దేశం మొత్తం ఎదురు చూస్తోంది వీటి కోసమే.. అతి త్వరలో మూడు పవర్‌ ఫుల్ కార్లు రాబోతున్నాయ్

భారతదేశం ఇప్పుడు ప్రపంచ ఆటోమొబైల్ రంగంలో ఒక శక్తివంతమైన మార్కెట్‌గా ఎదిగింది. ప్రతి సంవత్సరం లక్షల సంఖ్యలో వాహనాలు అమ్ముడవుతుండటంతో, గ్లోబల్ తయారీదారుల దృష్టి మొత్తం భారతదేశంపైనే కేంద్రీకృతమవుతోంది. ముఖ్యంగా SUV సెగ్మెంట్‌లో డిమాండ్ భారీగా పెరుగుతోంది. ఈ నేపథ్యంలో 2026 సంవత్సరం వాహన తయారీదారులకు ఎంతో కీలకంగా మారింది. కొత్త మోడళ్లను ప్రవేశపెట్టి మార్కెట్‌లో తమ స్థానం మరింత బలపరచుకోవాలని కంపెనీలు సిద్ధమవుతున్నాయి. ఇప్పటికే దేశీయ మార్కెట్లో మూడు సరికొత్త మిడ్-సైజ్ SUVలు రాబోతున్నాయన్న వార్తలు వినియోగదారుల్లో ఉత్సాహాన్ని పెంచుతున్నాయి.

వాటిలో చెప్పుకోవాల్సింది కొత్త అప్‌డేటెడ్ వెర్షన్ టయోటా అర్బన్ క్రూయిజర్ లైనప్‌ను మరింత ఆకర్షణీయంగా మార్చేందుకు కొత్త డిజైన్, ఆధునిక ఫీచర్లు, మెరుగైన హైబ్రిడ్ టెక్నాలజీతో రావచ్చని సమాచారం. ఇక చాలా కాలంగా భారత మార్కెట్‌లోకి తిరిగి రానున్న SUVగా చర్చల్లో ఉన్నది రెనాల్ట్ డస్టర్. అదే సమయంలో, ఎలక్ట్రిక్ వాహనాల విప్లవంలో కీలక పాత్ర పోషించేందుకు సిద్ధమవుతోంది సియెర్రా ఈవీ. వీటి గురించి ఈ కథణంలో చూద్దాం.

New Mid Size Suv Launches Ahead Urban Cruiser Ebella Duster Sierra

Renault Duster: భారతీయ SUV మార్కెట్‌లో ఒకప్పుడు సంచలనం సృష్టించిన పేరు మళ్లీ రీ-ఎంట్రీకి సిద్ధమవుతోంది. అదే కొత్త తరం డస్టర్. మార్చి నెలలోనే ఈ కొత్త తరం డస్టర్ అధికారికంగా లాంచ్ కానుందని సమాచారం. దీని ధర రూ. 9.50 లక్షల నుంచి రూ. 19 లక్షల (ఎక్స్-షోరూమ్) మధ్య ఉండొచ్చని అంచనా వేస్తున్నారు. జనవరిలో ఇప్పటికే ఆవిష్కరించబడిన ఈ SUV, తన కొత్త రూపంతోనే అభిమానులను ఆకట్టుకుంది.

డిజైన్ పరంగా ఈసారి డస్టర్ మరింత బోల్డ్, మస్క్యులర్ స్టాన్స్‌తో వస్తోంది. ఫ్రంట్ గ్రిల్, షార్ప్ LED లైటింగ్, ఎత్తైన గ్రౌండ్ క్లియరెన్స్ కలిసి దీన్ని నిజమైన SUVలా కనిపించేలా చేస్తున్నాయి. ఇంజిన్ ఎంపికల విషయానికి వస్తే, కొత్త డస్టర్‌లో 1.8-లీటర్ స్ట్రాంగ్ హైబ్రిడ్, 1.3-లీటర్ టర్బో పెట్రోల్, 1.0-లీటర్ పెట్రోల్ ఇంజిన్ ఆప్షన్లు లభించనున్నాయి. మైలేజ్ కోరుకునే వారికి పవర్ కోరుకునే వారికి కూడా సరైన ఎంపికలు ఉన్నాయి.

