మిడిల్‌క్లాస్ కోసం పుట్టిన కారు.. కేవలం రూ.11 వేలు చాలు.. రూ.5.79 లక్షల కారును బుక్ చేసుకోండి
హ్యూందాయ్ ఎక్స్‌టర్ (Hyundai Exter) కొత్త అవతారంలో మరింత స్టైలిష్‌గా, బోల్డ్‌గా ఫేస్‌లిఫ్ట్‌గా భారత మార్కెట్లో అడుగుపెట్టింది. కాంపాక్ట్ SUV సెగ్మెంట్‌లో ఇప్పటికే మంచి పేరు సంపాదించుకున్న ఈ మోడల్, ఇప్పుడు కొత్త డిజైన్ అప్‌డేట్స్‌తో మరింత ఆకర్షణీయంగా మారింది. కస్టమర్లతో పాటు ఆటో ఎక్స్‌పర్ట్స్ నుంచి కూడా ప్రశంసలు పొందిన ఈ ఎక్స్‌టర్, తన రిఫైన్డ్ పనితీరు, నమ్మకమైన పవర్‌ట్రెయిన్, మల్టీ-పర్పస్ వినియోగంతో ప్రత్యేక గుర్తింపు పొందింది. పాత దానితో పోలిస్తే ఈ కొత్త వెర్షన్‌లో బోల్డ్ SUV లుక్‌తో పాటు ఆధునిక టెక్నాలజీ, కంఫర్ట్ ఫీచర్లు, మెరుగైన భద్రత కలిపి ఒక పూర్తి ప్యాకేజ్‌గా రూపొందించారు. డిజైన్ పరంగా చూస్తే, కొత్త ఎక్స్‌టర్ రోడ్డు మీద మరింత స్ట్రాంగ్ ప్రెజెన్స్‌ను చూపిస్తుంది.
ముందు, వెనుక భాగాల్లో కొత్త బంపర్ డిజైన్, రీడిజైన్ చేసిన బ్లాక్ రేడియేటర్ గ్రిల్, అలాగే కొత్తగా జోడించిన R15 డైమండ్ కట్ అల్లాయ్ వీల్స్ కారుకు స్పోర్టీ లుక్‌ను ఇస్తాయి. వీటికి తోడు వింగ్-టైప్ స్పాయిలర్ కారును మరింత యూత్‌ఫుల్‌గా మార్చింది. సైజు పరంగా కూడా ఈ SUV తన సెగ్మెంట్‌లో ఎత్తైన మోడల్‌గా నిలుస్తూ, పొడవైన వీల్‌బేస్‌తో ప్రయాణికులకు మెరుగైన హెడ్‌రూమ్, కంఫర్ట్‌ను అందిస్తుంది.

కొత్త టెయిల్‌గేట్, C-పిల్లర్ గార్నిష్ వంటి మార్పులు వెనుక భాగాన్ని మరింత స్టైలిష్‌గా మార్చగా, వీల్ ఆర్చ్ క్లాడింగ్ కారుకు మస్క్యులర్ ఫీల్‌ను ఇస్తుంది. లోపలికి అడుగుపెడితే, క్యాబిన్ మరింత ప్రీమియంగా, ప్రాక్టికల్‌గా అనిపిస్తుంది. నేవీ, గ్రే రంగుల డ్యూయల్-టోన్ ఇంటీరియర్ థీమ్, 3D కార్బన్ ప్యాటర్న్ డ్యాష్‌బోర్డ్, స్పోర్టీ D-కట్ స్టీరింగ్ వీల్ కలిసి క్యాబిన్‌కు మోడర్న్ టచ్‌ను ఇస్తాయి.
డ్రైవర్‌కు మరింత కంట్రోల్ ఫీల్ ఇవ్వడానికి మెటల్ పెడల్స్‌ను కూడా ఈ మోడల్‌లో తొలిసారిగా అందించారు. అంతేకాదు, డ్రైవర్ సీటు హైట్ అడ్జస్ట్మెంట్, అడ్జస్టబుల్ రియర్ హెడ్‌రెస్ట్స్ వంటి సౌకర్యాలు అన్ని వేరియంట్లలో స్టాండర్డ్‌గా ఇవ్వడం వల్ల డ్రైవర్, ప్రయాణికులిద్దరికీ మెరుగైన కంఫర్ట్ లభిస్తుంది. 391 లీటర్ల బూట్ స్పేస్‌తో పాటు విశాలమైన క్యాబిన్ ప్రయాణాన్ని మరింత సౌకర్యవంతంగా చేస్తుంది.

