కార్లలోనే ఫస్ట్ టైమ్ ఆ ట్యాంక్ టెక్నాలజీ.. కొత్తగా ముస్తాబై వస్తున్న మారుతి బ్రెజ్జా

భాతర ఆటోమొబైల్ మార్కెట్లో అత్యంత ప్రజాదరణ పొందిన మిడ్‌సైజ్ ఎస్‌యూవీలలో మారుతి సుజుకి బ్రెజ్జా (Maruti Suzuki Brezza) ఒకటి. ఎప్పటికప్పుడు సరికొత్త అప్‌డేట్స్‌తో దూసుకుపోయే ఈ కారు, ఇప్పుడు సరికొత్త ఫేస్‌లిఫ్ట్ (Facelift) రూపంలో మార్కెట్లోకి రావడానికి సిద్ధమవుతోంది. గత కొన్ని వారాలుగా సరికొత్త బ్రెజ్జా ఫీచర్లపై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ నడుస్తోంది. మీరు కూడా ఈ క్రేజీ ఎస్‌యూవీని సొంతం చేసుకోవాలని ప్లాన్ చేస్తుంటే, కంపెనీ ఇందులో ఆఫర్ చేయబోయే కొన్ని అద్భుతమైన ఫీచర్లు, విప్లవాత్మక మార్పుల గురించి తెలుసుకుందాం.

కొత్త టర్బో ఇంజన్.. 6-స్పీడ్ గేర్‌బాక్స్ సపోర్ట్!
లీకైన నివేదికల ప్రకారం, కొత్త మారుతి బ్రెజ్జాలో అత్యంత శక్తివంతమైన 1.0 లీటర్ బూస్టర్‌జెట్ టర్బోచార్జ్డ్ పెట్రోల్ ఇంజన్‌ను అందించబోతున్నారు. ఇది సరికొత్త 6-స్పీడ్ మ్యాన్యువల్ గేర్‌బాక్స్‌తో అనుసంధానించబడి ఉంటుంది. ప్రస్తుతం మారుతి ఫ్రాంక్స్ (Fronx) కారులో వాడుతున్న ఈ 3-సిలిండర్ ఇంజన్, గరిష్టంగా 100 పీఎస్ పవర్‌ను, 147.6 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ చిన్న టర్బో-పెట్రోల్ ఇంజన్ వల్ల కస్టమర్లకు మైలేజ్ పెరగడమే కాకుండా, కొన్ని వేరియంట్లపై తక్కువ జీఎస్టీ (GST) ప్రయోజనం కూడా లభించనుంది.

New Maruti Brezza Facelift Set to Disrupt the SUV Market with ADAS First Underbody CNG Tank

సీఎన్‌జీ ట్యాంక్ కిందకి షిఫ్ట్.. బూట్ స్పేస్ ఇక ఫుల్ ఖాళీ
సాధారణంగా సీఎన్‌జీ (CNG) కార్లు కొనేవారికి డిక్కీలో లగేజ్ పెట్టుకోవడానికి అస్సలు స్థలం (బూట్ స్పేస్) ఉండదు. కానీ ఈ సమస్యకు మారుతి సుజుకి అదిరిపోయే చెక్ పెట్టింది. కొత్త బ్రెజ్జా మోడల్‌లో 1.5 లీటర్ నార్మల్ పెట్రోల్ ఇంజన్‌తో పాటు సీఎన్‌జీ ఆప్షన్ కూడా ఉంటుంది. అయితే, గతంలో లీకైన చిత్రాల ప్రకారం.. మారుతి విక్టోరిస్ తరహాలోనే ఈ కొత్త బ్రెజ్జాలో కూడా అండర్ బాడీ సీఎన్‌జీ ట్యాంక్ టెక్నాలజీని వాడుతున్నారు. అంటే సీఎన్‌జీ సిలిండర్ కారు అడుగు భాగాన అమర్చబడి ఉంటుంది, దీనివల్ల కారు డిక్కీలో లగేజ్ పెట్టుకోవడానికి అదనంగా భారీ స్పేస్ దక్కుతుంది.

