మధ్యతరగతి వాళ్లు ఎక్కువగా కొనే కారు.. సరికొత్తగా ముస్తాబై రాబోతుంది.. ఫీచర్లు చూస్తే మైండ్ బ్లాకే
భారత ఆటోమొబైల్ మార్కెట్లో మంచి క్రేజ్ ఉన్న ప్రీమియం హ్యాచ్‌బ్యాక్ కార్లలో హ్యుందాయ్ i20(Hyundai i20) ఒకటి. ఇప్పుడు ఈ పాపులర్ కారును మరింత స్టైలిష్‌గా, అడ్వాన్స్‌డ్‌గా మార్చడానికి కంపెనీ సిద్ధమైంది. హ్యుందాయ్ తన నెక్స్ట్ జనరేషన్ i20(Hyundai i20) మోడల్‌కు సంబంధించిన అధికారిక టీజర్‌ను తాజాగా రిలీజ్ చేసింది. ఈ టీజర్ ద్వారా కారు ఫ్రంట్ డిజైన్ ఎలా ఉండబోతోందనేది క్లియర్ గా తెలిసిపోతోంది. వచ్చే నెల, అంటే జులై 2026లో ఈ సరికొత్త కారును గ్లోబల్ మార్కెట్లో కంపెనీ ప్రపంచానికి పరిచయం చేయబోతోంది.
సైజులో కొద్దిగా పెద్దది.. ఎస్‌యూవీ లాంటి స్పోర్టీ లుక్
తాజా టీజర్ ఇమేజ్‌ను గమనిస్తే కొత్త హ్యుందాయ్ i20 డిజైన్ మునుపటి కంటే చాలా షార్ప్‌గా, మోడ్రన్‌గా మారినట్లు తెలుస్తోంది. ఇందులో బాణం గుర్తు (Arrowhead) లాంటి ఎల్‌ఈడీ హెడ్‌ల్యాంప్స్‌ను అందించారు. అలాగే 'Y' షేప్‌లో ఉన్న ఎల్‌ఈడీ డీఆర్‌ఎల్‌లను (DRLs) ఒక సన్నని ఎల్‌ఈడీ లైట్ బార్‌తో కనెక్ట్ చేశారు.

ఇది కారుకు చాలా ఫ్యూచరిస్టిక్ లుక్‌ను ఇస్తోంది. గతంలో వచ్చిన స్పై షాట్స్ ప్రకారం.. ఈ కారు లుక్ కొద్దిగా క్రాస్‌ఓవర్ లేదా ఎస్‌యూవీ తరహాలో ఉండబోతోంది. టెస్టింగ్ సమయంలో ఈ కారుకు 17-ఇంచ్ పెద్ద వీల్స్, పిరెల్లి (Pirelli) టైర్లను వాడినట్లు గుర్తించారు. దీని టాప్ వేరియంట్లలో కొత్త డిజైన్ అల్లాయ్ వీల్స్ రానున్నాయి.
రూపురేఖలు మారాయి.. లగ్జరీ ఇంటీరియర్
కొత్త జనరేషన్ కారులో ఏ అండ్ సి (A and C) పిల్లర్స్ డిజైన్‌ను కూడా మార్చారు, దీనివల్ల కారు మరింత స్పోర్టీగా కనిపిస్తుంది. దీంతో పాటు కొత్త విండో లైన్, అప్‌డేటెడ్ బంపర్స్, కనెక్టెడ్ ఎల్‌ఈడీ టెయిల్ లైట్స్, సరికొత్త టెయిల్ గేట్‌ను ఇందులో డిజైన్ చేశారు.

ప్రస్తుత మోడల్‌తో పోలిస్తే ఈ కొత్త కారు సైజ్ కూడా కొంచెం పెద్దదిగా ఉండబోతోంది. కారు కేబిన్ విషయానికి వస్తే హ్యుందాయ్ పెద్ద మార్పులకే శ్రీకారం చుట్టింది. ఇందులో క్రేటా కారు తరహాలోనే కర్వ్డ్ డ్యూయల్-స్క్రీన్ సెటప్ (డిస్‌ప్లే) లభించే అవకాశం ఉంది. కొత్త స్టీరింగ్ వీల్, లేటెస్ట్ కనెక్టెడ్ కార్ టెక్నాలజీతో పాటు మరిన్ని ప్రీమియం ఫీచర్లను ఇందులో యాడ్ చేశారు.
అడ్వాన్స్డ్ సేఫ్టీ ఫీచర్లు, నమ్మకమైన ఇంజన్
సేఫ్టీ పరంగా కూడా ఈ కారు చాలా అడ్వాన్స్‌డ్‌గా ఉండబోతోంది. ఈ నెక్స్ట్ జెన్ i20 కారులో అడ్వాన్స్డ్ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్ (ADAS) ఫీచర్లను అందిస్తున్నట్లు సమాచారం. అలాగే ఫ్రంట్, రియర్ పార్కింగ్ సెన్సార్లతో పాటు రియర్-వ్యూ కెమెరా కూడా లభిస్తుంది. ఇక ఇంజన్ విషయానికి వస్తే భారత్‌లో లభించే మోడల్ పవర్‌ట్రైన్‌లో పెద్దగా మార్పులు ఉండకపోవచ్చు.

ఇందులో ప్రస్తుతం ఉన్న 1.2-లీటర్ నేచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజన్, i20 ఎన్ లైన్ (N Line)లో వచ్చే 1.0-లీటర్ టర్బో పెట్రోల్ ఇంజన్ ఆప్షన్లనే కొనసాగించనున్నారు. అయితే విదేశీ మార్కెట్ల కోసం సరికొత్త 1.2-లీటర్ టర్బో పెట్రోల్ ఇంజన్ మరియు మైల్డ్-హైబ్రిడ్ ఆప్షన్లను కూడా హ్యుందాయ్ పరిచయం చేసే అవకాశం ఉంది.
ఇండియా మార్కెట్లోకి ఎప్పుడు వస్తుంది?
హ్యుందాయ్ సంస్థ తన బెస్ట్ కార్లను ఎప్పటికప్పుడు భారతీయ కస్టమర్ల కోసం అందుబాటులోకి తెస్తూనే ఉంటుంది. అందులో భాగంగానే ఈ సరికొత్త న్యూ-జనరేషన్ i20 కారును మొదట జులైలో గ్లోబల్ మార్కెట్లో అన్‌వీల్ చేసిన కొద్ది రోజులకే భారత మార్కెట్లో కూడా లాంచ్ చేయడానికి ప్లాన్ చేస్తోంది. టెక్నాలజీ, డిజైన్, లగ్జరీ ఫీచర్ల పరంగా రాబోతున్న ఈ కారు మార్కెట్లోకి వస్తే టాటా ఆల్ట్రోజ్ రేసర్, మారుతి బాలెనో వంటి కార్లకు గట్టి పోటీ ఇవ్వడం ఖాయంగా కనిపిస్తోంది.


Click it and Unblock the Notifications