్డ్ ఎడిషన్‌లో కంపెనీ మైండ్ బ్లాకింగ్ కాస్మెటిక్ అప్‌గ్రేడ్స్ చేసింది. కారు బాడీకి ఎక్స్‌క్లూజివ్ లెజెండ్ గ్రే(Legend Grey) కలర్ షేడ్‌ను ఇచ్చి, కారు రూఫ్, సైడ్ మిర్రర్ క్యాప్స్‌పై చిల్లీ రెడ్ (Chili Red) కలర్ హైలైట్స్‌ను జోడించారు. బోనెట్‌పై రేసింగ్ స్ట్రైప్స్, సైడ్ గ్రాఫిక్స్ కారుకు పక్కా రేస్ కార్ లుక్‌ను ఇస్తున్నాయి.
దీని ఫ్రంట్ ప్రొఫైల్‌లో జాన్ కూపర్ వర్క్స్ (JCW) ప్రేరిత బంపర్, స్పోర్టీ గ్రిల్, రెడ్ వింగ్లెట్స్, రెడ్ టో స్ట్రాప్‌లు ఉన్నాయి. కారు సి-పిల్లర్‌పై ప్రత్యేకంగా 1 of 30 అనే బ్యాజ్ ఉంటుంది, అంటే దేశంలో ఉన్న 30 కార్లలో ఇది ఒకటి అని అర్థం. వేరియంట్లను బట్టి ఇందులో 17-ఇంచ్, 18-ఇంచుల జేసీడబ్ల్యూ స్పెసిఫిక్ అల్లాయ్ వీల్స్ లభిస్తాయి.

ఈ చిన్న కారులో అమర్చిన ఇంజిన్ పవర్ చూస్తే ఎవరైనా ముక్కున వేలేసుకోవాల్సిందే. ఇందులో 2.0-లీటర్ ఫోర్-సిలిండర్ టర్బో-పెట్రోల్ ఇంజిన్‌ను ఉపయోగించారు. ఇది ఏకంగా 204 హార్స్‌పవర్ (hp) శక్తిని, 300 ఎన్ఎమ్ (Nm) టాప్ టార్క్‌ను జనరేట్ చేస్తుంది. ఈ పవర్‌ఫుల్ ఇంజిన్ 7-స్పీడ్ డ్యూయల్-క్లచ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో అనుసంధానించబడి ఉంటుంది.
మినీ ఇండియా అధికారిక లెక్కల ప్రకారం.. ఈ కారు జస్ట్ 6.6 సెకన్లలోనే 0 నుంచి 100 కిలోమీటర్ల రాకెట్ స్పీడ్‌ను అందుకుంటుంది. ఇక దీని టాప్ స్పీడు (Top Speed) గంటకు 242 కిలోమీటర్లుగా నమోదైంది. రోడ్డుపై వేగంగా దూసుకెళ్లడమే కాకుండా, కస్టమర్లకు వెల్‌కమ్ అండ్ గుడ్‌బై యానిమేషన్లతో కూడిన మూడు విభిన్న డీఆర్‌ఎల్ (DRL) మోడ్స్ కూడా ఇందులో ఉన్నాయి.

కారు లోపలి భాగం (ఇంటీరియర్) కూడా బ్లాక్ అండ్ రెడ్ కాంబినేషన్ స్పోర్టీ థీమ్‌తో అద్భుతంగా డిజైన్ చేయబడింది. ఇందులో ప్రీమియం వేసిన్ బ్లాక్ అప్‌హోల్‌స్టరీ, రెడ్ స్టిచింగ్‌తో కూడిన జేసీడబ్ల్యూ స్పోర్ట్స్ సీట్లను అమర్చారు. డ్యాష్‌బోర్డ్, ఫ్లోర్ మ్యాట్స్, డోర్ సిల్స్‌పై GP Inspired బ్రాండింగ్ స్పష్టంగా కనిపిస్తుంది. ఫీచర్ల విషయానికి వస్తే.. ఇందులో సెంటర్ అట్రాక్షన్‌గా 9.4-ఇంచుల రౌండ్ (గుండ్రని) ఆల్ఫాడ్ ఎల్‌ఈడీ (OLED) టచ్‌స్క్రీన్ ఇన్‌ఫోటైన్‌మెంట్ సిస్టమ్‌ను ఇచ్చారు.
దీనితో పాటు వైర్‌లెస్ ఆపిల్ కార్‌ప్లే, ఆండ్రాయిడ్ ఆటో, వైర్‌లెస్ చార్జింగ్, పనోరమిక్ గ్లాస్ సన్‌రూఫ్, వరల్డ్ క్లాస్ హర్మాన్ కార్డన్ ఆడియో సిస్టమ్, మెమరీ ఫంక్షన్‌తో కూడిన పవర్డ్ డ్రైవర్ సీట్, యాంబియంట్ లైటింగ్, లగ్జరీ హెడ్-అప్ డిస్‌ప్లే (HUD) వంటి ఫీచర్లు ఉన్నాయి. సేఫ్టీ కోసం ఇందులో లెవెల్-1 అదాస్ (ADAS), రియర్ వ్యూ కెమెరా, స్టెబిలిటీ కంట్రోల్, మల్టిపుల్ ఎయిర్‌బ్యాగ్‌లను అందించారు.


Click it and Unblock the Notifications