లగ్జరీగా మారనున్న ఇంటీరియర్
కొత్త 2026 మారుతి బ్రెజ్జా ఫేస్‌లిఫ్ట్ ఇంటీరియర్ పరంగా కూడా చాలా ప్రీమియంగా మారబోతోంది. ప్రస్తుతం ఉన్న 9 ఇంచుల ఇన్ఫోటైన్‌మెంట్ స్క్రీన్ స్థానంలో, సరికొత్త 10.1 ఇంచుల భారీ సెంట్రల్ టచ్‌స్క్రీన్ సిస్టమ్‌ను ప్రవేశపెట్టే అవకాశం ఉంది. ఈ పెద్ద డిస్‌ప్లేను మారుతి విక్టోరిస్ మోడల్ నుండి తీసుకోనున్నారు. వీటితో పాటు కొత్తగా డిజైన్ చేసిన డ్యాష్‌బోర్డ్, సరికొత్త అపోల్స్ట్రే (సీట్ కవర్ల డిజైన్), ప్రీమియం ట్రిమ్స్ కారు లోపల దర్శనమివ్వనున్నాయి.

New Maruti Brezza Facelift Set to Disrupt the SUV Market with ADAS First Underbody CNG Tank

సేఫ్టీలో తోపు.. బ్రెజ్జాలోకి ADAS టెక్నాలజీ
కార్లలో ప్రయాణించే వారి సేఫ్టీ కోసం మారుతి సుజుకి ఈసారి అత్యున్నత ప్రాధాన్యతనిచ్చింది. టెస్టింగ్ సమయంలో దొరికిన మోడల్స్ ప్రకారం, ఈ కారు ఫ్రంట్ గ్రిల్‌పై ఇంటిగ్రేటెడ్ రాడార్ హౌసింగ్ కనిపించింది. దీనిబట్టి కొత్త బ్రెజ్జా ఫేస్‌లిఫ్ట్ వెర్షన్ అడ్వాన్స్‌డ్ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్.. అంటే ADAS ఫీచర్‌తో రాబోతుందని స్పష్టమవుతోంది. ఈ ఫీచర్ వల్ల ఆటోమేటిక్ ఎమర్జెన్సీ బ్రేకింగ్, లేన్ అసిస్ట్ వంటి ఎన్నో లైఫ్ సేవింగ్ సేఫ్టీ ఆప్షన్లు కారుకు లభిస్తాయి.

లుక్స్ లో మైండ్ బ్లాక్.. బంపర్ కూడా చేంజ్
బ్రెజ్జా ఫేస్‌లిఫ్ట్ డిజైన్లో చాలా మార్పులు ప్రధానంగా ముందు భాగంలో కనిపిస్తాయి. కారుకు సరికొత్త ఫ్రంట్ గ్రిల్, కొత్త షేప్‌లో ఉండే ఫాగ్ ల్యాంప్ అసెంబ్లీ, మరింత ఆకర్షణీయమైన బంపర్, లావుపాటి సిల్వర్ ఫాక్స్ స్కిడ్ ప్లేట్‌ను జోడించనున్నారు. అయితే హెడ్‌లైట్లలో ఎలాంటి మార్పులు ఉండకపోవచ్చు. కారు సైడ్ ప్రొఫైల్‌ను పెంచడానికి కొత్త డిజైన్ అల్లాయ్ వీల్స్, వెనుక వైపు మోడిఫైడ్ బంపర్ కూడా ఉండబోతున్నాయి. అయితే ఈ ఫేస్‌లిఫ్ట్ అధికారిక లాంచ్ డేట్‌ను కంపెనీ ఇంకా అనౌన్స్ చేయలేదు.

Article Published On: Monday, June 1, 2026, 12:05 [IST]
English summary
New maruti brezza facelift set to disrupt the suv market with adas first underbody cng tank
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+