ఒకదానిని మించి మరొకటి..SUVలకు పోటీగా త్వరలో మార్కెట్లోకి ఎంట్రీ ఇవ్వనున్న కొత్త సెడాన్, హ్యాచ్‌బ్యాక్ కార్స్
ప్రస్తుతం భారత ఆటోమొబైల్ మార్కెట్లో ఎస్ఈవీ (SUV) కార్లకు భారీ డిమాండ్ ఉన్నప్పటికీ హ్యాచ్‌బ్యాక్, సెడాన్ కార్లను ఇష్టపడే వారి సంఖ్య ఏమాత్రం తగ్గలేదు. ఎస్ఈవీలు నచ్చని వారి కోసం, తక్కువ బడ్జెట్‌లో లగ్జరీ రైడింగ్ ఎక్స్‌పీరియన్స్ కోరుకునే వారి కోసం భారత మార్కెట్లోకి త్వరలోనే పలు సరికొత్త కార్లు లాంచ్ కాబోతున్నాయి. ఈ లిస్ట్‌లో హ్యుందాయ్ ఐ20 కొత్త జనరేషన్ మోడల్‌తో పాటు మారుతి సుజుకి బలెనో, టాటా టిగోర్, స్కోడా స్లావియా, ఫోక్స్‌వ్యాగన్ వర్టస్ వంటి పాపులర్ కార్ల ఫేస్‌లిఫ్ట్ వెర్షన్లు ఉన్నాయి.
టాటా టిగోర్ ఫేస్‌లిఫ్ట్ (Tata Tigor Facelift)
ప్రముఖ దేశీయ కార్ల తయారీ సంస్థ టాటా మోటార్స్ తన పాపులర్ సెడాన్ కారు టిగోర్ కొత్త డిజైన్‌ను ఇటీవలే పేటెంట్ చేయించుకుంది. లీకైన చిత్రాల ప్రకారం.. ఈ కొత్త టిగోర్ ఫ్రంట్ లుక్ టాటా టియాగో కారును పోలి ఉంటుంది. ఇందులో సరికొత్త ఎల్‌ఈడీ హెడ్‌లైట్లు, క్లోజ్డ్ గ్రిల్, కొత్త డిజైన్ బంపర్ ఉండబోతున్నాయి.

కారు వెనుక భాగంలో కనెక్టెడ్ బ్లాక్ ట్రిమ్‌తో కూడిన సరికొత్త ఎల్‌ఈడీ టెయిల్ లైట్లు, కొత్త అల్లాయ్ వీల్స్ లభిస్తాయి. కారు లోపల 10.25-ఇంచుల పెద్ద టచ్‌స్క్రీన్, డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, డ్యూయల్ వైర్‌లెస్ ఛార్జర్, 360-డిగ్రీ కెమెరా వంటి ప్రీమియం ఫీచర్లు ఉండనున్నాయి. ఇంజిన్ పరంగా ఇందులో ఎలాంటి మార్పులు లేకుండా పాత 1.2-లీటర్ పెట్రోల్ మరియు సీఎన్‌జీ ఆప్షన్లతోనే ఈ ఏడాది చివర్లో మార్కెట్లోకి రానుంది.
స్కోడా స్లావియా ఫేస్‌లిఫ్ట్ (Skoda Slavia Facelift)
స్కోడా కంపెనీ తన పాపులర్ సెడాన్ కారు స్లావియా ఫేస్‌లిఫ్ట్ వెర్షన్‌ను ఈ ఏడాది ఆగస్టులోనే లాంచ్ చేయడానికి సిద్ధం చేసింది. దీని ఎక్స్‌టీరియర్‌లో సరికొత్త ఎల్ईడీ డీఆర్‌ఎల్స్, స్లీకర్ హెడ్‌లైట్లు, కొత్త బంపర్, వెనుక వైపు కనెక్టెడ్ లైట్ బార్, వెలిగే స్కోడా బ్యాజింగ్ వంటి భారీ మార్పులు చేశారు.
ఈ కారు లోపల 10.25-ఇంచుల డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్‌తో పాటు, వెనుక సీట్లలో కూర్చునే వారికి అదనపు కంఫర్ట్ కోసం మసాజ్ సీట్స్, యాంబియంట్ లైటింగ్ వంటి లగ్జరీ ఫీచర్లను ఇస్తున్నారు. ఇంజిన్ ఆప్షన్ల విషయానికి వస్తే, 1.0-లీటర్ TSI ఇంజిన్‌తో పాటు సరికొత్త 8-స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఆప్షన్ రాబోతోంది. అలాగే 1.5-లీటర్ TSI ఇంజిన్ వేరియంట్ ఇప్పుడు కేవలం 7-స్పీడ్ DSG గేర్‌బాక్స్‌తో మాత్రమే లభిస్తుంది.

