అందరూ ఎదురుచూసిన రోజు రానే వచ్చింది.. లాంచ్‌కు ముందే షోరూమ్‌లకు టాటా పంచ్ ఫేస్‌లిఫ్ట్
కొత్త ఏడాదిలో టాటా మోటార్స్ మరోసారి మార్కెట్‌లో సందడి చేయడానికి సిద్ధమవుతోంది. ఎంతో మంది వినియోగదారులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న కొత్త టాటా పంచ్ ఫేస్‌లిఫ్ట్ మైక్రో SUVను కంపెనీ జనవరి 13 (మంగళవారం) అధికారికంగా లాంచ్ చేయనుంది. ఇప్పటికే పంచ్ దేశవ్యాప్తంగా మంచి క్రేజ్‌ను సంపాదించగా, ఇప్పుడు ఫేస్‌లిఫ్ట్ వెర్షన్‌తో ఆ క్రేజ్‌ను మరింత పెంచాలని టాటా ప్రయత్నిస్తోంది. ఈ కొత్త టాటా పంచ్ ఫేస్‌లిఫ్ట్‌లో పూర్తిగా రిఫ్రెష్ చేసిన డిజైన్ కనిపించనుంది. ముందు భాగంలో మరింత ఆకర్షణీయమైన స్టైలింగ్, ఆధునిక టచ్‌తో కూడిన ఎలిమెంట్స్ ఇవ్వడం వల్ల ఇది ఇప్పటి మోడల్ కంటే మరింత ప్రీమియం లుక్‌ను అందించనుంది. అంతేకాదు, ఈ కారులో డజన్ల కొద్దీ కొత్త ఫీచర్లు జోడించడంతో, మైక్రో SUV సెగ్మెంట్‌లో ఇది మరింత బలమైన ప్రత్యర్థిగా మారనుంది.
ఇప్పటికే టాటా మోటార్స్ దేశవ్యాప్తంగా తన డీలర్‌షిప్‌లకు కొత్త పంచ్ ఫేస్‌లిఫ్ట్ డెలివరీని ప్రారంభించింది. దీనికి సంబంధించిన కొన్ని ఫోటోలు సోషల్ మీడియా, ఆన్‌లైన్ వేదికలపై లీక్ కావడంతో, కార్ లవర్స్‌లో ఆసక్తి పెరిగింది. ఈ లీక్ అయిన చిత్రాల ద్వారా కొత్త పంచ్‌లో చేసిన డిజైన్ మార్పులు, ఫీచర్ల అప్‌డేట్స్ గురించి కొంత స్పష్టత లభిస్తోంది. కంపెనీ ఇప్పటికే ఈ SUVకు సంబంధించిన కీలక వివరాలను దశలవారీగా వెల్లడిస్తోంది.

తాజాగా, గురువారం నాడు కొత్త పంచ్ ఫేస్‌లిఫ్ట్‌లో అందుబాటులో ఉండే రంగుల వివరాలను కూడా ప్రకటించింది. ఈ కారు మొత్తం 6 ఆధునికమైన, ట్రెండీ రంగుల్లో మార్కెట్‌లోకి రానుంది. అవి సైంటిఫిక్ బ్లూ, కూర్గ్ క్లౌడ్స్ (సిల్వర్), బెంగాల్ రూజ్ (రెడ్), కారామెల్, డేటోనా గ్రే, ప్రిస్టైన్ వైట్. ఈ కలర్ ఆప్షన్లు యువతతో పాటు కుటుంబ వినియోగదారులను కూడా ఆకట్టుకునేలా రూపొందించబడ్డాయి.
వేరియంట్ల విషయానికి వస్తే, కొత్త టాటా పంచ్ ఫేస్‌లిఫ్ట్ స్మార్ట్, ప్యూర్, ప్యూర్ ప్లస్, అడ్వెంచర్, అక్యంప్లిష్డ్, అక్యంప్లిష్డ్ ప్లస్ S అనే మొత్తం 6 వేరియంట్లలో అందుబాటులో ఉండనుంది. ప్రతి వేరియంట్‌లో డిజైన్, ఫీచర్ల పరంగా స్పష్టమైన తేడాలు ఉండేలా టాటా మోటార్స్ ప్లాన్ చేసింది. ఇప్పటికే మంచి అమ్మకాలతో ముందున్న పంచ్, ఈ ఫేస్‌లిఫ్ట్ వెర్షన్‌తో మళ్లీ మైక్రో SUV సెగ్మెంట్‌లో తన ఆధిపత్యాన్ని నిలబెట్టుకోవాలని చూస్తోంది.

