సీఎన్‌జీ ధరల మోత.. ముంబైలో మళ్లీ పెరిగిన రేట్లు! పెట్రోల్, హైబ్రిడ్ కార్ల కంటే ఇప్పటికీ బెస్ట్ ఆప్షన్ ఇదేనా?

ముంబైలో నవంబర్ 15 నుంచి సీఎన్‌జీ ధర మళ్లీ ప్రియమైంది. మహానగర్ గ్యాస్ లిమిటెడ్ (MGL) రిటైల్ ధరను కిలోకు ₹1.50 పెంచడంతో.. ముంబైతో పాటు ముంబై మెట్రోపాలిటన్ రీజియన్ (MMR) అంతటా సీఎన్‌జీ ధర ₹91.50కి చేరింది. 2026లో ఈ ధర పెరగడం ఇది ఎనిమిదోసారి కావడం గమనార్హం. ఈ ఒక్క నిర్ణయంతో రోజువారీ ప్రయాణికులు, ట్యాక్సీ డ్రైవర్లు, అలాగే పెట్రోల్, సీఎన్‌జీ, స్ట్రాంగ్-హైబ్రిడ్ కార్లలో ఏది బెస్ట్ అని ఆలోచిస్తున్న కొత్త కార్ల కొనుగోలుదారుల కిలోమీటర్ లెక్కలన్నీ మారిపోయాయి.

సీఎన్‌జీ ధర ₹91.50కి పెరిగినప్పటికీ.. ఆటోకార్ ఇండియా ప్లాట్‌ఫామ్ వేసిన వాగన్ ఆర్ సీఎన్‌జీ (23.39 కిమీ/కిలో మైలేజ్) లెక్కల ప్రకారం ముంబై సిటీ ట్రాఫిక్‌లో కిలోమీటర్‌కు దాదాపు ₹3.91 ఖర్చవుతుంది. ఇదే కేటగిరీకి చెందిన పెట్రోల్ హ్యాచ్‌బ్యాక్ (లీటరుకు 13.0 కిమీ మైలేజ్, పెట్రోల్ ధర ₹111.21) తో పోలిస్తే కిలోమీటర్‌కు ₹8.55 వరకు అవుతుంది. ఇక టయోటా హైరైడర్ లాంటి స్ట్రాంగ్-హైబ్రిడ్ కారు (20.28 కిమీ/లీ మైలేజ్) లో ప్రయాణిస్తే కిలోమీటర్‌కు దాదాపు ₹5.49 ఖర్చవుతుంది.

Mumbai CNG Price Hike 2026: Is CNG Still Cheaper Than Petrol and Hybrid Cars?

ముంబై సీఎన్‌జీ ధరలు: నవంబర్ 15 నుంచి మారిన లెక్కలు ఇవే

ఎంజీఎల్ (MGL) ఇటీవల చేసిన సవరణతో నవంబర్ 1న ₹90గా ఉన్న సీఎన్‌జీ కిలో ధర, నవంబర్ 15 నాటికి ₹91.50కి చేరింది. అంటే రాత్రికి రాత్రే కిలోకు ₹1.50 పెరగ్గా, గడిచిన 75 రోజుల్లో మొత్తం ₹5.50 పెరిగింది. దీంతో ఆటో, ట్యాక్సీ యూనియన్లు ఛార్జీలు పెంచాలని డిమాండ్ చేస్తున్నాయి. నెలకు 2,500 కిలోమీటర్లు తిరిగే క్యాబ్ డ్రైవర్‌కు తాజాగా పెరిగిన ధరల వల్ల ప్రతినెల ₹160 అదనపు భారం పడనుంది. అదే ఈ 75 రోజుల్లో పెరిగిన మొత్తం ధర ఆధారంగా చూస్తే నెలవారీ ఖర్చు దాదాపు ₹588 పెరిగినట్లయింది.

పెట్రోల్, హైబ్రిడ్లతో పోలిస్తే.. కిలోమీటర్‌కు ఎంత ఖర్చవుతుందో తెలుసా?

ముంబైలో ఇంధనం సిటీ మైలేజ్ (అంచనా) యూనిట్ ధర ఖర్చు/కిమీ
సీఎన్‌జీ 23.39 కిమీ/కిలో (వాగన్ ఆర్ సీఎన్‌జీ, టెస్టింగ్) ₹91.50/కిలో ₹3.91
పెట్రోల్ 13.0 కిమీ/లీ (సిటీ హ్యాచ్‌బ్యాక్) ₹111.21/లీటరు ₹8.55
స్ట్రాంగ్‑హైబ్రిడ్ 20.28 కిమీ/లీ (హైరైడర్ సిటీ) ₹111.21/లీటరు ₹5.49

ఈ గణాంకాలన్నీ నవంబర్ నాటి అధికారిక ఇంధన ధరలు, ఆటోకార్ రియల్-వరల్డ్ మైలేజ్ నివేదికల ఆధారంగా రూపొందించినవి. గ్యాస్ ధరలు పెరిగినప్పటికీ, పెట్రోల్-హైబ్రిడ్లతో పోలిస్తే కిలోమీటర్ రన్నింగ్ కాస్ట్ విషయంలో సీఎన్‌జీనే ఇప్పటికీ బెస్ట్ అని ఈ లెక్కలు చెబుతున్నాయి.

