అతి తక్కువ ధరకే మూడు పాపులర్ ఎలక్ట్రిక్ కార్లు.. ఈ సరికొత్త ప్లాన్‌తో భారీగా ధరలు తగ్గుదల!
పెట్రోల్ ధరలు నిరంతరం పెరుగుతున్న నేపథ్యంలో ఎలక్ట్రిక్ కార్లపై వినియోగదారుల ఆసక్తి గణనీయంగా పెరుగుతోంది. ఈ డిమాండ్‌ను దృష్టిలో పెట్టుకుని EV తయారీ సంస్థలు బ్యాటరీ-యాజ్-ఎ-సర్వీస్ (BaaS) వంటి వినూత్న పథకాలను అందుబాటులోకి తీసుకొస్తున్నాయి. ఈ విధానంలో వాహనం ధర నుంచి బ్యాటరీ ఖర్చును వేరు చేయడం వల్ల కారును తక్కువ ప్రారంభ ధరతో కొనుగోలు చేసే అవకాశం లభిస్తోంది. బ్యాటరీ కోసం ఒకేసారి భారీ మొత్తం చెల్లించాల్సిన అవసరం లేకుండా, వినియోగదారులు అవసరానికి అనుగుణంగా సేవను ఉపయోగించుకోవచ్చు. దీంతో EVల కొనుగోలు మరింత సులభం కావడంతో పాటు, ఖర్చు భారం కూడా తగ్గుతుంది. ఇప్పుడు ఈ కథణంలో ప్రస్తుతం మార్కెట్లో బాస్ స్కీమ్‌తో లభిస్తున్న 3 కార్లను ఒకసారి చూద్దాం.
ఎంజి విండ్సర్ ఈవీ: భారతీయ ఎలక్ట్రిక్ వాహనాల మార్కెట్లో వేగంగా ప్రాచుర్యం పొందిన మోడళ్లలో ఎంజి విండ్సర్ ఈవీ ఒకటి. ముఖ్యంగా బ్యాటరీ-యాజ్-ఎ-సర్వీస్ (BaaS) పథకం కింద ఈ వాహనాన్ని కేవలం రూ. 9.99 లక్షల (ఎక్స్-షోరూమ్) ప్రారంభ ధరకే కొనుగోలు చేసే అవకాశం కల్పించడం దీని ప్రధాన ప్రత్యేకత. బ్యాటరీ ఖర్చుతో కలిపి దీని సాధారణ ధర రూ. 14.09 లక్షలు (ఎక్స్-షోరూమ్)గా ఉంటుంది.

ఈ ఎలక్ట్రిక్ క్రాస్‌ఓవర్‌లో అమర్చిన బ్యాటరీ ప్యాక్ ఒక్కసారి పూర్తి ఛార్జ్ చేస్తే గరిష్టంగా 449 కిలోమీటర్ల వరకు డ్రైవింగ్ రేంజ్‌ను అందిస్తుంది. దీంతో నగర ప్రయాణాలతో పాటు దీర్ఘదూర ప్రయాణాలకు కూడా ఇది అనువైన ఎంపికగా నిలుస్తుంది. BaaS పథకం కింద వినియోగదారులు బ్యాటరీ కోసం ఒకేసారి భారీ మొత్తం చెల్లించాల్సిన అవసరం ఉండదు. బదులుగా, కిలోమీటరుకు రూ. 3.99 చొప్పున సబ్‌స్క్రిప్షన్ ఫీజు చెల్లిస్తూ వాహనాన్ని ఉపయోగించుకోవచ్చు.
టాటా టియాగో EV: ఎక్స్-షోరూమ్ ధర రూ. 6.99 లక్షలుగా ఉండగా, బ్యాటరీ-యాజ్-ఎ-సర్వీస్ (BaaS) పథకం కింద కేవలం రూ. 4.69 లక్షల ప్రారంభ ధరకే అందుబాటులో ఉంది. దీంతో బ్యాటరీ ఖర్చును ముందుగానే చెల్లించాల్సిన అవసరం లేకుండా తక్కువ పెట్టుబడితో ఎలక్ట్రిక్ కారు సొంతం చేసుకునే అవకాశం లభిస్తోంది. టియాగో EVలో 24 kWh సామర్థ్యం గల బ్యాటరీ ప్యాక్ 285 కిలోమీటర్ల వరకు రేంజ్ ఇస్తుంది.

అయితే వాస్తవ రోడ్డు పరిస్థితులు, డ్రైవింగ్ శైలి, ట్రాఫిక్ పరిస్థితులను బట్టి 205 నుంచి 215 కిలోమీటర్ల మధ్య రేంజ్ లభించే అవకాశం ఉంటుంది. పనితీరు పరంగా ఎలక్ట్రిక్ మోటార్ అందించే టార్క్ వల్ల ట్రాఫిక్‌లో సులభంగా డ్రైవ్ చేయవచ్చు. అలాగే ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఉండటం మరో ప్రధాన ప్రయోజనం. కేవలం 18 నిమిషాల ఫాస్ట్ ఛార్జింగ్‌తో దాదాపు 100 కిలోమీటర్ల వరకు ప్రయాణించడానికి అవసరమైన శక్తిని పొందగలదు.
MG కామెట్ EV: ఈ కారు సాధారణ ఎక్స్-షోరూమ్ ధర రూ. 7.62 లక్షల నుంచి ప్రారంభమవుతుంది. అయితే బ్యాటరీ-యాజ్-ఎ-సర్వీస్ (BaaS) పథకం ద్వారా దీని ప్రారంభ కొనుగోలు ధర కేవలం రూ. 4.99 లక్షలకు తగ్గుతుంది. దీంతో బ్యాటరీ ఖర్చును వేరుగా చెల్లిస్తూ తక్కువ పెట్టుబడితో ఎలక్ట్రిక్ కారు సొంతం చేసుకునే అవకాశం లభిస్తుంది. కిలోమీటరుకు రూ. 3.20 చొప్పున బ్యాటరీ సబ్‌స్క్రిప్షన్ రుసుము చెల్లించాల్సి ఉంటుంది.

MG కామెట్ EVలో 17.2 kWh సామర్థ్యం గల బ్యాటరీ ప్యాక్‌ను అందించారు. ఇది ఒక్కసారి పూర్తి ఛార్జ్ చేస్తే గరిష్టంగా 230 కిలోమీటర్ల వరకు డ్రైవింగ్ రేంజ్‌ను అందించగలదు. రోజువారీ నగర ప్రయాణాలు, ఆఫీస్ కమ్యూటింగ్, షాపింగ్ లేదా కుటుంబ అవసరాల కోసం ఈ రేంజ్ చాలావరకు సరిపోతుంది. తక్కువ ఖర్చుతో ఎక్కువ ప్రయోజనం కోరుకునే వినియోగదారులకు ఇది మంచి ఎంపికగా నిలుస్తుంది.


Click it and Unblock the Notifications