ఉద్యోగస్తుల కోసం కొత్త ఎలక్ట్రిక్ కారు.. ఒక్కసారి చార్జ్ చేస్తే.. ఆఫీస్, షాపింగ్, చిన్న ట్రిప్ అన్నీ కవర్
దేశీయ ఆటోమొబైల్ దిగ్గజం మహీంద్రా ప్రస్తుతం భారత కారు మార్కెట్‌లో సంచలనాలకు కేంద్రబిందువుగా మారింది. ఒకదాని వెంట ఒకటి కొత్త మోడళ్లను విడుదల చేస్తూ, ప్రత్యర్థి కంపెనీలకు స్పష్టమైన హెచ్చరిక ఇస్తోంది. వరుస లాంచ్‌లతో మార్కెట్‌ను తన ఆధీనంలోకి తీసుకునే వ్యూహాన్ని మహీంద్రా బలంగా అమలు చేస్తోంది. ఇటీవలే XUV 7XOను అధికారికంగా లాంచ్ చేసిన మహీంద్రా, దానికి కేవలం ఒక రోజు గ్యాప్‌లోనే ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న XUV 3XO EVను కూడా ప్రవేశపెట్టడం ద్వారా అందరినీ ఆశ్చర్యపరిచింది. ఈ వరుస విడుదలలు భారతదేశంలో వేగంగా ఎదుగుతున్న SUV మార్కెట్‌లో మహీంద్రా దూకుడు ఎంత బలంగా ఉందో స్పష్టంగా చూపిస్తున్నాయి.
ఇప్పటివరకు సాంప్రదాయ పెట్రోల్, డీజిల్ SUVలలో తనకంటూ ప్రత్యేక స్థానం సంపాదించుకున్న మహీంద్రా, ఇప్పుడు అదే ఆత్మవిశ్వాసంతో ఎలక్ట్రిక్ వాహన విభాగంలోనూ తన పట్టు బలపరుస్తోంది. కొత్తగా లాంచ్ అయిన మహీంద్రా XUV 3XO EV ఆధునిక డిజైన్, టెక్నాలజీతో పాటు ప్రీమియం ఫీల్‌ను అందించేలా రూపొందించబడింది. ఈ ఎలక్ట్రిక్ SUV AX5, AX7L అనే రెండు వేరియంట్లలో వినియోగదారులకు అందుబాటులో ఉంది.

ధర విషయానికి వస్తే, XUV 3XO EV రూ.13.89 లక్షల నుండి రూ. 14.96 లక్షల వరకు(ఎక్స్-షోరూమ్) ఉంటుంది. ఈ ధరలో ప్రీమియం ఫీచర్లు, నమ్మకమైన బ్రాండ్ విలువ, ఎలక్ట్రిక్ టెక్నాలజీ కలిసిన ప్యాకేజీని అందించడం ద్వారా మహీంద్రా వినియోగదారులను ఆకట్టుకోవాలని ప్రయత్నిస్తోంది. ఇందులో 39.4 kWh సామర్థ్యంతో కూడిన పెద్ద బ్యాటరీ ప్యాక్ అందించారు. దీనిని ఒకసారి పూర్తిగా చార్జ్ చేస్తే 285 కిలోమీటర్ల వరకు రేంజ్ ఇస్తుంది.
దీంతో ఇది రోజువారీ ఆఫీస్ ప్రయాణాలు, నగర డ్రైవింగ్‌కు అనుకూలంగా మారుతుంది. ఈ ఎలక్ట్రిక్ SUVలోని మోటార్ పనితీరు విషయానికి వస్తే, ఇది 110 kW శక్తిని, 310 Nm భారీ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఎలక్ట్రిక్ వాహనాలకు సాధారణంగా లభించే ఇన్‌స్టంట్ టార్క్ కారణంగా, యాక్సిలరేషన్ చాలా వేగంగా ఉంటుంది. ఫలితంగా XUV 3XO EV కేవలం 8.3 సెకన్లలోనే 0 నుంచి 100 కి.మీ/గం వేగాన్ని అందుకుంటుంది.

డ్రైవింగ్ అనుభూతిని డ్రైవర్ అవసరాలకు అనుగుణంగా మార్చుకునేందుకు, మహీంద్రా ఈ SUVలో మూడు మల్టీ-డ్రైవ్ మోడ్‌లను అందించింది. డ్రైవర్ తన ప్రాధాన్యతను బట్టి ఫన్, ఫాస్ట్, ఫియర్‌లెస్ అనే మోడ్‌లలో ఏదైనా ఎంచుకోవచ్చు. దీన్ని బయట నుంచి చూసినా, లోపల కూర్చున్నా ఆధునికంగా, ప్రీమియంగా కనిపించేలా రూపొందించబడింది. బయట భాగంలో ఇది R16 డైమండ్-కట్ అల్లాయ్ వీల్స్ ఉంటాయి.
అలాగే, LED ప్రొజెక్టర్ హెడ్‌ల్యాంప్‌లు, ఇంటిగ్రేటెడ్ టర్న్ ఇండికేటర్‌లతో కూడిన LED DRLలు, సిగ్నేచర్ LED టెయిల్ లాంప్‌లును కలిగి ఉంది. ఇవన్నీ కారుకు ఆకర్షణీయమైన లుక్‌ను అందిస్తాయి. లోపలికి వస్తే, క్యాబిన్ చాలా సొగసుగా ఉంటుంది. ఇందులో సింగిల్-పేన్ సన్‌రూఫ్‌తో పాటు రెండు 10.25-అంగుళాల HD స్క్రీన్‌లు ఉన్నాయి. ఒకటి ఇన్ఫోటైన్‌మెంట్ కోసం, మరొకటి డ్రైవర్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ కోసం ఉండటంతో కారుకు ఫుల్ టెక్ ఫీల్ వస్తుంది.

కంఫర్ట్, సౌకర్యాల విషయానికి వస్తే, ఈ SUVలో డ్యూయల్-జోన్ క్లైమేట్ కంట్రోల్, కీలెస్ ఎంట్రీ, పుష్ బటన్ స్టార్ట్, ఆటో హోల్డ్‌తో ఎలక్ట్రానిక్ పార్కింగ్ బ్రేక్, ఆటో హెడ్‌ల్యాంప్‌లు, రెయిన్ సెన్సింగ్ వైపర్‌లు, ఎలక్ట్రికల్‌గా ఫోల్డ్ అయ్యే ORVMలు వంటి ఫీచర్లు ఉన్నాయి. ఇవి రోజువారీ డ్రైవింగ్‌ను మరింత సులభంగా చేస్తాయి. AX5 వేరియంట్‌లో అదనంగా ఎత్తు సర్దుబాటు చేయగల డ్రైవర్ సీటు, వెనుక AC వెంట్స్ మొదలగుని ఉన్నాయి.


Click it and Unblock the Notifications








