మార్కెట్లోకి హ్యుందాయ్ కొత్త i20.. చూశారంటే చూపుతిప్పుకోలేరంతే.. వెంటనే కొనేస్తారు
గ్లోబల్ ఆటోమొబైల్ మార్కెట్లో హ్యుందాయ్ మోటార్స్ తన సరికొత్త ఫోర్త్-జనరేషన్ (నాల్గవ తరం) i20 స్మార్ట్ కారును బ్రెజిల్ దేశంలో అధికారికంగా లాంచ్ చేసింది. కంపెనీ దీనిని అత్యంత అధునాతనమైన కే3 (K3) మాడ్యులర్ ప్లాట్‌ఫారమ్‌పై రూపొందించింది. ఈ సరికొత్త మోడల్‌ను పూర్తిగా కొత్త డిజైన్, లగ్జరీ ఇంటీరియర్, డ్యూయల్ స్క్రీన్లు, అధునాతన ఏడీఏఎస్ (ADAS) సేఫ్టీ ఫీచర్లతో మార్కెట్లోకి తీసుకొచ్చారు. బ్రెజిల్ మార్కెట్లో దీని ప్రారంభ ధర బిఆర్ఎల్ 99,990 (మన భారత కరెన్సీలో సుమారు రూ.18.77 లక్షలు)గా నిర్ణయించారు. అక్కడి మార్కెట్లో ఇది హెచ్‌బి20, క్రెటా మోడళ్ల మధ్య స్థానాన్ని భర్తీ చేయనుంది.
ఆకట్టుకునే బాహ్య డిజైన్, లుక్స్
కొత్త తరం హ్యుందాయ్ i20 డిజైన్ పరంగా చాలా షార్ప్‌గా, స్పోర్టీగా కనిపిస్తోంది. ఈ కారు 4,130 మిమీ పొడవు, 1,780 మిమీ వెడల్పు, 2,580 మిమీ బేస్ వీల్‌ను కలిగి ఉంది. కారు ముందు భాగంలో ఆకర్షణీయమైన హెచ్-స్టైల్ ఎల్‌ఈడీ డీఆర్‌ఎల్‌లు, వెడల్పైన లైట్ బార్, దీర్ఘచతురస్రాకార హెడ్‌ల్యాంప్‌లను అమర్చారు. దీని హెక్సాగోనల్ గ్రిల్ మునుపటి కంటే చాలా పదునైన అంచులతో కొత్త లుక్‌ను ఇస్తుంది. కారు వైపులా చూస్తే 17-ఇంచుల డైమండ్-కట్ అలాయ్ వీల్స్, వెనుక భాగంలో ఒకదానికొకటి కనెక్ట్ అయి ఉండే స్టైలిష్ టెయిల్ ల్యాంప్స్ కారు అందాన్ని రెట్టింపు చేస్తున్నాయి.

అంతరిక్ష నౌకలాంటి లగ్జరీ ఇంటీరియర్
కారు లోపలి భాగంలో (Cabin) అడుగుపెడితే ఏదో ఫ్యూచరిస్టిక్ లగ్జరీ కారులో కూర్చున్న అనుభూతి కలుగుతుంది. ఇందులో ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ కోసం ఏకంగా రెండు 12.3-ఇంచుల పెద్ద స్క్రీన్లను పక్కపక్కనే అమర్చారు. కారులో వేగవంతమైన కనెక్టివిటీ కోసం ఇన్‌బిల్ట్ 5G చిప్‌ను అందించారు.
దీని సహాయంతో బ్రెజిల్‌లో మొదటిసారిగా హ్యుందాయ్ కారుకు ఓటీఏ (OTA) సాఫ్ట్‌వేర్ అప్‌డేట్స్ సదుపాయాన్ని కల్పించారు. స్టీరింగ్ వీల్‌పై హ్యుందాయ్ ప్రత్యేక క్వాడ్ డాట్ లోగోతో పాటు ప్యాడల్ షిఫ్టర్లు, బ్లూలింక్ కనెక్టివిటీ, వైర్‌లెస్ ఫోన్ ఛార్జర్, ఎలక్ట్రానిక్ పార్కింగ్ బ్రేక్ వంటి ఎన్నో అదిరిపోయే ఫీచర్లు ఉన్నాయి. ఈ కారు డిజైన్ పరంగా ఎక్కువ బూట్ స్పేస్ (346 లీటర్లు) కలిగి ఉండటం విశేషం.

నెక్స్ట్ లెవెల్ ఏడీఏఎస్ సేఫ్టీ
సేఫ్టీ విషయంలో హ్యుందాయ్ ఈ కారులో ఎలాంటి రాజీ పడలేదు. ఇందులో హ్యుందాయ్ స్మార్ట్‌సెన్స్ (Hyundai SmartSense) పేరిట పూర్తి ఏడీఏఎస్ ప్యాకేజీని అందించారు. దీని ద్వారా బ్లైండ్ స్పాట్ కొలిజన్ అసిస్ట్, ఫార్వర్డ్ కొలిజన్ అసిస్ట్, లేన్ కీపింగ్ అసిస్ట్, ఇంటెలిజెంట్ స్పీడ్ లిమిట్ అసిస్ట్ వంటి ఎన్నో అడ్వాన్స్‌డ్ ఫీచర్లు డ్రైవర్‌ను అలర్ట్ చేస్తూ ప్రమాదాల నుంచి కాపాడతాయి.
ఇవి కాకుండా కారులో 6 ఎయిర్‌బ్యాగ్‌లు, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్, హిల్ స్టార్ట్ అసిస్ట్, టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్‌ను అన్ని వేరియంట్లలో స్టాండర్డ్‌గా ఇచ్చారు. కొత్త కే3 ఆర్కిటెక్చర్ వల్ల కారు బాడీ చాలా బలంగా ఉండి, క్రాష్ ప్రొటెక్షన్‌లో అద్భుతంగా పనిచేస్తుంది.

పవర్‌ఫుల్ ఇంజిన్, ధరల వివరాలు
బ్రెజిల్ వేరియంట్ న్యూ i20 కారులో 1.0-లీటర్ టీజీడీఐ (TGDI) ఫ్లెక్స్ త్రీ-సిలిండర్ డైరెక్ట్ ఇంజెక్షన్ ఇంజిన్‌ను ఉపయోగించారు. ఇది 115 హార్స్ పవర్, 172 ఎన్ఎమ్ టాప్ టార్క్‌ను ప్రొడ్యూస్ చేస్తుంది. ఇందులో 6-స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్ స్టాండర్డ్‌గా వస్తుంది. అయితే దీని లిమిటెడ్ వేరియంట్‌లో 6-స్పీడ్ మాన్యువల్ ఆప్షన్ కూడా కస్టమర్లకు అందుబాటులో ఉంది.
ఈ కారు గరిష్టంగా గంటకు 184 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించగలదు. కేవలం 11.7 సెకన్లలోనే 0 నుంచి 100 కిమీ స్పీడ్‌ను అందుకుంటుంది. అక్కడ మొత్తం ఆరు వేరియంట్లలో లభించే ఈ కారు ధరలు కంఫర్ట్ వేరియంట్ రూ.18.77 లక్షల నుంచి ప్రారంభమై, టాప్-ఎండ్ అల్టిమేట్ వేరియంట్ ధర రూ. 26.29 లక్షల వరకు ఉంది.


Click it and Unblock the Notifications