దేశంలో బాగా డిమాండ్ ఉన్న కారు మరింత కొత్తగా వస్తోంది.. జస్ట్ కొద్ది రోజులు వెయిట్ చేస్తే చాలు!
భారత ఆటోమొబైల్ మార్కెట్లో పోటీ రోజురోజుకీ పెరుగుతున్న నేపథ్యంలో ప్రముఖ కార్ల తయారీ సంస్థలు తమ బెస్ట్ సెల్లింగ్ మోడళ్లను కొత్త ఫీచర్లు, ఆధునిక టెక్నాలజీతో అప్‌డేట్ చేస్తూ వినియోగదారులను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నాయి. ఈ క్రమంలో దేశంలోని అతిపెద్ద కార్ల తయారీ సంస్థ మారుతి సుజుకి (maruti suzuki) కూడా తన అత్యంత ప్రజాదరణ పొందిన కాంపాక్ట్ SUV బ్రెజ్జా (Brezza)ను ఫేస్‌లిఫ్ట్ వెర్షన్‌లో మార్కెట్లోకి తీసుకురావడానికి సిద్ధమవుతున్నట్లు సమాచారం. తాజా నివేదికల ప్రకారం, ఈ కొత్త బ్రెజ్జా జూలై మధ్యలో భారత మార్కెట్లో అధికారికంగా విడుదలయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.
కొత్త బ్రెజ్జాలో కేవలం బయటి రూపాన్ని మాత్రమే మార్చకుండా, డిజైన్, టెక్నాలజీ, భద్రత, పనితీరు వంటి కీలక అంశాల్లో కూడా గణనీయమైన మార్పులు తీసుకురానున్నట్లు తెలుస్తోంది. ముందు భాగంలో కొత్త గ్రిల్, రీడిజైన్ చేసిన బంపర్లు, కొత్త LED లైటింగ్ సిగ్నేచర్, అప్‌డేటెడ్ అల్లాయ్ వీల్స్ వంటి మార్పులతో ఈ SUV మరింత ప్రీమియంగా కనిపించే అవకాశం ఉంది. అంతేకాకుండా క్యాబిన్‌లో కూడా కొత్త ఫీచర్లు, అప్‌డేటెడ్ ఫీచర్లు అందించవచ్చు.

అయితే ఈ ఫేస్‌లిఫ్ట్ బ్రెజ్జాలో అత్యంత ఆసక్తికరమైన మార్పు ఇంజిన్ ఎంపికలో ఉండనుందని సమాచారం. ఇప్పటి వరకు బ్రెజ్జా కేవలం 1.5-లీటర్ నేచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజన్‌తో మాత్రమే అందుబాటులో ఉండగా, కొత్త వెర్షన్‌లో తొలిసారిగా రెండు ఇంజిన్ ఆప్షన్లు అందించే అవకాశం ఉంది. ప్రస్తుతం ఉన్న 1.5-లీటర్ ఇంజన్‌తో పాటు, ఫ్రాంక్స్‌లో ఉపయోగిస్తున్న 1.0-లీటర్ టర్బో పెట్రోల్ బూస్టర్‌జెట్ ఇంజన్‌ను కూడా ఈ SUVలో అందించనున్నట్లు ప్రచారం జరుగుతోంది.
ఈ టర్బో ఇంజన్ చేరికతో బ్రెజ్జా పనితీరు మరింత మెరుగుపడటంతో పాటు వేగవంతమైన యాక్సిలరేషన్, మెరుగైన డ్రైవింగ్ అనుభూతి లభిస్తుంది. అంతేకాకుండా, 1.0-లీటర్ టర్బో పెట్రోల్ ఇంజన్‌ను అందించడం ద్వారా నాలుగు మీటర్లలోపు పొడవు, 1,200 సీసీ లోపు పెట్రోల్ ఇంజన్ కలిగిన వాహనాలకు వర్తించే తక్కువ GST ప్రయోజనం లభించే అవకాశం ఉంది. దీని వల్ల బ్రెజ్జా ధరను పోటీ స్థాయిలో ఉంచేందుకు మారుతి సుజుకికి అవకాశం దక్కుతుంది.

ఈ SUVలో 1.0-లీటర్, టర్బో పెట్రోల్ ఇంజన్ గరిష్టంగా 100 bhp పవర్, 147.6 Nm టార్క్ ఉత్పత్తి చేయగలదు. ఇప్పటికే ఉన్న 1.5-లీటర్ నేచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజన్ కూడా కొనసాగుతుందని సమాచారం. అంతేకాకుండా, కొత్త బ్రెజ్జా ఫ్యాక్టరీ-ఫిట్టెడ్ CNG వేరియంట్‌లో కూడా అందుబాటులోకి రావచ్చు. ఇందులో అండర్‌బాడీ మౌంటెడ్ CNG ట్యాంక్‌ను ఉపయోగించవచ్చు. దీంతో బూట్ స్పేస్ తగ్గకుండా ఎక్కువ లగేజ్‌ను తీసుకెళ్లే వీలు కలుగుతుంది.
డిజైన్ పరంగా బ్రెజ్జా యొక్క గుర్తింపును అలాగే కొనసాగిస్తూ, మరింత ఆధునిక లుక్‌ను తీసుకురానున్నట్లు తెలుస్తోంది. స్పై ఫోటోల ప్రకారం ఇందులో కొత్త ఫ్రంట్ గ్రిల్, రీడిజైన్ చేసిన LED హెడ్‌ల్యాంప్స్, కొత్త బంపర్, అప్‌డేటెడ్ అల్లాయ్ వీల్స్, కొత్త కలర్ ఆప్షన్లు వంటి మార్పులు కనిపించనున్నాయి. దీంతో బ్రెజ్జా మరింత ప్రీమియం, స్పోర్టీ రూపాన్ని సంతరించుకోనుంది. ఇంటీరియర్‌లో కూడా పలు అప్‌డేట్లు ఉండనున్నాయి.

క్యాబిన్‌ను గ్రాండ్ విటారా స్టైల్‌ను పోలి ఉండేలా డిజైన్ చేసే అవకాశం ఉంది. ఇందులో కొత్త 10.1-అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు, కొత్త ఫ్యాబ్రిక్ అప్‌హోల్స్టరీ, హెడ్-అప్ డిస్‌ప్లే, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, ఎలక్ట్రిక్ సన్‌రూఫ్, వైర్‌లెస్ ఫోన్ ఛార్జర్, వైర్‌లెస్ ఆండ్రాయిడ్ ఆటో, యాపిల్ కార్‌ప్లే, వెనుక ఏసీ వెంట్లు, 360-డిగ్రీ కెమెరా, సెమీ-డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ వంటి ఫీచర్లు అందించే అవకాశం ఉంది.


Click it and Unblock the Notifications