నిన్ననే లాంచ్ అయింది.. 7 మంది హాయిగా కూర్చోవచ్చు.. కొత్త మహీంద్రా SUV గురించిన టాప్ విషయాలు

మహీంద్రా ఆటోమొబైల్ ప్రపంచంలో మరోసారి సంచలనం సృష్టించింది. నిన్న అధికారికంగా లాంచ్ అయిన కొత్త మహీంద్రా XUV 7XO, ఇప్పటికే మార్కెట్‌లో మంచి పేరు సంపాదించిన XUV700కు ఫేస్‌లిఫ్ట్ వెర్షన్‌గా పరిచయమైంది. లాంచ్ అయిన వెంటనే ఈ SUVపై భారీ చర్చ మొదలైంది అంటే, ఇందులో ఎంత కొత్తదనం, ఎంత అప్‌గ్రేడ్ ఉందో అర్థం చేసుకోవచ్చు. ఆధునాతన డిజైన్, తాజా టెక్నాలజీ, డజన్ల కొద్దీ కొత్త ఫీచర్లతో XUV 7XO ఇప్పుడు మరింత ప్రీమియం ఫీల్‌ను ఇస్తోంది. డిజైన్ పరంగా చూస్తే, XUV 7XO పూర్తిగా ఫ్రెష్‌గా కనిపిస్తుంది. XUV700 బోల్డ్ ఐడెంటిటీని నిలుపుకుంటూనే, ఈసారి మరింత షార్ప్ లైన్స్, అప్‌డేటెడ్ ఫ్రంట్ లుక్, ఆధునిక లైటింగ్ ఎలిమెంట్స్‌తో SUVకి కొత్త వ్యక్తిత్వం ఇచ్చారు. ఇది రోడ్డుపై కనిపించిన వెంటనే చూపు ఆకర్షించేలా డిజైన్ చేశారు.

లోపల క్యాబిన్‌లోకి వెళ్తే, ప్రీమియం టచ్ మరింత స్పష్టంగా అనిపిస్తుంది. సౌకర్యవంతమైన సీట్లు, పెద్ద టచ్‌స్క్రీన్, డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్, అడ్వాన్స్‌డ్ కనెక్టెడ్ కార్ ఫీచర్లు ఇది ఒక ఫుల్-ఫ్యామిలీ SUV అనుభూతిని ఇస్తుంది. మీరు కొత్త కారు కొనాలని ప్లాన్ చేస్తున్నట్లయితే, ముఖ్యంగా ఫ్యామిలీ కోసం ఒక సేఫ్, స్టైలిష్, ఫీచర్-రిచ్ SUV వెతుకుతున్నట్లయితే, ఈ కొత్త XUV 7XO నిజంగా ఒక ఉత్తమ ఎంపికగా చెప్పుకోవచ్చు.

New Mahindra Xuv 7xo Suv Price Mileage Engine And All Top Things Details

ఇది రోజువారీ ప్రయాణాలకే కాదు, లాంగ్ డ్రైవ్స్‌, ఫ్యామిలీ ట్రిప్స్‌కు కూడా పూర్తిగా సరిపోతుంది. అయితే, ఇది కొంచెం ప్రీమియం సెగ్మెంట్‌కు చెందిన కారు కావడం వల్ల, ధర కూడా ఆ స్థాయిలోనే ఉంటుంది. ధర విషయానికి వస్తే, మహీంద్రా XUV 7XO ఎక్స్-షోరూమ్ (న్యూఢిల్లీ) ధరలు రూ.13.66 లక్షల నుండి రూ.24.92 లక్షల వరకు ఉన్నాయి. ఈ ధర పరిధిలో, మహీంద్రా విస్తృతమైన వేరియంట్ ఎంపికలను అందిస్తోంది.

కస్టమర్ల అవసరాలు అనుగుణంగా SUVను AX, AX3, AX5, AX7, AX7T, AX7L వేరియంట్లలో అందుబాటులోకి తీసుకొచ్చింది. కొత్త మహీంద్రా XUV 7XOలో చేసిన మార్పులు చూస్తే, నిజంగా ప్రీమియం SUV అనే భావన కనిపిస్తుంది. ముందుభాగం నుంచే ఈ కారు తన ఆధునికతను చూపిస్తుంది. ఇందులో కొత్త డిజైన్‌తో వచ్చిన LED హెడ్‌ల్యాంప్‌లు, ఆకర్షణీయమైన LED DRLలు, అలాగే స్పోర్టీ లుక్ ఇచ్చే LED ఫాగ్ ల్యాంప్‌లు ఉన్నాయి.

