పెద్ద ఫ్యామిలీలు ఈ కారు కొనచ్చు, రూ.5.81 లక్షలకే 7 సీటర్.. కొత్త అప్‌డేట్స్‌తో మరింత పవర్‌ఫుల్
రెనాల్ట్ ఇండియా (Renault India) మరోసారి ఫ్యామిలీ కార్ సెగ్మెంట్‌లో తన సత్తా చూపించేందుకు ముందుకొచ్చింది. తక్కువ బడ్జెట్‌లో ఎక్కువ స్పేస్, మంచి ప్రాక్టికాలిటీ కావాలనుకునే వినియోగదారులను దృష్టిలో పెట్టుకుని 2026 ట్రైబర్ (Triber)ను మరింత ఆకర్షణీయంగా తీసుకొచ్చింది. ఇప్పటికే భారత మార్కెట్లో మంచి ఆదరణ పొందిన రెనాల్ట్ ట్రైబర్ ఇప్పుడు కొత్త అప్‌డేట్స్‌తో మరింత ఉపయోగకరంగా మారింది. ఈ కొత్త మోడల్‌లో ఫ్యామిలీ అవసరాలను దృష్టిలో పెట్టుకుని డిజైన్ నుంచి ఫీచర్ల వరకు చిన్నచిన్న మార్పులు చేశారు. బయట నుంచి చూస్తే స్టైలిష్‌గా కనిపించడమే కాకుండా, లోపలికి వెళ్తే విశాలమైన క్యాబిన్ అనుభూతి ఇస్తుంది. ముఖ్యంగా సీటింగ్ అరేంజ్‌మెంట్ విషయంలో ట్రైబర్ ప్రత్యేకత అలాగే కొనసాగింది.
అవసరానికి అనుగుణంగా సీట్లను మార్చుకునే సౌలభ్యం ఇంకా మెరుగైంది. ఇక ఫీచర్ల విషయానికి వస్తే, కొత్త సదుపాయాలు జోడించారు. కొత్తగా అప్‌డేట్ చేసిన ట్రైబర్ ఇప్పుడు ఫ్యామిలీ అవసరాలు, బడ్జెట్, ఫీచర్లను బట్టి ఎంచుకునేలా ఆథెంటిక్, ఎవల్యూషన్, టెక్నో, ఎమోషన్ అనే నాలుగు ట్రిమ్‌లలో లభిస్తుంది. ప్రారంభ ధర సుమారు రూ.5.80 లక్షల నుంచి మొదలై, టాప్ ఎమోషన్ వేరియంట్ వరకు వెళ్తూ రూ.8.48 లక్షల (ఎక్స్-షోరూమ్) వరకు ఉంటుంది.

ఈ ధరల రేంజ్ చూస్తే, తక్కువ బడ్జెట్‌లో మంచి MPV కోసం చూస్తున్న వారికి ఇది ఇంకా ఆకర్షణీయంగా మారిందని చెప్పాలి. వేరియంట్ల మధ్య తేడాను కేవలం పేర్లతో కాకుండా, ఫీచర్లలో స్పష్టంగా కనిపించేలా తయారీదారు ప్లాన్ చేసింది. బేసిక్ అవసరాల కోసం ఆథెంటిక్ వేరియంట్ సరిపోతే, ఎవల్యూషన్ ట్రిమ్ నుంచి క్రమంగా కంఫర్ట్, కన్‌వీనియన్స్ పెరుగుతూ వస్తాయి.
స్టీరింగ్ మౌంటెడ్ కంట్రోల్స్, డే/నైట్ IRVM, వెనుక క్యాబిన్ ల్యాంప్ వంటి ఉపయోగకరమైన ఫీచర్లు రోజువారీ డ్రైవింగ్‌ను మరింత సులభం చేస్తాయి. టెక్నో వేరియంట్‌లోకి వెళ్లగానే కార్ లోపలి అనుభవం మరో లెవెల్‌కు చేరుతుంది. డ్రైవర్ ఆర్మ్‌రెస్ట్, ఎత్తు సర్దుబాటు చేసుకునే సీటు వంటి సౌకర్యాలు ఉంటాయి. అదనంగా వెనుక డిఫాగర్, మూడో వరుస పవర్ సాకెట్, ఫ్రంట్ ట్వీటర్లు, పవర్డ్ ORVMలు వంటి ఫీచర్లు ఈ వేరియంట్‌లో ఆకట్టుకుంటాయి.

ఇక టాప్ ఎమోషన్ ట్రిమ్ విషయానికి వస్తే, ఈ సెగ్మెంట్‌లోనే మొదటిసారిగా ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్‌ను అందించడం ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. ఇది కేవలం లగ్జరీ ఫీల్ మాత్రమే కాకుండా, అన్ని సీజన్లలో కూడా కంఫర్ట్‌ను పెంచే అంశం. ముఖ్యంగా, ఇన్ని ఫీచర్లను జోడించినప్పటికీ పెద్దగా ధర పెంపు లేకుండా అందించడం ఈ MPVని విలువైన ఎంపికగా నిలబెడుతోంది. ప్రతి వేరియంట్‌కు ప్రత్యేకమైన పాత్ర ఉండేలా కొత్త ట్రైబర్‌ను తీర్చిదిద్దారు.
క్యాబిన్‌లోకి అడుగుపెడితే, పెద్దగా మారిపోయిందనే ఫీలింగ్ రాకపోయినా, చిన్నచిన్న అప్‌డేట్స్ వల్ల అనుభవం మాత్రం మరింత మెరుగైంది. డ్యూయల్-టోన్ డాష్‌బోర్డ్ డిజైన్ కార్ లోపలికి కొత్త లుక్ తీసుకువస్తే, ఫ్లోటింగ్ 8-ఇంచ్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ ఆధునిక టచ్‌ను ఇస్తుంది. ముఖ్యంగా వైర్‌లెస్ ఆండ్రాయిడ్ ఆటో, ఆపిల్ కార్‌ప్లే సపోర్ట్ ఉండటం వల్ల మొబైల్ కనెక్టివిటీ మరింత సులభం అయింది.

ఇంజిన్ విషయానికి వస్తే, ఈ మోడల్‌లో కూడా అదే నమ్మకమైన 1.0-లీటర్, 3-సిలిండర్ నాచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ యూనిట్ కొనసాగించారు. 72 PS పవర్, 96 Nm టార్క్‌ను అందించే ఈ ఇంజిన్ నగర ప్రయాణాలకు సరిపడే పనితీరును ఇస్తుంది. డ్రైవింగ్ స్టైల్‌ను బట్టి మాన్యువల్ లేదా AMT గేర్‌బాక్స్ ఎంపిక ఉండటం కూడా వినియోగదారులకు సౌలభ్యంగా ఉంటుంది. భద్రత విషయంలో కూడా ఈసారి మరింత శ్రద్ధ తీసుకుంది.


Click it and Unblock the Notifications