పాత బంగారానికి కొత్త మెరుపు.. ఒక్కసారి చూస్తే కొనాలనిపిస్తుంది! ధర, ఫీచర్లు, ఇంజిన్ పూర్తి డీటైల్స్

భారతీయ రోడ్లపై ప్రీమియం లుక్, స్టైలిష్ డిజైన్‌తో ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్ స్కోడా కుషాక్ (Skoda Kushaq) ఇప్పుడు మరింత కొత్త అవతారంలో అభిమానులను ఆకట్టుకోవడానికి తిరిగి వచ్చింది. మిడ్-సైజ్ SUV సెగ్మెంట్‌లో తన స్థానం బలపరుచుకోవాలని లక్ష్యంగా పెట్టుకున్న ఈ మోడల్, తాజా ఫేస్‌లిఫ్ట్ రూపంలో మార్చి 21, 2026న అట్టహాసంగా విడుదలై మరోసారి మార్కెట్లో చర్చనీయాంశంగా మారింది. ఈ కొత్త వెర్షన్‌లో డిజైన్ నుంచి ఫీచర్ల వరకు ఎన్నో మార్పులు తీసుకువచ్చినట్లు తెలుస్తోంది. బయటికి మరింత బోల్డ్ లుక్, అగ్రెసివ్ ఫ్రంట్ గ్రిల్, ఆకట్టుకునే LED లైటింగ్ కలిపి స్కోడా కుషాక్‌ను రోడ్లపై మరింత ఆకర్షణీయంగా నిలబెడుతున్నాయి. లోపల కూడా ప్రీమియం ఫినిష్, అధునాతన టెక్నాలజీ ఫీచర్లు, సౌకర్యవంతమైన సీటింగ్ డ్రైవింగ్ అనుభవాన్ని మరో స్థాయికి తీసుకెళ్తున్నాయి. దీని గురించి ఈ కథణంలో.

ధర: కొత్తగా వచ్చిన కుషాక్ ఫేస్‌లిఫ్ట్ ధరల విషయంలో మార్కెట్లో సంచలనం సృష్టిస్తోంది. కంపెనీ ఈ మోడల్ బేస్ వేరియంట్‌ను కేవలం రూ.10.69 లక్షలు (ఎక్స్-షోరూమ్)గా నిర్ణయించడం పెద్ద హైలైట్‌గా మారింది. అయితే ఇది కేవలం బడ్జెట్ ఫ్రెండ్లీ ఆప్షన్ మాత్రమే కాదు. టాప్-ఎండ్ వేరియంట్ ధర రూ.18.99 లక్షల వరకు ఉండటం వల్ల, ప్రీమియం ఫీచర్లు కోరుకునే కస్టమర్లను కూడా ఇది లక్ష్యంగా పెట్టుకుంది.

New 2026 Skoda Kushaq Facelift Price Design Engine And All Top Things Details

డిజైన్: ఎక్స్‌టీరియర్ డిజైన్ పరంగా చూస్తే, కొత్తగా వచ్చిన స్కోడా కుషాక్ ఫేస్‌లిఫ్ట్ మరింత బోల్డ్‌గా, అగ్రెసివ్‌గా కనిపించేలా తయారైంది. ముందుభాగంలో కొత్త గ్రిల్, రీడిజైన్ చేసిన బంపర్లు, అలాగే సరికొత్త LED హెడ్‌లాంప్స్ కలిపి ఈ కారుకు ఒక స్పోర్టీ, ప్రీమియం లుక్‌ను ఇస్తున్నాయి. రోడ్డుపై వెళ్లేటప్పుడు ఈ SUV ప్రత్యేకంగా కనిపించేలా డిజైన్‌లో మార్పులు తీసుకువచ్చారు.

రాత్రి సమయంలో ఈ కారు మరింత ఆకర్షణీయంగా కనిపించడానికి సీక్వెన్షియల్ టర్న్ ఇండికేటర్లు, కనెక్టెడ్ టెయిల్ లైట్లు ముఖ్య పాత్ర పోషిస్తున్నాయి. ఇవి కేవలం లుక్ కోసం మాత్రమే కాకుండా, విజిబిలిటీని మెరుగుపరుస్తాయి. అలాగే 17 ఇంచుల డైమండ్ కట్ అల్లాయ్ వీల్స్ మంచి గ్రౌండ్ క్లియరెన్స్‌తో పాటు రాజసంగా కనిపించే స్టాన్స్‌ను ఇస్తున్నాయి. ఇది క్లాసిక్ ప్లస్, సిగ్నేచర్, స్పోర్ట్‌లైన్, ప్రెస్టీజ్, మాన్టే కార్లో ఐదు వేరియంట్లలో లభిస్తుంది.

New 2026 Skoda Kushaq Facelift Price Design Engine And All Top Things Details

పనితీరు: దీని పనితీరు విషయంలో కంపెనీ ఎలాంటి రాజీ పడలేదు. మొదటి ఇంజిన్ 1.0 లీటర్ TSI టర్బో పెట్రోల్ 115 PS పవర్, 178 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. నగర ప్రయాణాలకు ఇది సరిపడే ఇంజిన్‌గా చెప్పుకోవచ్చు. స్మూత్ డ్రైవింగ్ అనుభవం ఇవ్వడంలో ఇది మంచి పనితీరును చూపిస్తుంది. దీనికి 6-స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్‌తో పాటు, కొత్తగా 8-స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఆప్షన్ ఇవ్వడం ప్రత్యేకంగా చెప్పుకోవాలి.

ఇక మరింత పవర్, స్పోర్టీ డ్రైవింగ్ కోరుకునే వారికి 1.5 లీటర్ TSI టర్బో పెట్రోల్ ఇంజిన్ అందుబాటులో ఉంది. ఇది గరిష్టంగా 150 PS పవర్, 250 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజిన్‌తో కారు నడిపితే, ముఖ్యంగా హైవేలపై, రేసింగ్ కార్‌ను డ్రైవ్ చేస్తున్న అనుభూతి కలుగుతుంది. దీనికి 7-స్పీడ్ DSG ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఇవ్వడం వల్ల గేర్ మార్పులు చాలా వేగంగా, స్మూత్‌గా జరుగుతాయి.

New 2026 Skoda Kushaq Facelift Price Design Engine And All Top Things Details

ఫీచర్స్: కారు లోపల 10.1 ఇంచుల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, AI అసిస్టెంట్‌తో వాయిస్ ద్వారా ఫీచర్లను కంట్రోల్ చేసే అవకాశం ఇస్తుంది. 10.25 ఇంచుల డిజిటల్ క్లస్టర్, పనోరమిక్ సన్‌రూఫ్, యాంబియంట్ లైటింగ్, వెనుక సీట్లకు మసాజ్ ఫీచర్ ఉండటం ఈ సెగ్మెంట్‌లో ప్రత్యేకం. భద్రత విషయంలో 6 ఎయిర్‌బ్యాగ్స్, ESC, నాలుగు డిస్క్ బ్రేకులు, TPMS ఫీచర్లతో పాటు ఆటో హెడ్‌లైట్స్, రియర్ వ్యూ కెమెరా ఉన్నాయి.

More from DriveSpark

Article Published On: Sunday, March 22, 2026, 17:01 [IST]
English summary
New 2026 skoda kushaq facelift price design engine and all top things details
Read more on: #skoda #india
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+