ఇండియాలో అత్యంత చౌకైన బెంజ్ కారు లాంచ్... అది కూడా ఎలక్ట్రిక్! ఒక్కసారి ఛార్జ్ చేస్తే 792 కి.మీలు
జర్మన్ లగ్జరీ కార్ల తయారీ ప్రపంచంలో ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న మెర్సిడెస్-బెంజ్ (Mercedes-Benz) భారత మార్కెట్లో కూడా తన ప్రాధాన్యాన్ని నిరంతరం పెంచుకుంటూ ముందుకు సాగుతోంది. కాలానికి అనుగుణంగా కొత్త టెక్నాలజీ, కొత్త డిజైన్‌లతో కార్లను విడుదల చేస్తూ, ప్రతి సెగ్మెంట్‌లోనూ తన ఉనికిని బలపరచడం ఈ బ్రాండ్ ప్రత్యేకత. గత కొన్నేళ్లుగా చూస్తే, బెంజ్ ఇండియాలో కొత్త మోడళ్లను తరచుగా పరిచయం చేస్తూ వినియోగదారుల ఆసక్తిని నిలబెట్టడంలో విజయవంతమైంది. ఇప్పుడు అదే జోష్‌తో కంపెనీ మరో కీలక అడుగు వేసింది. ఎలక్ట్రిక్ వాహనాల వైపు ప్రపంచం వేగంగా మారుతున్న నేపథ్యంలో, మెర్సిడెస్-బెంజ్ కూడా తన EV పోర్ట్‌ఫోలియోను విస్తరించడానికి సిద్ధమైంది.
ఈ క్రమంలో భారతదేశంలో కొత్తగా మెర్సిడెస్ బెంజ్ కొత్త CLA ఎలక్ట్రిక్ (Mercedes-Benz CLA Electric) కారును విడుదల చేస్తున్నట్లు ప్రకటించింది. ఈ కొత్త ఎలక్ట్రిక్ కారు ప్రత్యేకత ఏమిటంటే, ఇది మెర్సిడెస్ బ్రాండ్‌లోనే అత్యంత అందుబాటు ధరలో వచ్చే మోడల్‌గా నిలవడం. సుమారు రూ. 55 లక్షల ప్రారంభ ధరతో ఈ కారు మార్కెట్లోకి రావడం, లగ్జరీ సెగ్మెంట్‌లో ఒక పెద్ద మార్పు తీసుకురానుందని చెప్పాలి.

సాధారణంగా మెర్సిడెస్ కార్లు ఎక్కువ ధరలో ఉండే నేపథ్యంలో, ఈ ధర రేంజ్‌లో కొత్త EVను తీసుకురావడం ద్వారా కంపెనీ మరింత విస్తృతమైన కస్టమర్ బేస్‌ను టార్గెట్ చేస్తోంది. డిజైన్, ఫీచర్లు, అలాగే టెక్నాలజీ పరంగా కూడా ఈ CLA ఎలక్ట్రిక్ కారు ప్రీమియం ఫీల్‌ను అందించేలా ఉండబోతోందని అంచనాలు ఉన్నాయి. ముఖ్యంగా యువత, అలాగే లగ్జరీకి కొత్తగా అడుగుపెట్టాలనుకునే వినియోగదారులను ఆకర్షించేందుకు ఈ మోడల్ కీలక పాత్ర పోషించవచ్చు.
పర్ఫార్మెన్స్, రేంజ్ విషయంలో కొత్త CLA ఎలక్ట్రిక్ రెండు వేరియంట్లతో వినియోగదారులకు మంచి ఆప్షన్‌లను అందిస్తోంది. ఈ ఎలక్ట్రిక్ సెడాన్ 58kWh, 85kWh అనే రెండు బ్యాటరీ ప్యాక్‌లతో అందుబాటులోకి వస్తోంది. ఎంట్రీ-లెవల్ 'CLA 200 స్టాండర్డ్ రేంజ్' వేరియంట్‌లో 58kWh బ్యాటరీ ఇవ్వబడింది. ఈ బ్యాటరీ ఫుల్ ఛార్జ్‌పై గరిష్టంగా 542 కిలోమీటర్ల వరకు రేంజ్‌ను అందించగలదు. పవర్ పరంగా 224hp శక్తి, 335Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.

ఈ అవుట్‌పుట్‌తో కారు 0 నుంచి 100 kmph వేగాన్ని కేవలం 7.5 సెకన్లలో చేరుకోగలదు. అంటే రోజువారీ డ్రైవింగ్‌తో పాటు, స్పోర్టీ ఫీలింగ్ కూడా అందిస్తుంది. మరోవైపు, 'CLA 250+ లాంగ్ రేంజ్' వేరియంట్ మరింత శక్తివంతంగా ఉంటుంది. ఇందులో 85kWh పెద్ద బ్యాటరీ ప్యాక్ ఇవ్వబడింది. ఈ వేరియంట్ ఒకసారి ఛార్జ్ చేస్తే సుమారు 792 కిలోమీటర్ల వరకు రేంజ్ ఇవ్వగలదని Mercedes-Benz పేర్కొంటోంది.
పవర్ అవుట్‌పుట్ ఎక్కువగా 272hp వరకు పెరుగుతుంది, అయితే టార్క్ మాత్రం 335Nmగానే ఉంటుంది. ఈ వేరియంట్ వేగం పరంగా కూడా 0 నుంచి 100 kmph వేగాన్ని కేవలం 6.7 సెకన్లలో చేరుతుంది. ఈ కారులో బ్యాటరీ ఎంపికపై ఆధారపడి పనితీరు, రేంజ్ రెండూ మారుతున్నాయి. చిన్న బ్యాటరీ వేరియంట్ నగర వినియోగానికి సరిపోతే, పెద్ద బ్యాటరీ వేరియంట్ ఎక్కువ దూర ప్రయాణాలు చేసే వారికి అనుకూలంగా ఉంటుంది.

డిజైన్ పరంగా CLA ఎలక్ట్రిక్ ఒక ప్రీమియం విజువల్ ఎక్స్‌పీరియెన్స్‌ను అందించేలా రూపొందించబడింది. మెర్సిడెస్‌కు ప్రత్యేక గుర్తుగా నిలిచే 3-పాయింట్ స్టార్ లోగో ఈ కారులో ఎక్కడ చూసినా కనిపించేలా డిజైన్ చేశారు. కారు ముందు, వెనుక భాగాల్లో మాత్రమే కాదు, హెడ్‌లైట్లు, టెయిల్‌లైట్లలో కూడా ఈ స్టార్ ప్యాటర్న్‌ను బల్బుల రూపంలో ఉపయోగించడం ఈ మోడల్‌కు ప్రత్యేక ఆకర్షణను తీసుకొచ్చింది.
ఇందులో ముఖ్యంగా ఫ్రంట్ గ్రిల్ డిజైన్ మరింత హైలైట్‌గా నిలుస్తుంది. గ్రిల్ ప్రాంతంలో సుమారు 142 బ్యాక్‌లిట్ 3-పాయింట్ స్టార్‌లను అమర్చడం ద్వారా రాత్రివేళల్లో ఈ కారు మరింత స్టైలిష్‌గా కనిపించేలా చేశారు. ఈ కొత్త మోడల్, ఇంతకుముందు మార్కెట్లో ఉన్న CLAకు నెక్స్ట్-జెనరేషన్ వెర్షన్‌గా చెప్పొచ్చు. అయితే కేవలం డిజైన్ మాత్రమే కాకుండా, డైమెన్షన్స్ పరంగా కూడా మార్పులు చేశారు.


Click it and Unblock the Notifications