టెక్నాలజీ పరంగా సెగ్మెంట్‌లో తొలిసారిగా అందిస్తున్న డ్యాష్‌క్యామ్ సేఫ్టీని పెంచితే, వైర్‌లెస్ ఆండ్రాయిడ్ ఆటో, ఆపిల్ కార్‌ప్లే, టైప్-C USB పోర్ట్ వంటి కనెక్టివిటీ ఫీచర్లు డ్రైవ్‌ను మరింత స్మార్ట్‌గా మార్చుతున్నాయి. అదనంగా బ్లూలింక్ కనెక్టెడ్ టెక్నాలజీతో కార్‌ను రిమోట్‌గా కూడా మేనేజ్ చేయవచ్చు. ఎలక్ట్రిక్ సన్‌రూఫ్, అడ్వాన్స్‌డ్ డిజిటల్ క్లస్టర్, మ్యాప్స్, ఇన్ఫోటైన్‌మెంట్ కోసం OTA అప్‌డేట్స్ వంటి ఫీచర్లు ఈ SUVను ఫ్యూచర్-రెడీగా నిలబెడుతున్నాయి.
కొత్త మోడల్ పనితీరు పరంగా కూడా మంచి స్థాయిని కొనసాగిస్తోంది. 1.2 లీటర్ కప్పా పెట్రోల్ ఇంజన్‌తో వచ్చే ఈ మోడల్, 4-సిలిండర్ సెటప్‌ను అందించే అరుదైన SUVలలో ఒకటిగా నిలుస్తుంది. మాన్యువల్‌తో పాటు AMT ట్రాన్స్‌మిషన్ ఆప్షన్లు ఉండటం వల్ల డ్రైవర్‌కు అనుకూలంగా ఎంపిక చేసుకునే వీలుంది. ఈ ఇంజన్ సిటీ ట్రాఫిక్‌లోనూ, హైవేపై కూడా స్మూత్, రిఫైన్డ్ డ్రైవింగ్ అనుభవాన్ని అందిస్తూ విశ్వాసాన్ని పెంచుతుంది.

ఇక Hy-CNG Duo వేరియంట్ విషయానికి వస్తే, 1.2 లీటర్ బై-ఫ్యూయల్ కప్పా పెట్రోల్ + CNG ఇంజన్‌తో వచ్చే ఈ వేరియంట్, డ్యూయల్ సిలిండర్ సెటప్‌ను అందిస్తుంది. ఈ డిజైన్ వల్ల బూట్ స్పేస్‌ను తగ్గించకుండా 225 లీటర్ల సామర్థ్యాన్ని నిలబెట్టడం సాధ్యమైంది. అదనంగా, అండర్‌బాడీ స్పేర్ టైర్‌ను స్టాండర్డ్‌గా ఇవ్వడం వల్ల ప్రయాణంలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా సౌకర్యం ఉంటుంది.
హ్యూందాయ్ ఎక్స్‌టర్ కొత్త మోడల్‌లో భద్రతకు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారు. ఇందులో 45కి పైగా అడ్వాన్స్‌డ్ సేఫ్టీ ఫీచర్లు, 30 స్టాండర్డ్ ఫీచర్లు అందుబాటులో ఉన్నాయి. ESC, HAC వంటి కీలక ఫీచర్లతో పాటు 6 ఎయిర్‌బ్యాగ్‌లు అన్ని వేరియంట్లలో స్టాండర్డ్‌గా ఇవ్వడం విశేషం. ధర రూ. 5.79 లక్షల నుంచి రూ. 9.40 లక్షల(ఎక్స్-షోరూమ్) వరకు ఉంది. దీనిని కంపెనీ డీలర్‌షిప్‌లలో,ఆన్‌లైన్‌లో కేవలం రూ. 11,000తో బుకింగ్ చేసుకోవచ్చు.


Click it and Unblock the Notifications