New Mahindra Xuv 7xo Suv Price Mileage Engine And All Top Things Details

వెనుక భాగంలో స్టైలిష్‌గా కనిపించే LED టెయిల్‌ల్యాంప్‌లు అందించారు. లైటింగ్ సెటప్ వల్ల రాత్రి సమయంలో కారు మరింత ఆకర్షణీయంగా కనిపిస్తుంది. ఇందులో ఉన్న భారీ 19-అంగుళాల అల్లాయ్ వీల్స్ బలమైన రోడ్ ప్రెజెన్స్‌ను ఇస్తాయి. ఇది చాలా విశాలమైన కారు. పొడవు 4,695 mm, వెడల్పు 1,890 mm, ఎత్తు 1,755 mmగా ఉండటం వల్ల క్యాబిన్‌లో మంచి స్పేస్ లభిస్తుంది. అంతేకాదు, 2,750 mm వీల్‌బేస్ ఉంది.

ఈ SUVలో 6 సీట్లు లేదా 7 సీట్లు అందుబాటులో ఉండటం మరో ప్లస్ పాయింట్. పెద్ద కుటుంబాలకు ఇది చాలా ఉపయోగపడుతుంది. ఈ SUV మరింత శక్తివంతంగా, విశ్వసనీయంగా ఉండేలా రెండు బలమైన ఇంజన్ ఆప్షన్లను అందిస్తోంది. ఇందులో ఒకటి 2-లీటర్ టర్బో పెట్రోల్ ఇంజన్, మరొకటి 2.2-లీటర్ డీజిల్ ఇంజన్. ఈ రెండూ కూడా మహీంద్రా నిరూపితమైన ఇంజన్లు కావడంతో, పనితీరు, దీర్ఘకాలిక నమ్మకత్వం రెండూ లభిస్తాయి.

New Mahindra Xuv 7xo Suv Price Mileage Engine And All Top Things Details

మైలేజీ విషయానికి వస్తే, ఈ SUV లీటరుకు సుమారు 13 నుండి 17 కిలోమీటర్ల వరకు మైలేజీ ఇవ్వగలదని అంచనా వేస్తున్నారు. ఈ కారు క్యాబిన్ డిజైన్ అద్భుతంగా ఉంది. లోపల ట్రిపుల్ స్క్రీన్ సెటప్ (టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, డిజిటల్ డ్రైవర్ డిస్ప్లే & కో-డ్రైవర్ ఎంటర్‌టైన్‌మెంట్ సిస్టమ్), 16-స్పీకర్ హర్మాన్ కార్డాన్ సౌండ్ సిస్టమ్, పనోరమిక్ సన్‌రూఫ్, వెంటిలేటెడ్ రియర్ సీట్లు, మల్టీ-కలర్ యాంబియంట్ లైటింగ్ ఉన్నాయి.

ప్రయాణికుల సేఫ్టీకి సంబంధించి ఇది భద్రతకు కూడా ప్రసిద్ధి చెందింది. ఇందులో 7 ఎయిర్‌బ్యాగులు, లెవల్ 2 ADAS అడ్వాన్స్‌డ్ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్, ABS (యాంటీ-లాక్ బ్రేకింగ్ సిస్టమ్), EBD (ఎలక్ట్రానిక్ బ్రేక్‌ఫోర్స్ డిస్ట్రిబ్యూషన్), ESC (ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్), ఎలక్ట్రానిక్ పార్కింగ్ బ్రేక్, ప్రయాణికుల రక్షణ కోసం వెనుక పార్కింగ్ సెన్సార్లు ఉన్నాయి.

More from DriveSpark

Article Published On: Tuesday, January 6, 2026, 17:10 [IST]
English summary
New mahindra xuv 7xo suv price mileage engine and all top things details
Read more on: #mahindra #india
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+