2026లో బెస్ట్ ఫ్యామిలీ SUV ఏది? డస్టర్ లేదా విక్టోరిస్? ఒకటి లెజెండ్ రీ ఎంట్రీ.. మరొకటి కొత్త ఛాలెంజర్
కొత్త తరం 2026 రెనాల్ట్ డస్టర్ (Renault Duster SUV ఇటీవలే అధికారికంగా ఆవిష్కరించబడింది. ఒకప్పుడు భారత మార్కెట్‌లో డస్టర్ సృష్టించిన క్రేజ్‌ను మళ్లీ తీసుకురావాలనే లక్ష్యంతో ఈ కొత్త జనరేషన్ మోడల్‌ను రెనాల్ట్ డిజైన్ చేసింది. మస్క్యులర్ లుక్, ఆధునిక టెక్నాలజీ, అప్‌డేటెడ్ ఫీచర్లతో ఇది మళ్లీ SUV సెగ్మెంట్‌లో హాట్ టాపిక్‌గా మారుతోంది. ఇదే సమయంలో, ఈ కొత్త డస్టర్‌కు మారుతి సుజుకి విక్టోరిస్ (maruti suzuki victoris) నేరుగా పోటీ ఇవ్వనుంది. మారుతి బ్రాండ్ నమ్మకం, స్మార్ట్ హైబ్రిడ్ టెక్నాలజీ, ప్రీమియం ఫీచర్లతో విక్టోరిస్ కూడా మార్కెట్‌లో బలమైన ఛాలెంజర్‌గా నిలవబోతోంది. ఈ రెండు SUVలు డిజైన్ పరంగా చాలా ఆకట్టుకునేలా ఉన్నాయి. ఇక్కడ మనం ఈ SUVల ధర, పనితీరు ఇతర వివరాలను పోల్చడం జరిగింది.
ధర విషయానికి వస్తే, కొత్త రెనాల్ట్ డస్టర్ సరసమైన ధరతో మార్కెట్‌లోకి రావొచ్చని అంచనా వేస్తున్నారు. సుమారు రూ. 9.50 లక్షల నుంచి రూ. 19 లక్షల వరకు ఉండొచ్చు. మరోవైపు, మారుతి విక్టోరిస్ ధర రూ. 10.50 లక్షల నుంచి రూ. 19.99 లక్షల వరకు (ఎక్స్-షోరూమ్) ఉండనుంది. ఈ పోలికలో చూస్తే, ధర పరంగా డస్టర్ విక్టోరిస్ కంటే కొంచెం చౌకగా ఉండే అవకాశం కనిపిస్తోంది.

డస్టర్‌కు స్టైలిష్ LED హెడ్‌ల్యాంప్‌లు, LED DRLలు, LED టెయిల్‌లైట్లు, 18-అంగుళాల అల్లాయ్ వీల్స్ ఉన్నాయి. కలర్స్‌లో పెర్ల్ వైట్, మూన్‌లైట్ సిల్వర్, స్టీల్త్ బ్లాక్, రివర్ బ్లూ, సన్‌సెట్ రెడ్ ఉంటాయి. విక్టోరిస్ హైక్వాలిటీ LED హెడ్‌ల్యాంప్‌లు, LED DRLలు, LED టెయిల్‌ల్యాంప్‌లు, 18-అంగుళాల అల్లాయ్ వీల్స్ ఉండగా, స్ప్లెండిడ్ సిల్వర్, ఎటర్నల్ బ్లూ, సిజ్లింగ్ రెడ్, బ్లూయిష్ బ్లాక్, మాగ్మా గ్రే, మిస్టిక్ గ్రీన్ కలర్స్‌లో లభిస్తుంది.
పనితీరు పరంగా చూస్తే, ఈ రెండు SUVలు శక్తివంతమైన ఇంజిన్ ఆప్షన్లతో వస్తున్నాయి. రెనాల్ట్ డస్టర్‌లో 1.8-లీటర్ స్ట్రాంగ్ హైబ్రిడ్ (పెట్రోల్ + ఎలక్ట్రిక్), 1.3-లీటర్ టర్బో పెట్రోల్, 1.0-లీటర్ పెట్రోల్ ఇంజిన్ ఆప్షన్లు ఉన్నాయి. వీటితో పాటు 5-స్పీడ్ మాన్యువల్, 6-స్పీడ్ మాన్యువల్, 6-స్పీడ్ ఆటోమేటిక్, 8-స్పీడ్ DHT గేర్‌బాక్స్‌ల ఎంపికలు లభిస్తాయి. మైలేజ్ పరంగా ఇది 18 నుంచి 22 kmpl వరకు ఇస్తుందని చెబుతున్నారు.

