మిడిల్ క్లాస్ ఫ్యామిలీల సొంత కారు కల నెరవేరబోతుంది.. కేవలం రూ. 7 లక్షలకే మినీ స్కార్పియో

భారతదేశపు దిగ్గజ ఆటోమొబైల్ సంస్థ మహీంద్రా అండ్ మహీంద్రా అంటేనే మనకు గుర్తొచ్చేవి భారీ ఎస్‌యూవీలు. అందులోనూ స్కార్పియో (Scorpio) బ్రాండ్‌కు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అయితే, స్కార్పియో కారు కొనాలని చాలా మందికి కోరిక ఉన్నా, దాని భారీ సైజు, దాదాపు రూ. 20 లక్షలకు పైగా ఉండే ధర చూసి వెనకడుగు వేస్తుంటారు.

ఇలాంటి మిడిల్ క్లాస్ ఫ్యామిలీల కలను నిజం చేసేందుకు మహీంద్రా ఇప్పుడు ఒక అదిరిపోయే స్కెచ్ వేసింది. స్కార్పియో ఫ్యామిలీ నుంచి అతి తక్కువ ధరలో ఒక మినీ స్కార్పియోను (Mini Scorpio) తీసుకురాబోతోంది. దీనికి సంబంధించి విజన్ ఎస్ (Vision S) అనే కాన్సెప్ట్ కారును కూడా కంపెనీ సిద్ధం చేసింది.

Mini Scorpio Launch in India Price Features Vision S Concept Explained

ఈ కొత్త బేబీ స్కార్పియో గురించి ప్రస్తుతం ఆటోమొబైల్ మార్కెట్లో ఆసక్తికర చర్చ నడుస్తోంది. దీని రూపకల్పన కోసం మహీంద్రా సంస్థ సరికొత్త మోడ్యులర్ మోనోకోక్ (Modular Monocoque) ప్లాట్‌ఫారమ్‌ను ఉపయోగిస్తోంది. ఈ ప్లాట్‌ఫారమ్ ప్రత్యేకత ఏమిటంటే.. కారు చిన్నగా ఉన్నప్పటికీ లోపల సౌకర్యాలు, సేఫ్టీ విషయంలో రాజీ లేకుండా రూపొందించవచ్చు.

ఇది స్కార్పియో ఎన్ (Scorpio N) కంటే చిన్నదిగా ఉన్నప్పటికీ, రోడ్డు మీద వెళ్తుంటే దాని గంభీరమైన రూపాన్ని మాత్రం ఏమాత్రం కోల్పోదు. ముఖ్యంగా సిటీలో ట్రాఫిక్ మధ్య సులభంగా డ్రైవ్ చేయడానికి వీలుగా ఈ కారును డిజైన్ చేస్తున్నారు. డిజైన్ విషయానికి వస్తే.. ఈ కారు మహీంద్రా గ్లోబల్ పిక్-అప్, స్కార్పియో ఎన్ రెండింటి కలయికలా ఉండబోతోంది.

Mini Scorpio Launch in India Price Features Vision S Concept Explained

కారు ముందు భాగంలో పెద్ద గ్రిల్, దాని పక్కన వృత్తాకారంలో ఉండే (Circular) ఎల్‌ఈడీ డీఆర్ఎల్స్ (LED DRLs) ఉండబోతున్నాయి. వెనుక భాగంలో స్కార్పియో క్లాసిక్ తరహాలో నిటారుగా ఉండే పిల్లర్లు, టెయిల్ గేట్‌కు తగిలించిన స్పేర్ వీల్ (Stepney) దీనికి అచ్చమైన ఆఫ్‌రోడర్ లుక్‌ను ఇస్తాయి. భారీ వీల్ ఆర్చీలు, ఆకర్షణీయమైన అల్లాయ్ వీల్స్ ఈ చిన్న కారును ఒక మినీ మన్‌స్టర్‎లా మారుస్తాయి.

కారు లోపలి భాగం (Interior) కూడా చాలా స్మార్ట్‌గా ఉండబోతోంది. తక్కువ ధరకే లభిస్తున్నా, ఇందులో ప్రీమియం ఫీచర్లకు కొదవ ఉండదు. ముఖ్యంగా సెమీ డిజైన్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్, ఆపిల్ కార్ ప్లే, ఆండ్రాయిడ్ ఆటో సదుపాయం ఉన్న పెద్ద టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ ఇందులో ఉండనున్నాయి.

Mini Scorpio Launch in India Price Features Vision S Concept Explained

అంతేకాకుండా, మహీంద్రా కార్లలో మాత్రమే కనిపించే అడ్వాన్స్‌డ్ డ్రైవింగ్ మోడ్స్ కూడా ఇందులో ఇచ్చే అవకాశం ఉంది. స్కార్పియో ఎన్ లో ఉండే కొన్ని ముఖ్యమైన కంఫర్ట్ ఫీచర్లను కూడా ఈ మినీ వెర్షన్‌లో తీసుకువస్తున్నారు. ఇంజిన్ సామర్థ్యం విషయానికి వస్తే, ఇందులో 1.2 లీటర్ టర్బో పెట్రోల్, 1.5 లీటర్ డీజిల్ ఇంజిన్ ఆప్షన్లు ఉండే అవకాశం ఉంది.

మైలేజ్ ప్రియుల కోసం మాన్యువల్ గేర్‌బాక్స్‌తో పాటు, సౌకర్యవంతమైన ప్రయాణం కోసం ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఆప్షన్ కూడా మహీంద్రా అందించనుంది. రాబోయే కాలంలో దీనికి ఎలక్ట్రిక్ వెర్షన్‌ను కూడా లాంచ్ చేసే ఆలోచనలో కంపెనీ ఉంది. ధర విషయానికి వస్తే, ఇది మార్కెట్లో ఉన్న టాటా పంచ్, మారుతి ఫ్రాంక్స్ వంటి మైక్రో ఎస్‌యూవీలకు గట్టి పోటీ ఇవ్వనుంది. సుమారు రూ.7 లక్షల నుంచి రూ.11 లక్షల బడ్జెట్‌లో ఇది అందుబాటులోకి రావచ్చు.

Article Published On: Friday, February 20, 2026, 17:28 [IST]
English summary
Mini scorpio launch in india price features vision s concept explained
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+