భారత మార్కెట్లోకి నిస్సాన్ టెక్టాన్ ఎస్‌యూవీ ఎంట్రీ.. లీటర్ పెట్రోల్‌కు ఎన్ని కిలోమీటర్ల మైలేజ్ ఇస్తుందంటే

భారతదేశంలో మిడ్ సైజ్ suvలకు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. దీన్ని దృష్టిలో ఉంచుకుని ప్రముఖ కార్ల తయారీ సంస్థ నిస్సాన్ ఇండియా (Nissan India) తన సరికొత్త మోడల్ నిస్సాన్ టెక్టాన్ (Nissan Tekton SUV)ను దేశీయ మార్కెట్లోకి అధికారికంగా విడుదల చేసింది. ఈ సరికొత్త కారు లాంచ్‌తో పాటు దీనికి సంబంధించిన మైలేజ్ వివరాలను, ఇంజన్ సామర్థ్యాన్ని కంపెనీ వెల్లడించింది.

ఈ కారుకు సంబంధించిన అత్యంత కీలకమైన విషయం ఏంటంటే, ఇది గ్లోబల్ క్రాష్ టెస్టుల్లో అత్యుత్తమ 5-స్టార్ సేఫ్టీ రేటింగ్ సొంతం చేసుకుంది. భద్రతతో పాటు మైలేజ్ విషయంలోనూ ఈ కారు కస్టమర్లను ఎంతగానో ఆకట్టుకునేలా రూపొందింది.

New Nissan Tekton SUV Launched In India Price Powerful Turbo Engine Mileage Explained

కొత్త నిస్సాన్ టెక్టాన్ ఎస్‌యూవీని కంపెనీ రెండు రకాల టర్బో-పెట్రోల్ ఇంజన్ ఆప్షన్లతో తీసుకువచ్చింది. ఇందులో మొదటిది ఎంట్రీ లెవల్ 1.0 లీటర్, 3-సిలిండర్ టర్బో పెట్రోల్ ఇంజన్. ఇది 100 hp పవర్, 166 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ప్రస్తుతం ఈ వేరియంట్ కేవలం 6-స్పీడ్ మ్యాన్యువల్ గేర్‌బాక్స్‌తో మాత్రమే అందుబాటులోకి వచ్చింది.

ఇక మరింత పవర్‌ఫుల్ పర్ఫార్మెన్స్ కోరుకునే వారి కోసం 1.3 లీటర్, 3-సిలిండర్ టర్బో పెట్రోల్ ఇంజన్‌ను అందించారు. ఇది ఏకంగా 163 hp పవర్, 280 Nm గరిష్ట టార్క్‌ను జనరేట్ చేస్తుంది. దీనిని 6-స్పీడ్ మ్యాన్యువల్ లేదా 6-స్పీడ్ డ్యూయల్-క్లచ్ ఆటోమేటిక్ (DCT) గేర్‌బాక్స్‌తో కొనుగోలు చేయవచ్చు.

New Nissan Tekton SUV Launched In India Price Powerful Turbo Engine Mileage Explained

ఈ కారు మైలేజ్ విషయానికి వస్తే, 1.0 లీటర్ టర్బో-పెట్రోల్ ఇంజన్ వేరియంట్ లీటరుకు గరిష్టంగా 19.4 కిలోమీటర్ల మైలేజ్ ఇస్తుందని కంపెనీ క్లెయిమ్ చేస్తోంది. అలాగే ఎక్కువ పవర్ ఉన్న 1.3 లీటర్ టర్బో-పెట్రోల్ ఇంజన్ విషయానికొస్తే.. ఇది డ్యూయల్-క్లచ్ ఆటోమేటిక్ (DCT) గేర్‌బాక్స్‌తో 18.5 కిలోమీటర్ల మైలేజ్ ఇస్తుంది.

ఇదే ఇంజన్ మ్యాన్యువల్ గేర్‌బాక్స్ ఆప్షన్‌తో లీటరుకు 17.8 కిలోమీటర్ల మైలేజ్ ఇస్తుంది. నిజానికి ఈ కారు ఇంజన్, గేర్‌బాక్స్ సెటప్ అంతా రెనాల్ట్ డస్టర్ (Renault Duster) కారును పోలి ఉంటాయి. అందుకే ఈ రెండింటి మైలేజ్ లెక్కలు కూడా దాదాపు ఒకేలా ఉన్నాయి. అయితే ప్రస్తుతం ఈ కారులో CNG ఆప్షన్ అందుబాటులో లేదు.

ధరల విషయానికి వస్తే కొత్త నిస్సాన్ టెక్టాన్ బేస్ మోడల్ ప్రారంభ ఎక్స్-షోరూమ్ ధర రూ. 10.49 లక్షలుగా ఉంది. కాగా దీని టాప్-ఎండ్ మోడల్ ధర రూ. 18.59 లక్షల వరకు ఉంటుంది. ఇది మార్కెట్లోని రెనాల్ట్ డస్టర్ కంటే దాదాపు రూ. 10,000 తక్కువ కావడం గమనార్హం.

ఈ కారు మార్కెట్లో ఉన్న విసియా, విసియా ప్లస్, అసెంటా, ఎన్-కనెక్టా, టెక్నా, టెక్నా ప్లస్ వంటి రకరకాల వేరియంట్లలో లభిస్తుంది. ఇండియన్ మార్కెట్లో ఈ నిస్సాన్ టెక్టాన్ ఎస్‌యూవీ.. హ్యుందాయ్ క్రెటా, కియా సెల్టోస్, మారుతి గ్రాండ్ విటారా, మారుతి విక్టోరిస్, టాటా సియెర్రా, హోండా ఎలివేట్, స్కోడా కుషాక్, ఫోక్స్‌వ్యాగన్ టైగూన్ వంటి పాపులర్ కార్లకు గట్టి పోటీ ఇవ్వనుంది.

Article Published On: Friday, July 10, 2026, 11:04 [IST]
English summary
New nissan tekton suv launched in india price powerful turbo engine mileage explained
Read more on: #nissan #new launches
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+