New Kia Seltos 2026 : రోడ్డు మీద ఈ కారు వెళ్తుంటే అందరూ ఆగి చూడాల్సిందే..కొత్త ఏడాది కియా బ్లాక్ బస్టర్!
New Kia Seltos 2026 : కొత్త ఏడాది సరికొత్త ఊపుతో మొదలైంది. ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న సరికొత్త కియా సెల్టోస్ (New Kia Seltos) భారత్‌లో గ్రాండ్‌గా లాంచ్ అయింది. కియా తన కజిన్ బ్రదర్ అయిన హ్యుందాయ్ క్రెటాకు, అలాగే టాటా సియరా వంటి దిగ్గజాలకు ముచ్చెమటలు పట్టించేలా అదిరిపోయే ధరతో ఈ కారును రంగంలోకి దించింది. కేవలం రూ.10.99 లక్షల ప్రారంభ ధరతో మధ్యతరగతి ప్రజల సొంత కారు కలని కియా నిజం చేయబోతోంది.
కొత్త కియా సెల్టోస్ మొత్తం మూడు ఇంజిన్ ఆప్షన్లలో లభిస్తుంది. దీని బేస్ వేరియంట్ ధర రూ.10.99 లక్షల (ఎక్స్-షోరూమ్) నుంచి ప్రారంభమై, టాప్ ఎండ్ వేరియంట్ ధర రూ.19.99 లక్షల వరకు ఉంటుంది. మార్కెట్లో గట్టి పోటీ ఇస్తున్న మారుతి గ్రాండ్ విటారా, టయోటా హైరైడర్, టాటా సియరా వంటి కార్ల కంటే ఇది చాలా ఆకర్షణీయమైన ధర అని చెప్పవచ్చు. ఇప్పటికే రూ.25,000 టోకెన్ అమౌంట్‌తో బుకింగ్స్ షురూ అయ్యాయి. జనవరి రెండో వారం నుంచి డెలివరీలు ప్రారంభం కానున్నాయి.
2026 కియా సెల్టోస్ ఎక్స్ షోరూమ్ ధరల లిస్ట్(₹)
2026 కియా సెల్టోస్ పెట్రోల్ - మాన్యువల్ (NA + Turbo iMT)
| Variant | Price (₹) |
| G1.5 MT HTE | 10,99,000 |
| G1.5 MT HTE (O) | 12,09,000 |
| G1.5 MT HTK | 13,09,000 |
| G1.5 MT HTK (O) | 14,19,000 |
| G1.5 MT HTX | 15,59,000 |
| G1.5 MT HTX (A) | 16,69,000 |
| G1.5 Turbo iMT HTE (O) | 12,89,000 |
| G1.5 Turbo iMT HTK | 13,89,000 |
| G1.5 Turbo iMT HTK (O) | 14,99,000 |
2026 కియా సెల్టోస్ పెట్రోల్ - iVT
| Variant | Price (₹) |
| G1.5 IVT HTE (O) | 13,39,000 |
| G1.5 IVT HTK | 14,39,000 |
| G1.5 IVT HTK (O) | 15,49,000 |
| G1.5 IVT HTX | 16,89,000 |
| G1.5 IVT HTX (A) | 17,99,000 |
| G1.5 IVT GTX / X-Line | 18,39,000 |
| G1.5 IVT GTX (A) / X-Line (A) | 19,49,000 |
2026 కియా సెల్టోస్ పెట్రోల్ - Turbo DCT
| Variant | Price (₹) |
| G1.5 Turbo DCT HTK (O) | 16,29,000 |
| G1.5 Turbo DCT HTX | 17,69,000 |
| G1.5 Turbo DCT HTX (A) | 18,79,000 |
| G1.5 Turbo DCT GTX / X-Line | 19,19,000 |
| G1.5 Turbo DCT GTX (A) / X-Line (A) | 19,99,000 |
2026 కియా సెల్టోస్ డీజిల్ - మాన్యువల్
| Variant | Price (₹) |
| 1.5 Diesel MT HTE | 12,59,000 |
| 1.5 Diesel MT HTE (O) | 13,69,000 |
| 1.5 Diesel MT HTK | 14,69,000 |
| 1.5 Diesel MT HTK (O) | 15,79,000 |
| 1.5 Diesel MT HTX | 17,19,000 |
| 1.5 Diesel MT HTX (A) | 18,29,000 |
2026 కియా సెల్టోస్ డీజిల్ - ఆటోమేటిక్
| Variant | Price (₹) |
| 1.5 Diesel AT HTE (O) | 14,99,000 |
| 1.5 Diesel AT HTK | 15,99,000 |
| 1.5 Diesel AT HTK (O) | 17,09,000 |
| 1.5 Diesel AT HTX | 18,49,000 |
| 1.5 Diesel AT HTX (A) | 19,59,000 |
| 1.5 Diesel AT GTX / X-Line | 19,79,000 |
| 1.5 Diesel AT GTX (A) / X-Line (A) | 19,99,000 |