ఇక మారుతి విక్టోరిస్ విషయానికి వస్తే, ఇందులో 1.5-లీటర్ మైల్డ్ హైబ్రిడ్ పెట్రోల్, 1.5-లీటర్ స్ట్రాంగ్ హైబ్రిడ్ (పెట్రోల్ + ఎలక్ట్రిక్), 1.5-లీటర్ CNG ఇంజిన్ ఆప్షన్లు ఉన్నాయి. ఇవి 5-స్పీడ్ మాన్యువల్, 6-స్పీడ్ ఆటోమేటిక్, e-CVT గేర్‌బాక్స్‌తో జతచేయబడ్డాయి. మైలేజ్ విషయంలో విక్టోరిస్ ముందుంటుంది, ఇది సుమారు 21.06 నుంచి 28.65 kmpl వరకు ఇంధన సామర్థ్యాన్ని అందిస్తుంది.
సీటింగ్ సామర్థ్యం & బూట్ స్పేస్ విషయానికి వస్తే, ఈ రెండు SUVలు 5-సీటర్ కాన్ఫిగరేషన్‌లోనే అందుబాటులో ఉంటాయి. ప్రయాణీకులకు సరిపడా స్పేస్, కంఫర్ట్ రెండూ ఉంటాయి. అయితే బూట్ స్పేస్‌లో పెద్ద తేడా కనిపిస్తుంది. రెనాల్ట్ డస్టర్ భారీగా 700 లీటర్ల బూట్ స్పేస్‌ను అందిస్తే, విక్టోరిస్‌లో 373 లీటర్ల బూట్ స్పేస్ మాత్రమే ఉంటుంది. లగేజీ ఎక్కువగా తీసుకెళ్లే వారికి ఇది కీలక అంశంగా మారుతుంది.

ఫీచర్లు, భద్రతా లక్షణాల విషయంలో ఈ రెండు కార్లు అత్యాధునిక టెక్నాలజీతో నిండి ఉన్నాయి. డస్టర్‌లో 10-అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, సన్‌రూఫ్, డ్యూయల్-జోన్ క్లైమేట్ కంట్రోల్, వైర్‌లెస్ ఫోన్ ఛార్జర్ లభిస్తాయి. భద్రత పరంగా 6 ఎయిర్‌బ్యాగులు, లెవల్-2 ADAS, TPMS, ఆల్-వీల్ డిస్క్ బ్రేక్‌లు ఉన్నాయి.
ఇక విక్టోరిస్ ఫీచర్ల పరంగా మరింత లగ్జరీ ఫీల్ ఇస్తుంది. ఇందులో 10.1-అంగుళాల టచ్‌స్క్రీన్, డిజిటల్ డ్రైవర్ డిస్‌ప్లే, వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు, పనోరమిక్ సన్‌రూఫ్, కప్ హోల్డర్లు, 64-రంగుల యాంబియంట్ లైటింగ్ వంటి ఫీచర్లు ఉన్నాయి. భద్రత కోసం 6 ఎయిర్‌బ్యాగ్‌లు, లెవల్-2 ADAS, TPMSతో పాటు అదనంగా 360-డిగ్రీ కెమెరా కూడా అందిస్తుంది.


Click it and Unblock the Notifications








