ఫ్యామిలీతో ట్రిప్స్ వేయడానికి సరైన టాటా కారు.. ధర, మైలేజీ, టాప్ ఫీచర్స్ పూర్తి వివరాలు
టాటా మోటార్స్ భారత ఆటోమొబైల్ మార్కెట్లో మరో కీలకమైన అడుగు వేసింది. చాలా కాలంగా కస్టమర్లు ఎదురుచూస్తున్న తన ఫ్లాగ్‌షిప్ SUV అయిన టాటా హారియర్ ను తొలిసారిగా పెట్రోల్ ఇంజిన్‌తో పరిచయం చేసింది. ఇప్పటివరకు డీజిల్ ఇంజిన్‌కే పరిమితమైన హారియర్, ఇప్పుడు పెట్రోల్ ఆప్షన్ రావడంతో మరింత విస్తృతమైన కస్టమర్ వర్గాన్ని ఆకర్షించే అవకాశం ఏర్పడింది. ముఖ్యంగా నగరాల్లో రోజువారీ వినియోగం, తక్కువ శబ్దం, స్మూత్ డ్రైవింగ్ అనుభవాన్ని కోరుకునే వారికి ఈ కొత్త పెట్రోల్ హారియర్ ఒక మంచి ఎంపికగా నిలుస్తోంది. వాస్తవానికి, టాటా హారియర్ 2019లో భారత మార్కెట్లో డీజిల్ ఇంజిన్‌తోనే అరంగేట్రం చేసింది. అయితే ఇప్పుడు కస్టమర్ల డిమాండ్‌కు అనుగుణంగా పెట్రోల్ హారియర్ లాంచ్ చేసింది. ఈ కారు గురించిన వివరాలు ఈ కథనంలో.
ధర: ధర విషయానికి వస్తే, టాటా మోటార్స్ హారియర్ పెట్రోల్ వేరియంట్‌ను ఈ విభాగంలో పోటీగా ఉండే ప్రైస్ ట్యాగ్‌తో మార్కెట్లోకి తీసుకొచ్చింది. ఈ SUV ధర రూ. 12.89 లక్షల నుంచి (ఎక్స్-షోరూమ్) ప్రారంభమవుతుంది. ఈ ధరను పరిశీలిస్తే, టాటా తన ఫ్లాగ్‌షిప్ హారియర్‌ను కేవలం డీజిల్‌కు మాత్రమే పరిమితం చేయకుండా, పెట్రోల్ సెగ్మెంట్‌లో కూడా బలమైన పోటీదారుగా నిలబెట్టాలనే స్పష్టమైన ఉద్దేశంతో ముందుకు వచ్చినట్లు అర్థమవుతోంది.

డిజైన్: డిజైన్ పరంగా హారియర్ ఎప్పటిలాగే బోల్డ్‌గాను, ప్రీమియం లుక్‌తోను ఆకట్టుకుంటుంది. ముందు ఉన్న పెద్ద మరియు ఆకర్షణీయమైన గ్రిల్ SUVకి బలమైన రోడ్ ప్రెజెన్స్‌ను ఇస్తుంది. దీనికి జతగా స్టైలిష్ LED హెడ్‌లైట్లు, షార్ప్ LED DRLs హారియర్‌ను ఆధునికంగా కనిపించేలా చేస్తాయి. వెనుక భాగంలో సిగ్నేచర్ LED టెయిల్ లైట్లు, మధ్యలో టాటా లోగోతో కలిసి కారు వెనుక నుంచి చూసినా ఒక ప్రీమియం ఫీలింగ్‌ను కలిగిస్తాయి.
సైడ్ ప్రొఫైల్‌లో చూస్తే, షార్క్ ఫిన్ యాంటెన్నా, స్టైలిష్ రూఫ్ రెయిల్స్, సిల్వర్ కలర్ స్కఫ్ ప్లేట్లు SUVకి స్పోర్టీ టచ్‌ను జోడిస్తాయి. 18-అంగుళాల గ్లోస్ బ్లాక్ అల్లాయ్ వీల్స్ హారియర్ స్టాన్స్‌ను మరింత మస్క్యులర్‌గా చూపిస్తాయి. ఇవన్నీ కలిసి ఈ SUVను రోడ్డుపై ప్రత్యేకంగా కనిపించేలా చేస్తాయి. ది 5 సీట్ల SUV అయినప్పటికీ, క్యాబిన్‌లో మంచి స్పేస్‌ను అందిస్తుంది. ముఖ్యంగా బూట్ స్పేస్ విషయంలో హారియర్ మెప్పిస్తుంది.

ఇంజిన్: ఇంజిన్ విషయానికి వస్తే, పెట్రోల్ వేరియంట్‌లో పూర్తిగా కొత్తగా అభివృద్ధి చేసిన 1.5 లీటర్ హైపెరియన్ టర్బో-GDi పెట్రోల్ ఇంజిన్ ను అందించారు. ఈ ఇంజిన్ గరిష్టంగా 170 PS పవర్, 280 Nm పీక్ టార్క్ ను ఉత్పత్తి చేయగలదు. ఈ పవర్ ఫిగర్లు చూస్తే, హారియర్ పెట్రోల్ వేరియంట్ కేవలం సిటీ డ్రైవింగ్‌కే కాదు, హైవేల్లో కూడా మంచి పనితీరును అందించేలా రూపొందించినట్లు అర్థమవుతోంది.
ట్రాన్స్‌మిషన్ పరంగా, ఈ ఇంజిన్‌కు 6-స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్‌తో పాటు 6-స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ ఆప్షన్లు అందుబాటులో ఉంటాయి. దీనివల్ల డ్రైవింగ్ స్టైల్‌ను బట్టి వినియోగదారులు తమకు అనుకూలమైన వేరియంట్‌ను ఎంచుకునే అవకాశం కలుగుతుంది. ముఖ్యంగా ఆటోమేటిక్ వేరియంట్ నగరాల్లో ట్రాఫిక్‌లో డ్రైవ్ చేసే వారికి మరింత సౌకర్యంగా ఉండనుంది. మైలేజీ విషయానికి వస్తే, కొత్త హారియర్ పెట్రోల్ వేరియంట్ సుమారు 16.8 kmpl వరకు మైలేజీ ఇవ్వగలదని అంచనా.

ఫీచర్స్: ఈ కారులో డజన్ల కొద్ది అధునాతన ఫీచర్స్ ఉంటాయి. లోపల టెల్లి-స్టార్ట్‌తో విజన్ సింక్ మెమరీ ORVM, క్లైమేట్ సింక్‌తో ఆటో రివర్స్ డిప్, Samsung NeoQLEDతో నడిచే 14.5-అంగుళాల సినిమాటిక్ ఇన్ఫోటైన్‌మెంట్ డిస్‌ప్లే, DVRతో విజన్-X E-IRVM, ఆటో రివర్స్ డిప్‌తో విజన్ సింక్ మెమరీ ORVM, క్లియర్‌వ్యూ డ్యూయల్ కెమెరా వాషర్, డాల్బీ అట్మోస్ ఆడియోతో 10-స్పీకర్ JBL మ్యూజిక్ సిస్టమ్ వంటివి ఉన్నాయి.


Click it and Unblock the Notifications