New Mid Size Suv Launches Ahead Urban Cruiser Ebella Duster Sierra

Toyota Urban Cruiser EV: అర్బన్ క్రూయిజర్ ఎబెల్లా ఎలక్ట్రిక్ SUV సెగ్మెంట్‌లో కొత్త అధ్యాయానికి శ్రీకారం చుట్టేలా టయోటా నుంచి రాబోతుంది. ఇది మార్చిలో అమ్మకానికి వచ్చే అవకాశముంది. ధర రూ. 15.99 లక్షల నుంచి రూ. 20 లక్షల(ఎక్స్-షోరూమ్) మధ్య ఉండొచ్చని అంచనా. 49 kWh, 61 kWh బ్యాటరీ ప్యాక్ ఎంపికలతో వచ్చే SUV, ఫుల్ ఛార్జ్‌పై గరిష్టంగా 543 కి.మీ వరకు రేంజ్ అందించగలదు.

5-సీటర్ కాన్ఫిగరేషన్‌తో సౌకర్యవంతమైన ప్రయాణాన్ని అందిస్తుంది. క్యాబిన్‌లో 10.25-అంగుళాల టచ్‌స్క్రీన్, 10.1-అంగుళాల డిజిటల్ డ్రైవర్ డిస్‌ప్లే, పనోరమిక్ సన్‌రూఫ్, వెంటిలేటెడ్ సీట్లు, మల్టీ USB పోర్ట్‌లు ఉన్నాయి. భద్రత కోసం 7 ఎయిర్‌బ్యాగ్‌లు, లెవెల్-2 ADAS, ESC, ఆల్-వీల్ బ్రేక్‌లు అందుబాటులో ఉంటాయి. మొత్తంగా స్టైల్, రేంజ్, సేఫ్టీ కలిసి ప్యాకేజ్‌గా ఇది నిలవనుంది.

New Mid Size Suv Launches Ahead Urban Cruiser Ebella Duster Sierra

Tata Sierra EV: ఎలక్ట్రిక్ SUV సెగ్మెంట్‌లో భారీ అంచనాల మధ్య టాటా మోటార్స్ నుంచి రాబోతున్న Tata Sierra EV మార్చిలో మార్కెట్లోకి అడుగుపెట్టనుంది. దీని ధర రూ. 20 లక్షల నుంచి రూ. 25 లక్షల (ఎక్స్-షోరూమ్) మధ్య ఉండొచ్చని అంచనా. ప్రామాణిక సియెర్రా స్టైల్‌ను కొనసాగిస్తూ, పసుపు, ఎరుపు, వెండి, ఆకుపచ్చ, మింట్ గ్రే, ప్రిస్టైన్ వైట్ వంటి ఆకర్షణీయ రంగుల్లో లభిస్తుంది.

65 kWh, 75 kWh బ్యాటరీ ప్యాక్‌లతో వచ్చే ఈ SUV, పూర్తి ఛార్జ్‌పై సుమారు 538 నుంచి 627 కి.మీ వరకు రేంజ్ అందించగలదని చెబుతున్నారు. 5-సీటర్ లేఅవుట్‌తో పాటు ట్రిపుల్ స్క్రీన్ సెటప్, 12-స్పీకర్ JBL సౌండ్ సిస్టమ్ వంటి ప్రీమియమ్ ఫీచర్లు ఉన్నాయి. భద్రత కోసం 6 ఎయిర్‌బ్యాగ్‌లు, లెవెల్-2 ADAS, 360-డిగ్రీ కెమెరా వంటి ఆధునిక సేఫ్టీ టెక్నాలజీలు అందుబాటులో ఉంటాయి.

More from DriveSpark

Article Published On: Monday, February 23, 2026, 16:33 [IST]
English summary
New mid size suv launches ahead urban cruiser ebella duster sierra
Read more on: #auto news #india
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+