కియా తన సిగ్నేచర్ ఆపోజిట్స్ యునైటెడ్ డిజైన్ ఫిలాసఫీతో ఈ కారును రూపొందించింది. చూడటానికి ఇది కియా గ్లోబల్ మోడల్ టెల్లూరైడ్ లా కనిపిస్తుంది. దీని వెడల్పాటి గ్రిల్, నిలువుగా ఉండే ఎల్ఈడీ హెడ్ లాంప్స్, స్టైలిష్ ఎల్ఈడీ టెయిల్ లైట్స్ కారుకు ఒక విలాసవంతమైన లుక్‌ను ఇస్తున్నాయి.
అంతేకాదు, పాత మోడల్ కంటే ఇది 95 మి.మీ పొడవు, 30 మి.మీ వెడల్పు పెరిగింది. దీనివల్ల కారు లోపల కూర్చునే వారికి మంచి లెగ్ స్పేస్, హెడ్ రూమ్ లభిస్తుంది. లోపలికి అడుగుపెడితే ఏదో లగ్జరీ కారులో ఉన్న ఫీలింగ్ కలుగుతుంది. డ్యాష్‌బోర్డ్ మీద 12.3 ఇంచుల డ్యూయల్ డిస్‌ప్లే హైలైట్‌గా నిలుస్తుంది.

ఇందులో ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ కలిసి ఉంటాయి. పనోరమిక్ సన్ రూఫ్, 8 స్పీకర్లతో బోస్ సౌండ్ సిస్టమ్, వెంటిలేటెడ్ సీట్లు, 10-వే పవర్డ్ సీట్లు వంటి ప్రీమియం ఫీచర్లు ఇందులో ఉన్నాయి. ఏడీఏఎస్ (ADAS) లెవల్ 2 టెక్నాలజీ ఇది కారును మరింత సురక్షితంగా ఉంచుతుంది.
కియా సెల్టోస్ సేఫ్టీ విషయంలో రాజీ పడలేదు. ఇందులో 6 ఎయిర్‌బ్యాగ్‌లు, ఏబీఎస్, ఈబీడీ, ఎలక్ట్రిక్ స్టెబిలిటీ కంట్రోల్ (ESC), 360-డిగ్రీ కెమెరా వంటి ఫీచర్లు స్టాండర్డ్‌గా వస్తున్నాయి. కొత్త కె3 (K3) ప్లాట్‌ఫారమ్‌పై తయారైనందున ఈ కారు బాడీ చాలా దృఢంగా ఉంటుంది. ఇది భారత్ ఎన్‌క్యాప్ (Bharat NCAP) క్రాష్ టెస్టులో 5-స్టార్ రేటింగ్ సాధిస్తుందని కంపెనీ ధీమాగా ఉంది.

కొత్త సెల్టోస్ మూడు పవర్ఫుల్ ఇంజిన్లతో వస్తుంది. 1.5L పెట్రోల్ (113bhp), 1.5L టర్బో-పెట్రోల్ (158bhp), 1.5L డీజిల్ (118bhp) ఇంజిన్ ఆప్షన్లు ఉన్నాయి. వీటికి మ్యాన్యువల్, iMT, CVT, 7-స్పీడ్ డీసీటీ (DCT) ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఆప్షన్లు అందుబాటులో ఉన్నాయి. హ్యుందాయ్ క్రెటా, మారుతి విక్టోరిస్, టాటా సియరా వంటి మోడళ్లకు ఈ సరికొత్త సెల్టోస్ గట్టి పోటీ ఇవ్వనుంది.


Click it and Unblock the Notifications