వివిధ నగరాల్లో సీఎన్‌జీ ధరలు: ఢిల్లీ-ఎన్‌సీఆర్, అహ్మదాబాద్/సూరత్, పుణే/ఠాణే

నగరం నిర్వాహక సంస్థ ధర అమల్లోకి వచ్చిన తేదీ
ముంబై/ఠాణే MGL ₹91.50/కిలో నవంబర్ 15, 2026
ఢిల్లీ‑ఎన్‌సీఆర్ IGL ₹86.98/కిలో ఆగస్టు 29, 2026
పుణే MNGL ₹99.00/కిలో నవంబర్ 13, 2026
అహ్మదాబాద్ అదానీ టోటల్ గ్యాస్ ₹100.77/కిలో నవంబర్ 5, 2026
సూరత్ గుజరాత్ గ్యాస్ ₹88.76/కిలో నవంబర్ 15, 2026

సరఫరా చేసే కంపెనీని బట్టి నగరాల మధ్య ఈ ధరల్లో వ్యత్యాసం ఉంటుంది. కాబట్టి దూరప్రాంతాలకు వెళ్లేముందు మీ నగరంలోని యాప్ లేదా గ్యాస్ స్టేషన్‌లోని బోర్డుపై ధరలు ఒకసారి చెక్ చేసుకోవడం మంచిది.

₹12 లక్షల బడ్జెట్‌లో లభించే అత్యుత్తమ సీఎన్‌జీ కార్లు ఇవే!

₹10 లక్షల లోపు బడ్జెట్ ఉన్నవారికి మారుతి వాగన్ ఆర్ సీఎన్‌జీ బెస్ట్ మైలేజ్ ఆప్షన్‌గా నిలుస్తోంది. అదే సమయంలో హ్యుందాయ్ గ్రాండ్ i10 నియోస్ సీఎన్‌జీలో ఆరు ఎయిర్‌బ్యాగ్‌లతో పాటు షోరూమ్‌లలో దాదాపు ₹68,000 వరకు ప్రయోజనాలు లభిస్తున్నాయి. ఇక ₹10 లక్షల నుంచి ₹12 లక్షల బడ్జెట్ సెగ్మెంట్‌లో మారుతి ఫ్రాంక్స్ S‑CNG, హ్యుందాయ్ ఎక్స్‌టర్ సీఎన్‌జీ కార్లు మంచి స్పేస్, గ్రౌండ్ క్లియరెన్స్‌ను అందిస్తున్నాయి. ప్రముఖ మెట్రో నగరాల్లో డిమాండ్ ఉన్న ఈ మోడళ్లకు 2 నుంచి 6 వారాల వెయిటింగ్ పీరియడ్ ఉంది.

బయ్యర్స్ గైడ్: సీఎన్‌జీ కారు తీసుకోవడం ఇప్పటికీ లాభదాయకమేనా?

ఫ్యాక్టరీ ఫిట్టెడ్ సీఎన్‌జీ హ్యాచ్‌బ్యాక్ కారు ధర, సాధారణ పెట్రోల్ వేరియంట్ కంటే దాదాపు ₹95,000 ఎక్కువగా ఉంటుంది. ముంబైలో ప్రస్తుత ధరల ప్రకారం చూస్తే పెట్రోల్‌తో పోలిస్తే కిలోమీటర్‌కు దాదాపు ₹4.6 ఆదా అవుతుంది. అంటే మీరు దాదాపు 20,000 కిలోమీటర్లు తిరిగితే కారుపై పెట్టిన అదనపు పెట్టుబడి రికవర్ (బ్రేక్ ఈవెన్) అవుతుంది. నెలకు 1,100 కిలోమీటర్ల చొప్పున వాడితే సుమారు 18 నెలల్లోనే ఈ అమౌంట్ రికవర్ అవుతుంది. అయితే డిక్కీ స్పేస్ తగ్గడం, రీఫిల్లింగ్ కోసం క్యూలైన్లలో వేచి ఉండటం వంటి విషయాలను కూడా గుర్తుంచుకోవాలి. బడ్జెట్ ఎక్కువగా ఉంటే సిటీ డ్రైవింగ్ కోసం స్ట్రాంగ్-హైబ్రిడ్ కారు మంచి ఆప్షనే అయినప్పటికీ.. సీఎన్‌జీతో పోలిస్తే కిలోమీటర్ రన్నింగ్ కాస్ట్ కాస్త ఎక్కువగానే ఉంటుంది.

Article Published On: Monday, November 16, 2026, 9:34 [IST]
Read more on: #astrology
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+