మధ్యతరగతి జేబుకు సరితూగే కారు లాంచ్.. ధర చూస్తే వెంటనే కొనాలనిపిస్తుంది!

భారత మార్కెట్లో తొలి కారు కొనుగోలు చేసే వినియోగదారులను లక్ష్యంగా చేసుకుని రెనాల్ట్ ఇండియా (Renault India) తన అత్యంత ప్రజాదరణ పొందిన హ్యాచ్‌బ్యాక్ కొత్త రెనాల్ట్ క్విడ్ (New Renault Kwid)ను అధికారికంగా విడుదల చేసింది. ఫ్రెంచ్ ఆటోమొబైల్ దిగ్గజం రెనాల్ట్ గ్రూప్‌కు పూర్తిగా చెందిన అనుబంధ సంస్థ అయిన రెనాల్ట్ ఇండియా, ఈ కొత్త మోడల్‌లో డిజైన్, వేరియంట్లు, ధరల విషయంలో పలు కీలక మార్పులు చేసింది. ముఖ్యంగా మొదటిసారి కారు కొనుగోలు చేసే వారికి ఎంపికను మరింత సులభతరం చేయడమే ఈ అప్‌డేట్ ప్రధాన ఉద్దేశమని కంపెనీ తెలిపింది.

కొత్త తరం కొనుగోలుదారుల అభిరుచులను దృష్టిలో పెట్టుకుని, ఈ మోడల్‌లో రెనాల్ట్ తన తాజా బ్రాండ్ ఐడెంటిటీని పరిచయం చేసింది. అలాగే, గతంలో ఉన్న అనేక వేరియంట్లకు బదులుగా ఇప్పుడు ఎవల్యూషన్ (Evolution), క్లైంబర్ (Climber) అనే రెండు వేరియంట్లలో మాత్రమే ఈ కారును అందిస్తోంది. దీంతో వినియోగదారులు తమ అవసరానికి తగిన మోడల్‌ను సులభంగా ఎంపిక చేసుకునే అవకాశం ఉంటుంది.

New Renault Kwid 2026 Launched In India With Two Variants Full Details

కొత్త రెనాల్ట్ క్విడ్ ప్రారంభ ఎక్స్-షోరూమ్ ధర రూ.4,52,900 (మాన్యువల్)గా నిర్ణయించారు. AMT ధర రూ.4,89,900. టాప్-ఎండ్ క్లైంబర్ మాన్యువల్ వేరియంట్ ధర రూ.5,14900, అదే ఆటోమేటిక్ వేరియంట్ ధర రూ.5,60,900. అయితే క్లైంబర్ వేరియంట్‌ను ఆన్‌లైన్‌లో కొనుగోలు చేసే వారికి రూ.15,000 ప్రత్యేక ప్రయోజనాలు అందిస్తున్నారు. దీంతో పూర్తి ఫీచర్లతో కూడిన క్లైంబర్ వేరియంట్‌ను రూ.4.99 లక్షల ధరలో సొంతం చేసుకునే అవకాశం ఉంది.

2015లో తొలిసారిగా మార్కెట్లోకి వచ్చిన రెనాల్ట్ క్విడ్, ఎంట్రీ-లెవల్ హ్యాచ్‌బ్యాక్ సెగ్మెంట్‌లో కొత్త ట్రెండ్‌ను సృష్టించింది. SUV తరహా డిజైన్, ఆధునిక ఫీచర్లతో సంప్రదాయ చిన్న కార్లకు భిన్నమైన అనుభూతిని అందించింది. ఇప్పుడు తీసుకొచ్చిన తాజా అప్‌డేట్‌తో డిజైన్‌ను మరింత ఆధునికంగా మార్చడంతో పాటు, వేరియంట్ల సంఖ్యను తగ్గించి కొనుగోలు ప్రక్రియను కూడా మరింత సులభతరం చేసింది.

New Renault Kwid 2026 Launched In India With Two Variants Full Details

ఫీచర్ల విషయానికి వస్తే, కొత్త రెనాల్ట్ క్విడ్ తన SUV తరహా స్టైలింగ్‌ను కొనసాగిస్తోంది. 184 మిల్లీమీటర్ల గ్రౌండ్ క్లియరెన్స్‌తో పాటు, 279 లీటర్ల బూట్ స్పే‌స్‌ను అందిస్తోంది. భద్రత కోసం 17 స్టాండర్డ్ సేఫ్టీ ఫీచర్లు, డ్యూయల్ ఫ్రంట్ ఎయిర్‌బ్యాగ్స్, ABSతో EBD, సీట్‌బెల్ట్ రిమైండర్లు వంటి సదుపాయాలు అందుబాటులో ఉన్నాయి. అంతేకాకుండా 8-అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ కూడా ఉంది.

ఇంకా, ఆపిల్ కార్‌ప్లే, ఆండ్రాయిడ్ ఆటో, పూర్తి డిజిటల్ LED ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, రియర్ వ్యూ కెమెరా, USB, బ్లూటూత్ కనెక్టివిటీ వంటి ఆధునిక ఫీచర్లు కూడా ఇందులో ఉన్నాయి. పనితీరు కోసం 1.0-లీటర్ పెట్రోల్ ఇంజిన్‌ను అందించారు. ఈ ఇంజిన్‌కు 5-స్పీడ్ మాన్యువల్, ఈజీ-ఆర్ AMT గేర్‌బాక్స్ ఎంపికలు ఉన్నాయి. AMT వేరియంట్లలో రోటరీ డయల్ గేర్ సెలెక్టర్‌ను అందించడం వల్ల డ్రైవింగ్ మరింత సౌకర్యవంతంగా ఉంటుంది.

New Renault Kwid 2026 Launched In India With Two Variants Full Details

అలాగే రిమోట్ కీ లెస్ ఎంట్రీ, సెంట్రల్ లాకింగ్, పవర్ విండోలు, పవర్ స్టీరింగ్, డ్యూయల్-టోన్ ఇంటీరియర్, క్లైంబర్‌కు ప్రత్యేక ఎక్స్‌టీరియర్ స్టైలింగ్, వీల్ ఆర్చ్ క్లాడింగ్ వంటి అంశాలు మరింత ఆకర్షణను తీసుకొచ్చాయి. కొత్త రెనాల్ట్ క్విడ్ ఇప్పటికే దేశవ్యాప్తంగా ఉన్న అన్ని రెనాల్ట్ డీలర్‌షిప్‌లలో అందుబాటులోకి వచ్చింది. అలాగే కంపెనీ అధికారిక ఆన్‌లైన్ సేల్స్ ప్లాట్‌ఫామ్ ద్వారా కూడా ఈ కారును బుక్ చేసుకునే అవకాశం కల్పించింది.

Article Published On: Friday, July 3, 2026, 14:13 [IST]
English summary
New renault kwid 2026 launched in india with two variants full details
Read more on: #renault #new launches #india
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+