టాటా మోటార్స్ ఇప్పటివరకు కొత్త పంచ్ ఫేస్‌లిఫ్ట్ పవర్‌ట్రెయిన్ వివరాలను అధికారికంగా వెల్లడించలేదు. అయితే, ఇండస్ట్రీ వర్గాల సమాచారం ప్రకారం, ఈ కొత్త మోడల్‌లో ప్రస్తుతం మార్కెట్లో ఉన్న పంచ్‌లోని ఇంజిన్ ఆప్షన్లనే కొనసాగించే అవకాశం ఎక్కువగా ఉంది. అంటే, ఇందులో 1.2-లీటర్ నేచురల్ ఆస్పిరేటెడ్ పెట్రోల్, 1.2-లీటర్ టర్బో పెట్రోల్, 1.2-లీటర్ CNG పవర్‌ట్రెయిన్ ఆప్షన్లు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది.
ఈ ఇంజిన్‌లకు 5-స్పీడ్ మాన్యువల్, ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌లు జత చేయబడతాయని దాదాపుగా ఖరారైనట్టే భావిస్తున్నారు. మైలేజ్ విషయానికి వస్తే, సుమారు 19 నుంచి 27 కిలోమీటర్ల వరకు మైలేజ్ ఇవ్వగలదని అంచనా. ధర పరంగా ఎక్స్-షోరూమ్ ధర రూ. 5.3 లక్షల నుంచి రూ. 10 లక్షల వరకు ఉండవచ్చని అంచనా, ఇది మైక్రో SUV సెగ్మెంట్‌లో దీనిని మరింత పోటీగా నిలబెట్టనుంది.

డిజైన్, ఫీచర్ల విషయంలో కొత్త పంచ్ ఫేస్‌లిఫ్ట్ పెద్ద అప్‌డేట్‌తో రానుంది. బయట భాగంలో ఆకర్షణీయమైన LED హెడ్‌ల్యాంప్‌లు, LED DRLలు, LED ఫాగ్ ల్యాంప్‌లు, అలాగే వెనుక భాగంలో కనెక్ట్ చేయబడిన LED టెయిల్ లైట్లు, దీనితో పాటు రియర్ డీఫాగర్, రెయిన్ సెన్సింగ్ వైపర్లు వంటి ఉపయోగకరమైన ఫీచర్లు కూడా అందించనున్నారు. వేరియంట్‌ను బట్టి 15 లేదా 16 అంగుళాల అల్లాయ్ వీల్స్ లభించనున్నాయి.
క్యాబిన్‌లోకి వస్తే, కొత్త పంచ్ ఫేస్‌లిఫ్ట్‌లో అందంగా డిజైన్ చేసిన ఇంటీరియర్‌తో పాటు 5 సీట్ల లేఅవుట్ ఉంటుంది. వేరియంట్ ఆధారంగా ఇందులో 8-అంగుళాలు లేదా 10.2-అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, 7-అంగుళాల డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్, వైర్‌లెస్ ఆండ్రాయిడ్ ఆటో, ఆపిల్ కార్‌ప్లే వంటి ఆధునిక ఫీచర్లు లభిస్తాయి. అంతేకాదు,టైప్-సి ఫాస్ట్ ఛార్జర్, పుష్-బటన్ స్టార్ట్/స్టాప్, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, వాయిస్ అసిస్టెంట్‌తో సన్‌రూఫ్ వంటివి ఉంటాయి.


Click it and Unblock the Notifications