ఫోక్స్‌వ్యాగన్ వర్టస్ ఫేస్‌లిఫ్ట్ (VW Virtus Facelift)
జర్మన్ కార్ బ్రాండ్ ఫోక్స్‌వ్యాగన్ కూడా భారత మార్కెట్లో మంచి సక్సెస్ సాధించిన తన వర్టస్ సెడాన్ కారుకు ఫేస్‌లిఫ్ట్ అప్‌డేట్ ఇవ్వబోతోంది. ఈ కొత్త మోడల్‌లో రీడిజైన్ చేసిన సరికొత్త ఎల్‌ఈడీ హెడ్‌లైట్లు, వెలిగే ఫాక్స్‌వ్యాగన్ లోగోతో కూడిన సరికొత్త ఫ్రంట్ గ్రిల్, కనెక్టెడ్ ఎల్‌ఈడీ డీఆర్‌ఎల్స్, కొత్త డిజైన్ అల్లాయ్ వీల్స్, కొత్త రియర్ బంపర్ ఉండబోతున్నాయి. కారు లోపల పెద్ద డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, అప్‌డేటెడ్ యాంబియంట్ లైటింగ్ వంటి అధునాతన ఫీచర్లు అందుబాటులోకి రానున్నాయి. అయితే దీని ఇంజిన్, పవర్‌ట్రెయిన్ ఆప్షన్లలో కంపెనీ ఎలాంటి మార్పులు చేయడం లేదు.
న్యూ జనరేషన్ హ్యుందాయ్ ఐ20 (New Hyundai i20)
హ్యుందాయ్ కంపెనీ ఇప్పటికే అంతర్జాతీయ మార్కెట్లో లాంచ్ చేసిన తన 4th జనరేషన్ ఐ20 (i20) హ్యాచ్‌బ్యాక్ కారును ఈ ఏడాది చివర్లో భారత్‌లోకి తీసుకురావడానికి ప్లాన్ చేస్తోంది. ఈ కొత్త కారు డిజైన్ మునుపటి కంటే చాలా బోల్డ్‌గా, ఒక క్రాస్ఓవర్ కారు లుక్‌తో ఉండబోతోంది. ఇందులో Y-షేప్ కనెక్టెడ్ ఎల్‌ఈడీ డీఆర్‌ఎల్స్, 17-ఇంచుల భారీ అల్లాయ్ వీల్స్, సి-షేప్ ఎల్‌ఈడీ టెయిల్ ల్యాంప్స్ ఇవ్వనున్నారు.

హ్యుందాయ్ కొత్త K3 ప్లాట్‌ఫారమ్‌పై తయారవుతున్న ఈ కారు లోపల డ్యూయల్ 10.25-ఇంచుల డిస్‌ప్లే డాష్‌బోర్డ్, సెమీ-లెదరెట్ సీట్లు, అల్ట్రా సేఫ్టీని ఇచ్చే లెవెల్ 2 ADAS (అడ్వాన్స్‌డ్ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్) వంటి ఫీచర్లు ఉండనున్నాయి. ఇందులో 1.2-లీటర్ పెట్రోల్, 1.0-లీటర్ టర్బో-పెట్రోల్ ఇంజిన్లతో పాటు భారత్ కోసం ఒక స్ట్రాంగ్-హైబ్రిడ్ వెర్షన్‌ను కూడా లాంచ్ చేసే అవకాశం ఉంది.
మారుతి సుజుకి బలెనో ఫేస్‌లిఫ్ట్ (Maruti Suzuki Baleno Facelift)
భారతదేశంలో అత్యధికంగా అమ్ముడవుతున్న హ్యాచ్‌బ్యాక్ కార్లలో ఒకటైన మారుతి బలెనో కూడా సరికొత్త మిడ్-లైఫ్ అప్‌డేట్‌తో రాబోతోంది. దీనికి సంబంధించిన రోడ్ టెస్టింగ్ ఇప్పటికే ప్రారంభమైంది. కొత్త బలెనోలో డిజిటల్-ఫర్స్ట్ కేబిన్, సేఫ్టీ ఫీచర్లపై మారుతి ప్రత్యేకంగా ఫోకస్ పెట్టింది. దీని ఫ్రంట్ లుక్‌లో కొత్త గ్రిల్, అప్‌డేటెడ్ ఎల్‌ఈడీ డీఆర్‌ఎల్స్, కొత్త బంపర్, సరికొత్త అల్లాయ్ వీల్స్ కనిపించనున్నాయి.
వినియోగదారుల కోరిక మేరకు ఈసారి బలెనోలో సింగిల్-ప్యానెల్ సన్‌రూఫ్ ఫీచర్‌ను కూడా అందించబోతున్నట్లు సమాచారం. వీటితో పాటు 360-డిగ్రీ కెమెరా, పెద్ద టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్, పవర్డ్ డ్రైవర్ సీట్ వంటి ఫీచర్లు యాడ్ కానున్నాయి. ఇందులో పాత 1.2-లీటర్ డ్యూయల్‌జెట్ ఇంజిన్‌తో పాటు, కొత్త స్విఫ్ట్ కారులో వాడుతున్న పవర్‌ఫుల్ 1.2-లీటర్ 3-సిలిండర్ పెట్రోల్ ఇంజిన్‌ను కూడా ఆఫర్ చేసే ఛాన్స్ ఉంది.


Click it and Unblock the Notifications